రచ్చకెక్కిన కలహాల కాపురం | Mahesh vijapurkar writes on BJP-Shiv Sena fight | Sakshi
Sakshi News home page

రచ్చకెక్కిన కలహాల కాపురం

Published Tue, Feb 14 2017 12:52 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

రచ్చకెక్కిన కలహాల కాపురం - Sakshi

రచ్చకెక్కిన కలహాల కాపురం

విశ్లేషణ
శివసేన, భారతీయ జనతా పార్టీల మధ్య సంబంధం ఎలాంటిదనే ప్రశ్నకు మీరు ఈ మూడు జవాబుల్లో దేన్ని ఎంచుకుంటారు? 1. ఎన్నిక లకు ముందు భాగస్వామ్య పక్షాలు, 2. ఎన్నికల తర్వాతి భాగస్వామ్య పక్షాలు, 3. ప్రత్యర్థి పక్షాలు. వీటిలో ఏది ఎంచుకున్నా మీ జవాబు సరైనదే అవుతుంది.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఒక శివసేన సభ్యుడు కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు. కేంద్రంలో అది బీజేపీకి ఎన్నికల పూర్వపు భాగస్వా మిగా ఉంది. 2014 శాసనసభ ఎన్నికల తర్వాత అది మహారాష్ట్రలో బీజేపీకి ఎన్నికల తర్వాతి భాగస్వామి అయింది. దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వంలో ఆ పార్టీ మంత్రులున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రధాన పుర పాలక సంస్థలు, 23 జిల్లా పరిషత్తుల ఎన్నికల్లో అవి ఒకదానిపైకి ఒకటి కత్తులు దూస్తున్న వైరి పక్షాలుగా ఉన్నాయి.

ఇదంతా చాలా గందరగోళంగా ఉంది, అవునా? శివసేన ఇకపై ఏపార్టీతోనూ ఎన్నికల తర్వాత  ఎలాంటి పొత్తును పెట్టుకోదని ఇటీవల ఆ పార్టీ ఆ ప్రకటించింది. అయినా ఈ స్థితితో ఆ రెండు పార్టీలు హాయిగానే ఉన్నాయని  అనిపిస్తోంది. పైగా శివసేన ఎన్నికలకు ముందటి, తర్వాతి కూటమి నుంచి బయటకు పోతా నని సైతం సూచించింది. అది ప్రస్తుతం ముంబై మునిసి పల్‌ ఎన్నికల్లో బీజేపీతో ఎలాంటి ఆటంకాలు లేని ఏ అడ్డూ అదుపూలేని పూర్తి స్థాయి యుద్ధం సాగిస్తోంది. ఈ ఎన్నికల్లో దక్కే నజరానా తక్కువదేం కాదు... మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ ముంబై పీఠం.  

‘గూండా’ పదం సహా వాడగలిగిన ప్రతి విమర్శ నాత్మక విశేషణాన్ని, శ్లేషను ఉపయోగించారు. మన రాజకీయాల తీరును బట్టి చూస్తే ఈ తీరును అర్థం చేసు కోవడం కష్టమేమీ కాదు. ‘‘ఫిబ్రవరి 23న ఎన్నికల ఫలి తాల వరకు వేచి చూడండి’’ అనే మాటను తరచుగా వాడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అనుబంధం అందరికీ కొట్ట వచ్చినట్టు తెలిసి వస్తుంది. రెండూ ప్రత్యర్థిని చిత్తు చేస్తామనే అంటున్నాయి.

శాసనసభ మధ్యంతర ఎన్నికల గురించి మాట్లా డేంత వరకు కూడా శివసేన పోయింది.  ప్రస్తుతం జరు గుతున్నవి మినీ సార్వత్రిక ఎన్నికలు. కాబట్టి శివసేన తన బలం ఎంతో ప్రదర్శించి చూపగలనని విశ్వసి స్తోంది. బీజేపీ తీరు కూడా అలాగే ఉంది. అయితే, మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతున్న అది మిగతా రెండు న్నరేళ్లు శివసేన మద్దతు లేకుండా ఎలా అధికారం నెరప గలుగుతుందనే ప్రశ్నకు సమాధానం చెప్పడం పట్ల విముఖతను కనబరుస్తోంది.

