బనశంకరి: కష్టం వస్తే పరిష్కరించుకుని ముందుకు సాగాలి కానీ, ఘోరాలకు పాల్పడితే జీవితాలు ముగిసిపోతాయి. అదే రీతిలో కుటుంబ కలహాలను తట్టుకోలేక ఓ తల్లి ఇద్దరు పిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘోరం బెంగళూరు కొడిగేహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. తల్లి కుసుమ (35), పిల్లలు శ్రీయాన్ (6), చార్వి (18 నెలలు) మృతులు.
డెత్‌నోట్ రాసి..
వివరాలు.. కొడిగేహళ్లి అపార్టుమెంట్‌లో సురేశ్, కుసుమా దంపతులు నివాసం ఉంటున్నారు. సురేశ్ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్. రెండు రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ చోటుచేసుకుంది. బుధవారం ఉదయం సురేశ్ ఆఫీసుకు వెళ్లిన తరువాత, నా చావుకు నేనే కారణమని కుసుమ డెత్‌నోట్ రాసింది.
ముందుగా ఇద్దరు పిల్లలు ముఖం పై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసింది. తరువాత కుసుమ ప్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి 9.30 గంటలకు భర్త ఇంటికి చేరుకోగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసులు చేరుకుని పరిశీలించి డెత్‌నోట్‌ను స్వా«దీనం చేసుకున్నారు. మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment