
సాక్షి, ముంబయి : శివసేన మాజీ కార్పొరేటర్‌ను అతి దారుణంగా హత్య చేశారు. బయటకు వెళ్లి తన ఇంటికి తిరిగొస్తున్న ఆయనను గుర్తు తెలియని దుండగులు దాడి చేసి చంపేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అశోక్ సావంత్ (62) అనే వ్యక్తి గతంలో శివసేన కార్పొరేటర్‌గా పనిచేశాడు. టెలివిజన్ రంగంలోకి కూడా అడుగుపెట్టిన ఆయనకు ఇటీవల పెద్ద మొత్తంలో బెదిరింపులు వస్తున్నాయి.
ఈ విషయాన్ని పోలీసులు కూడా ఆయనకు చెబుతూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే, ఆదివారం రాత్రి 11గంటల ప్రాంతంలో తన స్నేహితుడిని కలిసి వస్తుండగా ఇంటికి 200 మీటర్ల దూరంలో గుర్తు తెలియని దుండగులు నేరుగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment