ఈ పొత్తు కత్తి మీద సాము
విశ్లేషణ
పదవులకు దూరంగా ఉండి, బీజేపీ నిఘాదారుగా ఉంటుందని ఫడ్నవిస్ అన్నారు. అయితే బీజేపీ కార్పొరేటర్లు అవినీతికి పాల్పడకుండా ఉండాలి. ఆ స్థాయి నైతికతను ప్రదర్శించే అవకాశం తక్కువే.
ముంబై మేయర్ పదవి కోసం భారతీయ జనతా పార్టీతో శివసేన హోరాహోరీ పోరు సాగించింది. బీజేపీపై అది ఆఖరు క్షణంలో ఆధిక్యతను సాధించి ఓడించింది. అయినా తాము వంచనకు గురయ్యామని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు భావిస్తుండాలి. అతి సంపన్న వంతమైన ఆ నగర పాలక సంస్థను గెలుచుకో వడం ద్వారా సమకూరే ప్రయోజనాలన్నింటినీ పొందాలని రెండు పార్టీలూ తాపత్రయపడ్డాయి. గతంలోనైతే శివసేనకు లభించిన రెండు ఓట్ల స్వల్ప ఆధిక్యత కనీసం మేయర్ పదవికి పోటీ పడటానికి సరిపోయేది. తక్కువ ఓట్లున్న పార్టీ నామ మాత్రంగా అభ్యర్థులను నిలబెట్టేది.
గ్రేటర్ ముంబై కార్పొరేషన్ కోసం సాగిన విద్వేషపూరిత ప్రచారం తర్వాత ఉద్ధవ్‌కు సంబంధించి అదే సహజమైన ముగింపు అయి ఉండేది. అయితే పోటీపడుతున్న రెండు పక్షా లలో దేనితోనూ కలిసేది లేదని ఇతర పార్టీలు తిర స్కరించాయి. దీంతో బీజేపీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తమ వ్యూహ రచనను మార్చారు. నగర పాలక సంస్థలోని అన్ని పదవులకు పోటీ నుంచి బీజేపీ దూరంగా ఉంటుందని ప్రకటిం చారు. అయితే ఈ వ్యూహంలో ఇమిడివున్న పలు అంతరార్థాల కారణంగా శివసేన తన తిట్ల దండకాన్ని తిప్పి రాయాల్సి వస్తుంది.
పురపాలక సంస్థలో తమ పార్టీ లాంఛన ప్రాయమైన ప్రతిపక్షంగా ఉండదని, ఆ సంస్థ లోని పారదర్శకతపై, తప్పులపై నిఘా వేస్తుం దని బీజేపీ ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభు త్వంలో శివసేన భాగస్వామి రూపంలోని ప్రతి పక్షంగా వ్యవహరించేది. ఇప్పుడు శివసేన సృష్టించే ఆ తలనొప్పి బాగా తగ్గిపోయింది. ఎంతగానో ఆశపడ్డ నగర ప్రభుత్వమనే ఆట వస్తువు లభించింది కాబట్టి శివసేన ప్రభుత్వం నుంచి వైదొలగే అవకాశం సన్నగిల్లిపోయింది.
పంచాయతీరాజ్ సంస్థలకు జరిగిన ఎన్ని కల్లో బీజేపీ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో గణ నీయ విజయాలను సాధించింది. దీనికి కారకు డైన ఫడ్నవిస్ ముంబై మునిసిపల్ కార్పొరేష న్‌పై నియంత్రణను సాధించలేని తమ అశక్త తను ఒక విధమైన గెలుపుగా మలిచారు. కార్పొ రేషన్ పదవులపై శివసేనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినందువల్ల బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వా నికి ఇక ఎలాంటి ముప్పూ లేదు. అయినా, శివ సేన తన కాల్పనిక ఆత్మ గౌరవాన్ని కాపాడుకో డానికి తరచుగా గుర్రుమంటూ ఉండవచ్చు.
ఉదాహరణకు, పౌర పాలనలో పారదర్శక తకు హామీని కల్పించడం కోసం పదవీ విరమణ చేసిన ముగ్గురు అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటును పౌర పాలనా సంస్థల న్నిటికీ వర్తింప జేయాలని శివసేన కోరుతోంది. ఇదే ప్రమాణాన్ని రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సమావేశాలకు కూడా వర్తింపచేసి, ప్రతిపక్ష నేతను, మీడియాను ఆ సమావేశాలకు అనుమ తించాలని ఇటీవల శివసేన కోరింది. దీంతో పారదర్శకత గురించి ఎక్కువగా మాట్లాడే బీజేపీ అయోమయంలో పడింది.
అలాంటి పారదర్శకత అవసరమే కావచ్చు. కానీ అవి తేలికగా వచ్చేవిగానీ లేదా తేలికగా అమలయ్యేవి గానీ కాకపోవచ్చు. రాజ కీయవేత్తలు దృష్టిని కేంద్రీకరించేది తాము అందుకున్న పదవుల నుంచి వ్యక్తిగత ప్రయోజ నాలను సాధించుకోవడంపైనే తప్ప, పరిపాల నపై కాదు. బీజేపీ, తన సొంత క్యాడర్లను, ప్రత్యేకించి 82 మంది కార్పొరేషన్ సభ్యులను అవినీతికి పాల్పడకుండా ఉండాలని, తమ నిఘా నేత్రాల ముందే అవినీతి జరగకుండా నివారించాలని కోరాల్సి ఉంటుంది. వారు ఆ స్థాయి నైతికతను ప్రదర్శించే అవకాశం తక్కువే. అయినా ఆ పని చేశామని అది చెప్పుకోవచ్చు కానీ పాలనా యంత్రాంగపు నాణ్యతను పౌరులు సులువుగానే గ్రహించగలుగుతారు.
బీజేపీ సాధించామని చెప్పుకునే సుపరి పాలనను పౌరులు తమకు అనుభవంలోకి వచ్చే వాస్తవాలతో పోల్చి చూస్తారు. పగిలిపోయి, దురాక్రమణలకు గురైన రోడ్డు పక్క పాద చారుల బాటలపై వారు రోజూ నడుస్తుంటారు. అవి అలా ఉండాల్సినవి కాదు. సకాలంలో, సరి పడేటంత లభించని నీటి కోసం పౌరులు పడి గాపులు పడాల్సి వస్తోంది. పరిస్థితి అలా ఉండా ల్సినది కాదు. చెత్తను ఎప్పటికప్పుడు తరలిం చాలి. కానీ అది జరగదు. పౌరులకు గతుకులు, గుంతలు లేని రోడ్లపై ప్రయాణం కావాలి. కానీ అతి తరచుగా జరిగే రోడ్ల మరమ్మతులు వాస్త వంగా కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకోవడానికేనని, ఎవరితో కలసి వారు ఆ పని చేస్తారో మీకు తెలుసు. ఎవరితో కుమ్మక్కై చట్టవిరుద్ధమైన భవనం నిర్మిస్తున్నారో పౌరుల కళ్లకు కనబడు తూనే ఉంటుంది. కాబట్టి ఫడ్నవిస్ తనకు తానే ఒక సవాలును విసురుకున్నారు.
- మహేష్ విజాపృకర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com