బీజేపీ, ‘సేన’ల కయ్యాల కాపురం
- విశ్లేషణ
బీజేపీ, శివసేనల మధ్య నేటి మైత్రి... విడాకులు తీసుకుని, మళ్లీ పెళ్లాడ కుండానే తిరిగి చేస్తున్న సంసారం వంటిది. ఈ బంధం గతానికి సంబంధించినది, అధికారంలోకి తిరిగి రావాల్సిన అవసరంతో ఏర్పడినది.
దేశంలోని ఇతర అన్ని ప్రాంతాలలో లాగే కాంగ్రెస్ మహారాష్ట్రలో కూడా బలహీనపడింది. నరేంద్ర మోదీ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి రివాజుగా ఆ పార్టీ భార తీయ జనతా పార్టీ ప్రభు త్వానికి ప్రతిపక్షం పాత్రను పోషిస్తోంది. అయినా అది నిస్తేజంగానే ఉంది. కాంగ్రెస్‌కు ఒకప్పటి భాగస్వామి అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) సైతం అంత కంటే మెరుగ్గా లేదు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం నుంచి శివసేన ఎప్పుడు తప్పుకుంటే అప్పుడు ఆ స్థానంలోకి ప్రవే శించగల శక్తిని సమకూర్చుకుంటోందనే అనుమా నాలను అది రేకెత్తిస్తోంది.
ప్రభుత్వంలో చేరకుండా, తప్పుకోకుండా శివ సేన వారాల తరబడి తాత్సారం చేస్తుండటంతో బీజేపీ మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు... బయట నుంచి మద్దతును ఇస్తామంటూ ఎన్‌సీపీ ముందుకు వచ్చింది. ఈ పరిణామం శివసేనపై విచిత్రమైన రీతిలో ప్రభా వాన్ని నెరపింది. సందు దొరికితే చాలు ఎన్‌సీపీ తన స్థానంలోకి చొరబడిపోతుందనే భయం దానికి పట్టుకుంది. దీంతో అది తన సొంత బ్రాండు హిందుత్వనూ, దాని పట్ల శ్రద్ధనూ తగ్గించింది. ఆవశ్యకంగానే చతుర్ముఖ పోటీగా సాగిన ఎన్నికల పోరులో మంచి ఫలితాలనే సాధించగలిగిన శివ సేన అలాంటి స్థితిలో పడటం విచారకరమే.
భారతీయ జనతా పార్టీ, శివసేనల మధ్య నేడున్న మైత్రిని విడాకులు తీసుకుని, మళ్లీ పెళ్లి చేసుకోకుండానే తిరిగి చేస్తున్న సంసారంతో తప్ప మరి దేనితోనూ పోల్చలేం. ఈ బంధం గతానికి సంబంధించినది, అధికారంలోకి తిరిగి రావాల్సిన అవసరం వల్ల ఏర్పడినది. ఇక వైరం, సుదీర్ఘ వైవా హిక జీవితం తర్వాత 2014లో విడిపోవడం నుంచి పుట్టుకొచ్చినది. అప్పటి పెళ్లిలో బీజేపీ ఛోటా భాగ స్వామి. సంప్రదాయక హిందూ వివాహంలో భర్త పట్ల భార్య వినమ్రంగా, విధేయంగా ఉండాల్సిందే.
ఒకరినొకరు ఎరుగని వారేమీ కాని ఈ జంట మధ్య పోరు రోజురోజుకూ విద్వేషపూరితమైన దిగా, అమర్యాదకరమైనదిగా దిగజారుతున్న అను చిత సన్నివేశం మహారాష్ట్రలో నేడు ప్రదర్శితమౌ తోంది. 2014 శాసనసభ ఎన్నికల వరకు వారు మిత్రులు గానే ఉన్నా... ఆ ఎన్నికల్లో వారు ప్రతి మాటలోనూ విద్వేషం ఉట్టిపడేలా ఒకరితో ఒకరు పోరాడారు. వారిక శాశ్వతంగా విడిపోయినట్టేనని అంతా అనుకున్నారు. అయితే, బీజేపీ ఉండాల్సి నట్టు వినమ్రంగా, విధేయమైన భాగస్వామిగా ప్రవర్తించే నడవ డికను శివసేన అలవరుచుకున్నట్టు అనిపించింది. కానీ అలవరచుకోలేదు. గుడ్డు, గుడ్డుతో వేసిన అట్టు కూడా తనకు దక్కాలని శివ సేన నిర్ణయించుకుంది. దేవేంద్ర ఫడ్నవీస్ 2014 అక్టోబర్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో అది డిసెంబర్ 2014లో మోసపూరితంగా చేరింది. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా అది బీజేపీని దూషించసాగింది. అది సతాయింపును మించిపోయింది. ప్రభుత్వానికి సంబంధించినంత వరకు శివసేన అంతర్గత ప్రతిపక్షం. ప్రతిపక్ష బెంచీలలోని కాంగ్రెస్, ఎన్‌సీపీలు నెరవేర్చాల్సిన బాధ్యతలను అది వాటికి తప్పించింది. అవి రెండూ ప్రతిపక్షమనే భావనకు అస్పష్టమైన నీడ లుగా మిగిలాయి.
గతవారం బీజేపీ, శివసేనలు తమలోని చెడు నంతా బయట పెట్టుకున్నాయి. శివసేన సాగిం చిన విమర్శల దాడిని బీజేపీ కూడా అంతే తీవ్రమైన మాటలతో తిప్పికొట్టింది. అవి తిట్లకు లంకించుకోవడం అందులో భాగం మాత్రమే. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో శివసేన కూడా భాగస్వామే. సోషల్ మీడియాలో విద్వేషపూరిత మైన పోస్టర్లు వెలిశాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సైతం ఆ మిత్రపక్షం వదిలిపెట్టలేదు. ఇది సాధారణంగా కూటమిలోని సాధారణమైన అంత ర్గత కుమ్ములాటలను, ఒకరినొకరు దెప్పి పొడుచు కోవడాలను మించిపోయింది. తమది పవిత్రమైన పార్టీ, మచ్చలేని చరిత్ర అన్నట్టుగా ఏక్‌నాథ్ ఖడ్సే చేత శివసేన బలవం తంగా రాజీనామా చేయించింది. దీంతో ఈ రభస ఖడ్సే సొంత పట్టణం జల్‌గావ్‌లో వీధులకు సైతం ఎక్కింది.
శివసేన జిత్తులమారితనానికి పాల్పడటమే గాక బీజేపీతో పోరుకు దిగడం ద్వారా అది ఎన్‌సీపీ బలాన్ని క్షీణింపజేసే అవకాశాన్ని కోల్పో తోంది. బీజేపీకి కయ్యాలమారి భాగస్వామిగా ఉండ టానికి బదులుగా అది భరోసాను కల్పించే దిగా ఉండి 1999 నుంచి 2014 వరకు ఎన్‌సీపీ మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తులను కోరాల్సింది. ఎన్‌సీపీ ప్రముఖ నేత మాజీ మంత్రి ఛగన్ భుజబల్, అతని సమీప బంధువు ఇంకా బె యిల్ లేకుండా నిర్బంధంలోనే ఉన్నారు. అంత కంటే చిన్నపాటి కుంభకోణంలో అతని కుమారులలో ఒకరిపై కూడా కన్నేసి ఉంచారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్‌సీపీ మాజీ రాష్ట్ర అధినేత, మంత్రి సునీల్ తత్కారేలపై దర్యాప్తులు బలహీనంగా ఉన్నాయి.
అయితే శివసేన ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై, ప్రత్యేకించి 2017లో ఎన్నికలు జరగ నున్న బంగారు గుడ్లూ, బాతూ కూడా అయిన ముంబై స్థానిక ప్రభుత్వ ఎన్నికలపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తోంది. బీజేపీకి ఎలాంటి అవకా శమూ లేకుండా చేయాలని కత్తులు దూస్తోంది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో, ముందు కేంద్రంలో భాగస్వామి అయిన శివసేనకు స్థానిక సంస్థలపై ఉన్న పట్టును తప్పించడం వైపు బీజేపీ మొగ్గు చూపుతోంది. కాబట్టి శివసేన అలా భావించడాన్ని అర్థం చేసుకోగలం. దీంతో అది ఎన్‌సీపీని తక్కువ ప్రాధాన్యంగల ప్రత్యర్థిగా పరిగణిస్తోంది. కాస్త ముందో వెనుకో శివసేన ఇందుకు చింతించాల్సి రావచ్చు.
- మహేష్ విజాపుర్కార్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈమెయిల్: mvijapurkar@gmail.com