'ఓకేకానీ.. అది ఎప్పుడు చేస్తారో చెప్పండి' | Welcoming RSS chief Mohan Bhagwat's remarks on construction of a Ram temple: shivasena | Sakshi
Sakshi News home page

'ఓకేకానీ.. అది ఎప్పుడు చేస్తారో చెప్పండి'

Published Sun, Dec 6 2015 11:56 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM

'ఓకేకానీ.. అది ఎప్పుడు చేస్తారో చెప్పండి'

'ఓకేకానీ.. అది ఎప్పుడు చేస్తారో చెప్పండి'

ముంబయి: శివసేన పార్టీ మరోసారి బీజేపీని, ఆరెస్సెస్ను టార్గెట్ చేసింది. తాను బతికుండగానే రామ మందిరం నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పిన ఆరెస్సెస్ చీఫ్‌ మోహన్ భగవత్ వ్యాఖ్యలను తాము ఆహ్వానిస్తున్నామని, అయితే ఆయన కేవలం ప్రకటనలతో సరిపెడితే సరిపోదని ఆ పార్టీ పేర్కొంది.

సరిగ్గా రామమందిరం ఎప్పుడు పూర్తి చేస్తారో తమకు స్పష్టతనివ్వాలని, ఒక తేదిని ప్రకటించాలని ఆ తేదీలోగా రామమందిరం పూర్తవుతుందని చెప్పాలని డిమాండ్ చేసింది. తన అధికారిక పత్రిక సామ్నాలో ఆదివారం రాసిన ఎడిటోరియల్లో శివసేన ఈ వ్యాఖ్యలను చేసింది. ఈ అంశం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉందని ఇక అలా ఉంచడానికి వీల్లేదని వెంటనే ఓ పరిష్కారం కనుగొనాలని ఆయన డిమాండ్ శివసేన సూచించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement