రాజకీయాల్లో ఫేక్ డిగ్రీలు ట్రెండ్ గా మారాయి | Fake Degrees Have Become a Political Trend: Uddhav Thackeray | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో ఫేక్ డిగ్రీలు ట్రెండ్ గా మారాయి

Published Fri, Jun 26 2015 9:08 AM | Last Updated on Mon, Sep 17 2018 5:12 PM

రాజకీయాల్లో ఫేక్ డిగ్రీలు ట్రెండ్ గా మారాయి - Sakshi

రాజకీయాల్లో ఫేక్ డిగ్రీలు ట్రెండ్ గా మారాయి

ముంబయి: అవకాశం వచ్చినప్పుడల్లా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బీజేపీపై చిర్రుబుర్రులాడే శివసేన పార్టీ మరోసారి పరోక్షంగా విమర్శల దాడి చేసింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేరును ప్రస్తావించకుండానే.. అసలు నకిలీ డిగ్రీలనేవి ఒక ట్రెండ్గా మారింది.. ఇలాంటి పనులు ఎందుకు చేస్తారో అంటూ శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే అన్నారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. 'నకిలీ డిగ్రీలు కలిగి ఉండటం రాజకీయాల్లో ట్రెండ్గా మారింది. ఏదైన ఒక మంచిపనిని సక్రమంగా చేయాలి. దాని కోసం ఎందుకు తప్పుడు మార్గాల్లో వెళతారు' అని వ్యాఖ్యానించారు.

ఇటీవల మహారాష్ట్రకు చెందిన విద్యాశాఖ మంత్రి వినోద్ తవదే, కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై నకిలీ డిగ్రీలు కలిగి ఉన్నారని కేసులు నమోదైన నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమైంది. అంతేకాకుండా మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి పంకజ్ ముండే పై వచ్చిన రూ.200 కోట్ల రూపాయల కుంభకోణం అంశంపై కూడా ఉద్దవ్ స్పందించారు. ఇది అత్యంత ముఖ్యమైన విషయమైనా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని, నిర్ణయాన్ని వెలువరించలేదని ముఖ్యమంత్రి ఫడ్నవీస్కు లేఖ రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement