
బొమ్మనహళ్లి : భార్య వేధింపులతో 40 పేజీల డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న టెక్కీ అతుల్ కేసు దర్యాప్తును బెంగళూరు నగరం మారతహళ్లి పోలీసులు ముమ్మరం చేశారు. అందులో భాగంగా పరారీలో ఉన్న ఆయన భార్య నిఖితా సింఘానీయాకు సమన్లు జారీ చేశారు.
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాష్ ఈనెల 6వ తేదిన బెంగళురు నగరలోని మారతహళ్లిలో ఉన్న మంజునాథ్ లేఔట్‌లో తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్‌పురలో ఉన్న నిఖితా సింఘానియా ఇంటికి శుక్రవారం వెళ్లగా అక్కడ ఎవరూ లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు.
మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఎఫ్‌ఐర్‌లో నిఖిత, తల్లి నిశా నింఘానియా, చిన్నాన్న సుశిల్ సింఘానియా, సోదరుడు ఆనురాగ్ సింఘానియా పేర్లు ఉన్నా నిఖితాను మాత్రమే విచారణకు హాజరు కావాలని సమన్స్‌లో పేర్కొన్నారు. కాగా కేసు దర్యాప్తు కట్టుదిట్టంగా జరుగుతోందని, ఈకేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని బెంగళూరు నగర పోలిసు కమిషనర్ బీ.దయానంద్ తెలిపారు.
Atul Subhash Case: అతుల్.. అంతులేని ఆవేదన