సాక్షి, ముంబై : శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆదివారం ట్టిటర్‌లో ఓ ప్రముఖ కవి వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘హిందూస్తాన్ ఏ ఒక్కరి సొత్తుకాదు. ఈ దేశ మట్టిలో అందరి రక్తం ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. అంతకు ముందు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశంలోని హిందూ - ముస్లింల మధ్య విభేదాలకు బీజేపీ ప్రయత్నిస్తోందని సంజయ్ ఆరోపించారు.
గతంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే పౌరసత్వ సవరణ చట్టం గురించి మాట్లాడుతూ.. మూడు దేశాల నుంచి వచ్చే శరణార్థులకు ఏ రాష్ట్రంలో ఆశ్రయం కల్పిస్తారు? దీనికి సంబంధించిన ప్రణాళిక ఏమైనా కేంద్రం వద్ద ఉందా? ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, సీఏఏ బిల్లుపై లోక్‌సభలో కేంద్రానికి మద్దతిచ్చిన శివసేన, రాజ్యసభలో మాత్రం ఓటింగ్‌కు గైర్హాజరై సభ నుంచి వాకౌట్ చేసింది. అంతకు ముందు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 35 ఏళ్లుగా బీజేపీతో ఉన్న పొత్తును వదులుకున్న సంగతి తెలిసిందే. చదవండి : రాహుల్ వ్యాఖ్యలపై శివసేన కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment