
Urmila Matondkar Tests Positive For COVID-19: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సినీ పరిశ్రమలో కూడా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇటీవలె హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌కు కరోనో సోకగా తాజాగా నటి ఊర్మిళ మాటోండ్కర్ కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, హోం క్వారంటైన్‌లో ఉండి, చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వాళ్లందరూ ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించేకోవాలని తెలిపింది. అంతేకాకుండా ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ దీపావళి వేడుకలు జరుపుకోవాలని కోరింది.
చదవండి: అంచనాలు పెంచేసిన 'ఆర్‌ఆర్‌ఆర్'...విజువల్ అదిరిపోయింది
పునీత్‌కి మాటిస్తున్నాను.. ఆ పిల్లలను నేను చదివిస్తా: విశాల్