ఒకవేళ మధ్యంతర ఎన్నికలే జరిగేట్టయితే... బాల్‌ ఠాక్రే జ్ఞాపకాలు, పోస్టర్ల మీద ఆయన చిత్రాలతో బహు ముఖ పోటీలో 66 సీట్లను సాధించిన శివసేన ప్రభుత్వం నుంచి ఎందుకు బయటకు రావడం లేదు? ఈ రౌండు ఎన్నికల ప్రచారం ముగిసే రోజుకు గానీ పరస్పర విరు ద్ధమైన మాటల తదుపరి తనకు ౖపైచేయి లభిస్తుందని అది ఆశిస్తోంది. స్థానిక ఎన్నికల ఫలితాలు విరుద్ధంగా వస్తే అప్పుడు శివసేన ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే సంకటాన్ని ఎదుర్కొంటుంది.

బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నా శివసేన ప్రభుత్వాలలో కొనసాగుతోంది. కానీ మహారాష్ట్రలో అది బీజేపీని నిత్యం దుమ్మెత్తిపోయడం తారస్థాయికి చేరింది. ఇలాంటి వైఖరికి మరేదైనా కూటమైతే దాన్ని సాగనంపేసేదే. కానీ అలాంటి పని చేస్తే కలిగే పర్య వసానం గురించిన ఆందోళన బీజేపీకి ఉంది. ‘‘ఈ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో ఉంటుంది’’ అనే డాబుసరి మాటలతో దాన్ని అది కప్పిపుచ్చుకంటోంది. 288 మంది సభ్యులున్న శాసనసభలో బీజేపీకి ఉన్నది 133 ఎంఎల్‌ఏలే. సభలో ఓటింగ్‌ జరిగిన ప్రతిసారీ కనీసం ఓ డజను ఓట్లను సంపాదిస్తే తప్ప ఆ ప్రభుత్వం మనలేదు. ఏ పార్టీ తనతో చేయి కలుపుతుందనే విష యంలో దానికే స్పష్టత లేదు.

శివసేన ఒకప్పుడు మహారాష్ట్ర అధికార కూటమికి సీనియర్‌ భాగస్వామిగా నేతృత్వం వహించేది. 2014 నుంచి అది ఆ హోదాను అంతవరకు జూనియర్‌ భాగ స్వామిగా ఉన్న బీజేపీకి వదులు కోవాల్సి వచ్చింది. ప్రతిపక్షంగా ఉండటం పట్ల విముఖతతో అది అందుకు అంగీకరించాల్సి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల సంర ంభంలో బీజేపీ, శివసేనతో రెండు కారణాల వల్ల తెగ తెంపులు చేసుకుంది. ఒకటి, మోదీ గెలుపు నేపథ్యంలో తనకిక  భాగస్వాముల అసరం లేదు. రెండు, ఒకవేళ శివసేనతో సంబంధాలు పెట్టుకున్నా మహారాష్ట్ర రాజకీ యాల్లో బీజేపీదే ప్రథమ స్థానమని అది అంగీకరించాలి.

రెండవ అతి పెద్ద పార్టీగా అవతరించిన శివసేన ఈ ద్రోహం గురించి తీవ్రంగా మండిపడుతూ కొద్ది కాలం ప్రతిపక్షంగా ఉంది. కానీ ఫడ్నవీస్‌ ప్రభుత్వంలో చేరి అధికారం పంచుకోవడమనే ప్రలోభానికి లోనైంది. అయితే, అది తన భాగస్వామి హోదాను గుర్తించి, తద నుగుణంగా నడచుకోవడానికి బదులు అంతర్గత ప్రతి పక్షంలానే ఇంతవరకు వ్యవహరిస్తూ వచ్చింది. భార త్‌లో మనం తరచుగా చూసే ఒకే పార్టీలోని అసమ్మతి గ్రూపులాగా పనిచేస్తూ వచ్చింది.
ఒక్కముక్కలో చెప్పాలంటే, అదో కలహాల కాపురం. ఆ కలహాలు ఇప్పుడు రచ్చకెక్కి, ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తున్నాయి. అవును, లేకపోతే మధ్యంతర ఎన్నిక లకు ఎందుకు దిగరు?

- మహేశ్‌ విజాపృకర్‌
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
ఈ మెయిల్‌ : mvijapurkar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement