Nikita Singhania
-
అతుల్ సుభాష్ కేసులో సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
అతుల్ సుభాష్ కేసులో దాఖలైన ఓ పిటిషన్‌పై దేశసర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మనవడిని తమకు అప్పగించాలంటూ అతుల్ తల్లి అంజు దేవి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ క్రమంలో.. నాలుగేళ్ల అతుల్ కొడుకు ఎక్కడ ఉన్నాడన్నదానిపై నిఖితా సింఘానియా తరఫు న్యాయవాది స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఫరిదాబాద్(హర్యానా)లోని బోర్డింగ్స్కూల్లో చదువుతున్నట్లు చెప్పాడు. అంతేకాదు.. ప్రస్తుతం నిఖిత షరతులతో బెయిల్ మీద ఉన్న దృష్ట్యా.. ఆ పిల్లాడిని బెంగళూరుకు రప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిపాడాయన. అయితే.. వచ్చే విచారణ టైంలో ఆ చిన్నారిని కోర్టులో ప్రవేశపెట్టాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. అయితే..అంజు దేవీ(Anju Devi) తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఆరేళ్లలోపు పిల్లలను బోర్డింగ్ స్కూల్‌కు పంపడం ఎడ్యుకేషన్ గైడ్‌లైన్స్‌కు విరుద్ధమని, కాబట్టి అతని సంరక్షణను నాయనమ్మకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో జస్టిస్ నాగరత్న జోక్యం చేసుకుని.. ‘‘ఆ చిన్నారి నాయనమ్మతో గడిపిన సమయం చాలా తక్కువ. ఒకరకంగా చూసుకుంటే పిటిషనర్ ఆ పిల్లాడికి కొత్త ముఖమే అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు. దీంతో.. అంజుదేవి తరఫు లాయర్ గతంలో ఆ నానమ్మ-మనవడు కలిసి దిగిన ఫొటోలను బెంచ్‌కు సమర్పించారు.అయితే నిఖితా సింఘానియా(Nikita Singhania) ఈ కేసులో దోషిగా ఇంకా నిరూపించబడాల్సి ఉందని, కేవల మీడియా కథనాల ఆధారంగా ఆమెను దోషిగా గుర్తించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నందున పిల్లాడి సంరక్షణ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం న్యాయస్థానానికి ఉందని పేర్కొంటూ.. తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది.ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాష్, నిఖిత 2019లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ జంట బెంగళూరుకు వెళ్లి తమ తమ ఉద్యోగాల్లో చేరింది. ఆ మరుసటి ఏడాది వారికి బాబు పుట్టాడు. 2021లో నిఖిత బెంగళూరులోని భర్తను విడిచిపెట్టి కొడుకుతో సహా పుట్టింటికి చేరింది. ఆపై భర్త, అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. అలా.. విచారణ కోసం అతుల్‌ను భార్య స్వస్థలం జౌన్‌పురలోని ఫ్యామిలీ కోర్టుకు కోసం వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో..మానసికంగా, శారీరకంగా అలసిపోయిన అతుల్ సుభాష్(Atul Subash) బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే క్రమంలో తన భార్య, ఆమె కుటుంబం ఏ స్థాయిలో మానసికంగా వేధించిందో పేజీల కొద్దీ రాసిన సూసైడ్ లేఖ, 90 నిమిషాల నిడివితో తీసిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కొడుకును అడ్డుపెట్టుకుని తన భార్య ఆర్థికంగా తనను దోచుకుందని.. న్యాయస్థానంలోనూ తనకు అన్యాయం జరిగిందని, ఇంక తన వల్ల కాకనే ఇలా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడతను. అంతేకాదు.. తన కొడుకును తన తల్లిదండ్రులకు అప్పగించాలని ఆఖరికి కోరికగా కోరాడు. ఈ ఘటన తర్వాత.. లక్షల మంది మద్ధతుతో మెన్టూతో పాటు జస్టిస్ ఈజ్ డ్యూ, జస్టిస్ ఫర్ అతుల్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో కొనసాగాయి.అతుల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు.. పరారీలో ఉన్న నిఖితా సింఘానియాను, ఆమె తల్లీ, సోదరుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. రిమాండ్ విధించారు. అయితే.. వాళ్లకు కోర్టు తాజాగా కండిషనల్ బెయిల్ ఇచ్చింది. ఒకవైపు బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో, మరోవైపు కర్ణాటక హైకోర్టులో.. ఇంకోవైపు సుప్రీం కోర్టులో ఈ కేసుకు సంబంధించిన వివిధ పిటిషన్లపై విచారణ జరుగుతోంది. -
‘డబ్బు కోసమే వేధించి ఉంటే.. అలా ఎందుకు చేస్తా!’
అతుల్ సుభాష్ మృతిలో తనకుగానీ, తన కుటుంబ సభ్యులకుగానీ ఎలాంటి ప్రమేయం లేదని భార్య నిఖితా సింఘానియా చెబుతోంది. ప్రస్తుతం బెంగళూర్ పోలీసుల అదుపులో ఉన్న నిఖిత.. విచారణలో పదే పదే ఈ విషయాన్ని చెబుతున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో టెక్కీగా పని చేసిన అతుల్ సుభాష్.. తన భార్య, ఆమె కుటుంబం డబ్బు కోసం వేధించడం వల్లే చనిపోతున్నానంటూ.. ఓ సుదీర్ఘమైన డెత్‌నోట్ రాసి బలవనర్మణానికి పాల్పడ్డాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే..బెంగళూరు: అతుల్ ఆత్మహత్యపై దుమారం రేగాక.. ఇటు నిఖిత, అటు ఆమె తల్లి, సోదరుడు పరారీలో ఉన్నారు. ఎవరికీ దొరక్కుండా వాట్సాప్ కాల్స్‌తో మాట్లాడుకుంటూ వచ్చారు. చివరకు.. నిఖిత ఓ బంధువుకు రెగ్యులర్ కాల్ చేయడంతో ఆమె ఆచూకీని కనిపెట్టగలిగారు. ఓ కాల్ ఆధారంగా తొలుత నిఖితను, ఆపై నిఖిత ద్వారా ఆమె తల్లి, సోదరుడ్ని పోలీసులు టట్రేస్ చేయగలిగారు. ముగ్గురినీ అరెస్ట్ చేసి బెంగళూరు తరలించిన.. కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కి పంపించారు. అయితే..తన భర్త నుంచి తాను దూరంగా ఉండబట్టి మూడేళ్లు అవుతోందని.. అలాంటప్పడు తాను అతన్ని ఎలా వేధించగలనని ఆమె వాదిస్తోంది. ‘‘డబ్బు కోసమే అతన్ని వేధించి ఉంటే.. అతనికి దూరంగా నేను ఎందుకు ఉంటా?. అతని వెంటే ఉండి వేధించే దాన్ని కదా!’’ అని ఆమె పోలీసులతో చెబుతున్నట్లు తెలుస్తోంది. పైగా అతుల్ తనను అదనపు కట్నం కోసం వేధించాడని.. అందుకే 2022లో తాను కేసు పెట్టిన విషయాన్ని ఆమె పదే పదే ప్రస్తావిస్తోంది.2022లో ఏం జరిగిందంటే..2019లో అతుల్‌తో మా వివాహం జరిగింది. అయితే రెండేళ్లు గడిచాక అదనపు కట్నం కోసం అతుల్, అతని కుటుంబ సభ్యులు తనను శారీరకంగా హింసిస్తున్నారని నిఖితా సింఘానియా యూపీ జౌన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు అసహజ శృంగారం కోసం అతుల్ తనను వేధించేవాడని ఆమె కేసు పెట్టింది. ఇక.. కట్నం కోసం తనను హింసించడాన్ని తట్టుకోలేకే తన తండ్రి గుండె జబ్బుతో మరణించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే..నిఖిత అభియోగాల్ని అతుల్ తన డెత్‌నోట్‌లో ఖండించాడు. తనపై ఆమె పెట్టినవన్నీ తప్పుడు కేసులేనని.. ఆమె తండ్రికి గుండె జబ్బు దీర్ఘకాలికంగానే ఉందని.. కేవలం డబ్బు కోసమే తనను బ్లాక్మెయిల్ చేసేవారని పేర్కొన్నాడతను.ఇంతకీ అతుల్ కొడుకు ఎక్కడ?అతుల్ సుభాష్ కేసులో ఇప్పుడు ఒక్కటే ప్రశ్న వినిపిస్తోంది. అతుల్ నాలుగేళ్ల చిన్నారి ఎక్కడా? అని. ఇదే విషయాన్ని వ్యక్తం చేస్తూ.. అతుల్ తండ్రి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. తన మనవడ్ని తనకు అప్పగించాలని.. తన కొడుకు చివరి కోరిక తీర్చాలంటూ ఆ పెద్దాయన కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే.. అతుల్ మరణం వార్త తెలియగానే ఓ దగ్గరి బంధువు ఇంట్లో ఆ చిన్నారిని నిఖిత తల్లి వదిలేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు చిన్నారిని బెంగళూరుకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.పరారీలో మేనమామ!అతుల్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. బెంగళూరు మరథహల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. చాకచక్యంగా.. నిఖిత(29), నిషా(54), సోదరుడు అనురాగ్(27) అరెస్ట్ చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా బెంగళూరుకు తీసుకురాగలిగారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించడంతో.. పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు. అయితే నిఖిత మేనమామ పరారీలో ఉండడంతో.. అతని కోసం గాలింపు చేపట్టారు. #Justiceisdue -
#Mentoo: ఓ డాక్టర్.. ఓ పోలీస్.. ఇలా ఎందరో?
చట్టం ముందు అందరూ సమానమే.. ఇది అనుకోవడానికే తప్ప ఆచరణలో లేదనేది ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న మాట. ఇంతకాలం పేద-ధనికలాంటి తారతమ్యాలు వినిపిస్తే.. ఇప్పుడు ఆడ-మగగా మారిందది. అతుల్ సుభాష్ అనే టెక్కీ బలవన్మరణం నేపథ్యంతో ఈ చర్చ మరింత వేడిని రాజేస్తోంది. బెంగళూరు, ఢిల్లీ.. ఇలా మెట్రో నగరాల్లో జస్టిస్ ఫర్ అతుల్ పేరిట సంఘీభావ ప్రదర్శనలు చేసే స్థాయికి చేర్చింది. భార్య కుటుంబం పెట్టిన వేధింపులు.. తప్పుడు కేసులను భరించలేక.. వ్యవస్థతో పోరాడటంలో తడబడిన అతుల్ సుభాష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కానీ, అతని చివరి కోరికగా.. న్యాయం కోసం అతని తరఫున మేం పోరాడతాం అంటూ కొందరు భర్తలు రోడ్డెక్కారు. దేశ జనాభాలో ట్యాక్సులు కట్టేవాళ్లలో మగవాళ్లదే సింహభాగం. కానీ, చట్టాలు మాత్రం కేవలం మహిళల పక్షమే వ్యవరిస్తున్నాయని అంటున్నారు. సమాజంలో పురుషుల ప్రాణాలూ ముఖ్యమేనని.. వారికీ చట్టపరమైన రక్షణ కావాలని ముక్తకంఠంతో కోరుతున్నారు వాళ్లు. అయితే.."70 Crore men pay tax in India, not even one welfare scheme for men is funded by our own taxes."Delhi joins Bengaluru in nation wide protests for Atul Subhash's suicide due to harassment by wife and judiciary. pic.twitter.com/RZwJgql0sf— Mick Kay (@mick_kaay) December 14, 2024 అతుల్ ఘటన తర్వాత.. ఈ బర్నింగ్ టాపిక్కు మరో రెండు ఘటనలు తోడయ్యాయి. కర్ణాటకలో హులిమవు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ హెచ్‌సీ తిప్పన్న(34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి రైలు పట్టాలపై పడుకుని చితికిపోయాడు. భార్య, ఆమె కుటుంబం పెట్టే నరకం భరించలేకే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తిప్పన్న రాసిన ఓ సూసైడ్ నోట్ చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు..డిసెంబర్11వ తేదీన.. రాజస్థాన్‌లో హోమియోపతి డాక్టర్ అజయ్ కుమార్(35) కృతినగర్‌లోని తన క్లినిక్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు భార్య వేధింపులే కారణమంటూ లేఖ రాశాడు. భార్యను పచ్చిబూతులు తిడుతూ రాసిన ఆ లేఖలో.. ప్రస్తుత వైవాహిక వ్యవస్థను, ఆ వ్యవస్థ కారణంగా తాను ఎదుర్కొన్న న్యాయపరమైన చిక్కులను, తన నిస్సహాయతను ఆ లేఖలో ప్రముఖంగా ప్రస్తావించాడు. జస్టిస్ ఈస్ డ్యూబెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో ఏఐ ఇంజినీర్‌గా పని చేస్తున్న యూపీవాసి అతుల్ సుభాష్.. నగరంలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన భార్య, ఆమె కుటుంబం తనను ఎంతగా వేధించిందో పే..ద్ద సూసైడ్ నోట్ రాసి.. గంటన్నరపాటు వీడియో తీసి Justice Is Due అని శరీరానికి అంటించుకుని మరీ బలవన్మరణానికి పాల్పడ్డారు. సుప్రీం కోర్టు తన గోడును వినాలని.. తనకు న్యాయం దక్కని తరుణంలో.. తన అస్తికలను కోర్టు బయటే మురికి కాలువలో కలపాలని.. ఒకవేళ న్యాయం దక్కితే పవిత్ర గంగలో కలపాలని డెత్ నోట్లో కోరాడతను. ఈ క్రమంలో పేజీల కొద్దీ అతుల్ వ్యధ.. ముఖ్యంగా తన కొడుకును ఉద్దేశించి రాసిన లేఖ.. చివరి బహుమతి.. అన్నీ చాలామందిని భావోద్వేగానికి గురి చేసింది.ఇక.. తన సోదరుడి మరణం వెనుక ఆయన భార్య నిఖితా సింఘానియా కుటుంబ ప్రొద్భలం ఉందని అతుల్ సోదరుడు మారతహల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిఖిత కోసం అతుల్ చేయగలిగిందంతా చేశాడని.. అయినా తన సోదరుడి ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడతను. ఈ కేసు దీంతో.. బెంగళూరు పోలీసులు ఆమె స్వస్థలం ఔన్పూర్కు పంపించారు. గత మూడు రోజులుగా ఆ టీం దర్యాప్తు జరుపుతోంది. అయితే.. నిందితురాలు నిఖిత ఇంటికి తాళం వేసి ఉండడంతో గోడకు నోటీసులు అంటించారు. కచ్చితంగా పోలీసుల ఎదుట హాజరుకావాల్సిందేనని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అతుల్ మృతి తర్వాత.. రెండ్రోజులకు కొన్ని మీడియా సంస్థలు నిఖిత నివాసానికి చేరుకున్నాయి. ఆమె అందుబాటులో లేకపోగా.. సోదరుడు, తల్లి మాత్రం మీడియాను ఉద్దేశించి దుర్భాషలాడారు. ఆపై రెండ్రోజులకే వాళ్లు కూడా పరార్ కావడం గమనార్హం.ఒక భార్య.. ‘ఏడు’ భరణం కేసులువైవాహిక చట్టాల దుర్వినియోగంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. అలాంటి ఘటనలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఈ ఏడాది ఆగష్టులో చట్టంతో ఆడుకున్న ఓ భార్య ఉదంతం చర్చనీయాంశమైంది..ఒకావిడ తన భర్త నుంచి భరణం కోరుతూ కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ భర్త ఆమెకు ఏడో భర్త. అప్పటికే ఆరుగురు మాజీ భర్తల నుంచి విడాకులు తీసుకుని. భరణం కోసం కోర్టును ఆశ్రయించింది. ఇక.. ఏడో భర్త నుంచి భరణం అడిగిన కేసులో న్యాయమూర్తి ఆ అంశాన్ని ప్రస్తావించారు.SERIAL 498A ACCUSER A WOMAN IN KARNATAKA HAS MARRIED 7 TIMESSTAYED WITH EACH MAX 1 YEARFILED 498A, MAINTENANCE CASES ON ALLTAKEN MONEY FROM 6 HUSBANDSNOW FIGHTING CASE WITH 7TH Despite having all records with him, MiLord not sending her to JailJAI HO EQUALITY 🙏 pic.twitter.com/3zpdBFNP1m— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) July 26, 2024ప్రతీ భర్తతో ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఆమె కాపురం చేసి.. విడాకులకు వెళ్లిందని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ విషయం ప్రస్తావిస్తూ.. చట్టంతో మీరు ఆడుకుంటున్నారు అని మహిళను సదరు జడ్జి మందలించారు. అలాగే.. ఆ ఆరుగురి నుంచి ఆమె భరణం భారీగానే పుచ్చుకుందట. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కూడా. కర్ణాటకలోనే మరో ఉదంతంలో..ఓ మహిళ తన మాజీ భర్త నుంచి నెలకు రూ.6,16,300 భరణం ఇప్పించమని కోర్టును కోరింది. అయితే ఈ పిటిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి.. అంత ఖర్చులు ఉంటే డబ్బులు సంపాదించుకోవాలంటూ ఆ మహిళకు సూచించింది. ఇదే సమయంలో భరణం అనేది భర్తకు శిక్ష కాదని గుర్తు చేసింది.ఇదీ చదవండి: అతుల్ మృగంలా ప్రవర్తించాడు: నికిత ఆరోపణ -
టెక్కీ అతుల్ భార్యకు నోటీసులు
బొమ్మనహళ్లి : భార్య వేధింపులతో 40 పేజీల డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న టెక్కీ అతుల్ కేసు దర్యాప్తును బెంగళూరు నగరం మారతహళ్లి పోలీసులు ముమ్మరం చేశారు. అందులో భాగంగా పరారీలో ఉన్న ఆయన భార్య నిఖితా సింఘానీయాకు సమన్లు జారీ చేశారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాష్ ఈనెల 6వ తేదిన బెంగళురు నగరలోని మారతహళ్లిలో ఉన్న మంజునాథ్ లేఔట్లో తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్పురలో ఉన్న నిఖితా సింఘానియా ఇంటికి శుక్రవారం వెళ్లగా అక్కడ ఎవరూ లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఎఫ్ఐర్లో నిఖిత, తల్లి నిశా నింఘానియా, చిన్నాన్న సుశిల్ సింఘానియా, సోదరుడు ఆనురాగ్ సింఘానియా పేర్లు ఉన్నా నిఖితాను మాత్రమే విచారణకు హాజరు కావాలని సమన్స్‌లో పేర్కొన్నారు. కాగా కేసు దర్యాప్తు కట్టుదిట్టంగా జరుగుతోందని, ఈకేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని బెంగళూరు నగర పోలిసు కమిషనర్ బీ.దయానంద్ తెలిపారు.Atul Subhash Case: అతుల్.. అంతులేని ఆవేదన -
భర్త బలవన్మరణం.. భార్య నిఖిత రియాక్షన్ ఏంటంటే..!
అతుల్ సుభాష్.. బలవన్మరణంతో దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారి తీసిన వ్యక్తి. భార్య కుటుంబం బ్లాక్‌మెయిలింగ్‌తో మానసిక వేధింపులకు గురైన భర్తగా.. మూడేళ్లుగా కన్నకొడుకును కళ్లారా చూసుకోలేని తండ్రిగా.. డబ్బు కోసం కుటుంబాన్ని ఇబ్బందిపెట్టలేని కొడుకుగా.. చివరకు నిస్సహాయస్థితిలో ఉన్న వ్యక్తి ఆత్మహత్యే గతి అనుకున్నాడు. అతుల్ సుభాష్ కేసుతో.. మగవాళ్ల కోసం #Mentoo ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ కేసు గురించి తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన భార్య నిఖితా సింఘానియా Nikita Singhania పేరు ట్రెండ్ అవుతోంది.నిఖితా సింఘానియా.. 2019లో ఓ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా అతుల్ సుభాష్‌కు పరిచయమైంది. ఈ ఇద్దరూ ఐటీ ప్రొఫెషనల్స్. అదే ఏడాది ఇద్దరికీ పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. ఆ తర్వాత బెంగళూరుకు ఈ జంట మకాం మార్చింది. వీరిద్దరికి ఓ బాబు పుట్టాడు. అయితే.. ఏడాది తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.కొడుకును తీసుకుని నిఖిత తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. గత మూడేళ్లుగా ఆమె సుభాష్‌కు దూరంగానే ఉంటోంది. ఈ క్రమంలోనే జౌన్పూర్ కోర్టులో ఆమె విడాకుల కోసం కేసు వేసింది. అలాగే.. అతుల్, ఆయన కుటుంబ సభ్యులపై మొత్తం 9 కేసులు నమోదు చేయించింది. శారీరకంగా హింసించడం, అసహజ శృంగారం, పైగా వరకట్న వేధింపులతో తన తండ్రిని కుంగదీసి గుండెపోటుతో చనిపోయేలా చేయడం.. లాంటి అభియోగాలు అందులో ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తోంది. అయితే అతుల్ మరణంతో.. అతన్ని అంతగా వేధించిన ఆమెను ఉద్యోగం తొలగించాలంటూ సదరు కంపెనీలకు పలువురు రిక్వెస్టులు పెడుతున్నారు.ఇదిలా ఉంటే.. తన సోదరుడిని అతని భార్య నిఖిత, ఆమె కుటుంబ సభ్యులు మానసికంగా వేధించి ఆత్మహత్యకు ఉసిగొల్పారని ఆరోపిస్తూ అతుల్ సోదరుడు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. నిఖిత, ఆమె కుటుంబ సభ్యులతో కలిపి ఐదుగురిపై కేసు నమోదయ్యింది. ఈ కేసు విచారణ కోసం ఓ దర్యాప్తు బృందాన్ని బెంగళూరు పోలీసులు జౌన్‌పూర్‌కు పంపారు. నిఖితతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు విచారించనున్నారు. మరోవైపు.. తన డెత్‌నోట్‌లో ఓ జడ్జిపైనా ఆయన సంచలన ఆరోపణలు చేశాడు. అయితే..ఈ పరిణామాలపై నిఖిత స్పందించాల్సి ఉంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఓ మీడియా సంస్థ జౌన్‌పూర్‌లోని నిఖిత ఇంటికి వెళ్లింది. కానీ, వాళ్లు మీడియా ప్రతినిధులను అనుమతించలేదు. పైగా నిఖిత తల్లి, ఆమె సోదరుడు మీడియా ప్రతినిధులను దుర్భాషలాడారు. మరోవైపు..Family of #NikitaSinghania The infamous brother-in-law and mother-in-law. pic.twitter.com/M3h5svutdJ— ShoneeKapoor (@ShoneeKapoor) December 11, 2024సుభాష్ చేసిన ఆరోపణలకు ఆమె దగ్గర సమాధానం ఉందని, అతిత్వరలోనే స్పందిస్తుందని నిఖిత మేనమామ చెబుతున్నాడు. అతుల్ చేసిన ఆరోపణలన్నీ నిరాధరమైనవేనని అంటున్నారాయన. ‘‘నిఖిత ప్రస్తుతం అందుబాటులో లేదు. ఆమె రాగానే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. అతుల్ సుభాష్ తన డెత్‌నోట్‌లో చేసినవన్నీ ఉత్త ఆరోపణలే. నా పేరు ఎఫ్ఐఆర్లో ఉందని మీడియా కథనాలను బట్టే తెలిసింది. కానీ, ఇందులో నాకు ఎలాంటి ప్రమేయం లేదు. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే నిఖిత కుటుంబ సభ్యులే అందిస్తారు’’ అని చెప్పారాయన.ఇదీ చదవండి: ఇంటర్నెట్ను కదిలించిన భర్త గాథ ఇది!కొడుక్కి అతుల్ సందేశంయూపీకి చెందిన అతుల్ సుభాష్.. బెంగళూరులో ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. తనపై తప్పుడు కేసులు వేసి.. భారీగా డబ్బులు గుంజేందుకు తన భార్య నిఖిత కుటుంబం ప్రయత్నించిందన్నది ఆయన ఆరోపణ. ఈ మేరకు సూసైడ్ నోట్లోనూ ఆయన ఆ వివరాలను రాశారు. అలాగే గంటన్నరపాటు ఓ సెల్ఫీ వీడియో చిత్రీకరించారు. తన 24 పేజీల డెత్‌నోట్‌లో నాలుగేళ్ల కొడుకు కోసం ఆయన ఓ సందేశం ఉంచారు. మూడేళ్లుగా దూరంగా ఉన్న తన బిడ్డ మొహం కూడా తనకు గుర్తు లేదని.. కొడుకును అడ్డుపెట్టుకుని తనలాంటి నిస్సహాయుడైన తండ్రి నుంచి డబ్బులు గుంజాలని ప్రయత్నించారని.. అందుకే ఈ వ్యవస్థను నమ్మొద్దంటూ తన కొడుకుకు సూచిస్తూ ఆయన ఆ సందేశంలో పేర్కొన్నారు. అలాగే.. తన కొడుకు కోసం చివరిసారిగా తాను కొన్న కానుకను ఎలాగైనా అందించాలంటూ లేఖలో ప్రాధేయపడుతూ.. దానిని అక్కడే ఓ కుర్చీలో ఉంచాడు.కొడుకును చూడాలంటే 30 లక్షలా?అతుల్ సుభాష్ తన భార్య నిఖిత కుటుంబం ఎంతగా వేధించింది.. ఆయన తన నోట్లో ప్రస్తావించారు. నిఖిత తండ్రికి పదేళ్లుగా గెండు జబ్బు, డయాబెటిక్ ఉందని.. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆయనకు చికిత్స అందిందని.. ఈ క్రమంలోనే ఆయన మరణించాడే తప్ప వరకట్న వేధింపులు కాదని అతుల్ చెప్పారు. అలాగే.. తనపై పెట్టిన తప్పుడు కేసుల సెటిల్మెంట్కు భార్య నిఖిత మొదట కోటి రూపాయలు అడిగిందని, ఆపై ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్ చేసిందని ఆరోపించారాయన. తన కొడుకు మెయింటెనెన్స్ కోసం నెలకు కోర్టు 40,000 చెల్లించమని ఆదేశిస్తే.. తాను రూ.80 వేలు ఇచ్చేవాడినని.. ఒకానొక టైంలో రూ.2 లక్షలు ఇచ్చానని, అయినా కూడా నిఖిత తనను కొడుకును చూసేందుకు అనుమతించలేదని చెప్పారు. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. కొడుకును చూడాలంటే రూ.30 లక్షలు ఇవ్వాలని నిఖిత తల్లి నిషా తనను డిమాండ్ చేసిందని అతుల్ లేఖలో పేర్కొన్నారు. ఇదీ చదవండి: భర్తపై వ్యక్తిగత పగతో కేసులా?.. సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు‘‘నువ్వింకా చావలేదా?(నవ్వుతూ). కోర్టుల చుట్టూ తిరగడం కంటే చావే మేలని ఈపాటికే నువ్వు అనుకుని ఉంటావేమో. అయినా నువ్వు చచ్చినా.. ఆ సొమ్ము నీ తల్లిదండ్రుల నుంచి రాబడతాం. ఈ దేశంలో మొగుడు చచ్చినా.. పెళ్లాలకు రావాల్సినవన్నీ కరెక్ట్‌గానే అందుతాయి’’ అంటూ నిఖిత తల్లితో జరిగిన సంభాషణను యధాతథంగా సూసైడ్ లేఖలో పేర్కొన్నారాయన.జౌన్పూర్ ఫ్యామిలీ కోర్టులో.. నిఖిత వేసిన కేసుల విచారణ సందర్భంగా జరిగిన ఉదంతాన్ని కూడా అతుల్ తన లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి తప్పుడు కేసుల వల్ల ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు: అతుల్అయితే నువ్వింకా చావలేదేం: నిఖితజడ్జి నవ్వుతూ.. నిఖితను బయటకు పంపించి.. ‘‘ఐదు లక్షలు ఇస్తే కేసులో నీకు అనుకూలంగా తీర్పు ఇస్తా’’. ఇలాంటి న్యాయవ్యవస్థలో మనం బతుకుతున్నామని.. రాష్ట్రపతి దృష్టికి ఈ విషయం వెళ్లాలని అతుల్ తన డెత్‌నోట్‌లో పేర్కొన్నారు. 🔥 FULL VIDEO OF ATUL SHUBHASH: A Heart-Wrenching Tale of Injustice - Only for Those with a Strong Heart 🔥 "Everyone should know the truth about him. #JusticeForAtulSubhash #HumanRightsDay2024 pic.twitter.com/oPgSHMfWTK— RATEINDIANPOLITICIAN.IN (@rateneta) December 10, 2024మృగంలా ప్రవర్తించారు: నికిత అతుల్ ఆత్మహత్య కేసు నేపథ్యంలో.. 2022లో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన వివరాలు బయటకొచ్చాయి. జౌన్‌పూర్‌కు చెందిన నికితకు 2019లో బిహార్‌కు చెందిన సుభాష్‌తో వివాహం జరిగింది. వీరు బెంగళూరులో ఉంటూ అక్కడే పనిచేసేవా రు. తన భర్త అతుల్ తనను కొట్టేవాడని, భార్యాభర్తల సంబంధం విషయంలో మృగంలా ప్రవర్తించేవాడని నికితా సింఘానియా ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లిలో ఇచి్చన కట్నంతో సంతృప్తి పొందక మరో 10 లక్షలు డిమాండ్ చేశారన్నారు. కట్నంకోసం తనను శారీరకంగా, మానసికంగా హింసించారని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులకు చెబితే సర్దుకుని పోవాలని సూచించేవారని ఫిర్యాదులో వెల్లడించారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదని, మద్యం తాగి భర్త తనను కొట్టడం ప్రారంభించాడని, బెదిరించి తన జీతం మొత్తాన్ని అతని ఖాతాకు బదిలీ చేసుకునేవారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన అత్తామామలు పదేపదే వేధించడం వల్లే తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని, 2019 ఆగస్టు 17న గుండెపోటుతో మరణించారని ఆమె తెలిపారు. -
Justiceisdue: సోషల్ మీడియాను కదిలించిన ఓ భర్త గాథ
#JusticeForAtulSubhash.. #Justiceisdue ఎక్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన అంశం. భార్య పెట్టిన వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడిన ఓ భర్తకు మద్దతుగా సోషల్ మీడియాలో నడుస్తున్న క్యాంపెయిన్ ఇది. మేధావులు, న్యాయ నిపుణులు, పేరు మోసిన జర్నలిస్టులు ఈ క్యాంపెయిన్‌లో భాగం అవుతున్నారు. అయితే ఇలాంటి కేసులు కొత్తేం కాదు కదా!. మరి దీనినే ఎందుకు అంతలా హైలైట్ చేయడం?. ఎందుకంటే.. అతుల్ కేసులో తీవ్రత అంతలా ఉంది కాబట్టి.‘‘ఒకవేళ నాకు న్యాయం జరిగితే.. నా అస్తికలను పవిత్రంగా గంగలో నిమజ్జనం చేయండి. లేకుంటే కోర్టు బయట మురికి కాలువలో కలిపేయండి’’ అంటూ.. చివరి కోరికలతో సహా సుదీర్ఘమైన సూసైడ్ నోట్ రాశారు 34 ఏళ్ల అతుల్ సుభాష్. అది సుప్రీం కోర్టు దాకా చేరాలని ఆయన చేసిన విన్నపం, చనిపోవడానికి ముందు ఆయన చేసుకున్న ఏర్పాట్లు.. తన నాలుగేళ్ల కొడుకు కోసం ఇచ్చిన గిఫ్ట్.. ఇవన్నీ పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి. భార్య, ఆమె కుటుంబం డబ్బు కోసం ఎలా హింసించింది.. ఆఖరికి న్యాయమేంటో చెప్పాల్సిన జడ్జి కూడా తనకు అన్యాయం చేశారంటూ.. ఆ వీడియోలో వివరించి చెప్పారు.👉ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాష్‌కు 2019లో నిఖితా సింగ్‌తో వివాహమైంది. ఈ జంటకు ఒక బాబు. బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో మంచి పొజిషన్లో పని చేశారాయన. భార్య నిఖితా సింగ్ కూడా టెక్కీనే. మారతహళ్లిలోని మంజునాథ లేఅవుట్లో ఈ కుటుంబం నివసించేది. అయితే.. కొంతకాలంగా భార్య నిఖితా సింగ్ కుటుంబంతో ఆయనకు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె యూపీలోని తన సొంతూరుకు వెళ్లిపోయింది. ఆపై అతుల్‌పై కేసులు పెట్టింది. ఆపై విడాలకు కోసం కోర్టును ఆశ్రయించిందామె.👉ఈ కేసు విషయమై బెంగళూరు నుంచి యూపీకి 40సార్లు తిరిగాడాయన. వెళ్లిన ప్రతీసారి ఓ కొత్త కేసు కోర్టు ముందుకు వచ్చింది. తీవ్ర మానసిక వేదనకు గురైన ఆయన.. డిసెంబర్ 8వ తేదీన బెంగళూరులోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోవడానికి ముందు.. తన సోదరుడికి ఓ మెయిల్ పెట్టాడు. అలాగే తన వైవాహిక జీవితంలో తాను ఎంతలా నరకం అనుభవించింది గంటన్నర పాటు వీడియోగా చిత్రీకరించారు.సంబంధిత వార్త: భార్య కేసు పెట్టిందని.. డెత్‌నోట్ రాసి! आत्महत्या से पहले का #AtulSubhash का 63 मिनट का ये पूरा वीडियो सुनकर निःशब्द और विचलित हूं। उफ़ ! #JusticeForAtulSubhash pic.twitter.com/lFDQZFLEBV— Vinod Kapri (@vinodkapri) December 10, 2024👉నిఖిత, అతుల్‌ను విడిచి వెళ్లి 8 నెలలపైనే అవుతోంది. యూపీ జౌన్పూర్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుందామె. విడాకులకు కారణాలుగా.. అతుల్ మీద గృహ హింస, అసహజ శృంగారం లాంటి అభియోగాలతో తొమ్మిది కేసులు నమోదు చేయించింది. అంతేకాదు అతుల్‌పై కేసులు వెనక్కి తీసుకోవాలంటే.. రూ.3 కోట్ల రూపాయల డబ్బు ఇప్పించాలంటూ కోర్టు బయట బేరసారాలకు దిగింది. ఒకవైపు మానసికంగా.. మరోవైపు కోర్టు చుట్టూ తిరిగి శారీరకంగా అలసిపోయాడు. చివరకు.. తనకు ఎదురైన వేదనను భరించలేక బలవనర్మణానికి పాల్పడ్డారు.న్యాయమూర్తే అపహాస్యం చేస్తే..న్యాయవ్యవస్థ.. నేర వ్యవస్థగా మారితే ఎలా ఉంటుంది?.. ఆ వ్యవస్థలో అవినీతి ఏస్థాయిలో పేరుకుపోయిందో చెబుతూ.. సుభాష్ తన సూసైడ్ నోట్లో ఆవేదన వెల్లగక్కారు. ఈ క్రమంలో జౌన్పూర్ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఒకరు.. తనను ఎంతగా హింసించింది పేర్కొన్నారు. తన కేసును విచారించిన ఓ మహిళా జడ్జి.. తను నుంచి భారీగా లంచం డిమాండ్ చేశారనే విషయాన్ని ప్రస్తావించారాయన. కోర్టులో విచారణకు వెళ్లినప్పుడల్లా.. నిఖిత తనపై కొత్త ఆరోపణలు చేసేదని.. ఒకానొక టైంలో సదరు జడ్జి తనను అపహాస్యం చేస్తూ నవ్వేవారని చెప్పారాయన. అంతేకాదు.. తనకు అనుకూలంగా తీర్పు కోసం ఇవ్వడం కోసం లక్షల సొమ్మును డిమాండ్ చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. విచారణ తేదీలను షెడ్యూల్ చేయడానికి కూడా లంచం అడిగారని, ఇవ్వకపోవడంతో గతంలో తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ మేరకు ఈ ఆరోపణల సంగతి చూడాలంటూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆయన కోరారు. 👉ప్రతీ చట్టం ఆడవాళ్ల కోసమేనా?. మగవాళ్ల కోసం ఏమీ ఉండదా? అని అతుల్ సోదరుడు బికాస్ వేసిన ప్రశ్న.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన భార్య కోసం తన సోదరుడు చేయగలిగిదంతా చేశాడని.. అయినా ఇలాంటి పరిస్థితుల మధ్య నలిగిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. మహిళల రక్షణ కోసం మన దేశంలో చట్టాల్లో కొన్ని సెక్షన్లు ఉన్నాయి. అందునా.. వివాహితల కోసం వైవాహిక చట్టాలు ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ, ఆ చట్టాలను దుర్వినియోగం చేస్తే.. ఏం చేయాలనే దానిపైనే న్యాయవ్యవస్థకు స్పష్టత కొరవడింది. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానమే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోవడం కోసం.. చట్టాన్ని ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారు కొందరు.సరైన ఆధారాలు లేకుండా.. అడ్డగోలు ఆరోపణలతో నిందితులుగా చట్టం ముందు నిలబెడుతున్నారు. ఇలాంటి కేసుల వల్ల కోర్టుకు పనిభారం పెరిగిపోతోంది.కొన్ని కేసుల్లో.. అతిశయోక్తితో కూడిన ఆరోపణల వల్ల బంధువులు సైతం చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆ న్యాయస్థానాలు కచ్చితంగా న్యాయ పరిశీలనలు జరపాలనే అభిపప్రాయం వ్యక్తమవుతోంది.అన్నింటికి మించి..ఇలాంటి తప్పుడు కేసులు సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. బాధితులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే అతుల్ లాంటివాళ్లెందరో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ‘‘నా కేసులో ఎలాంటి వివరాలు దాచకండి. ప్రతీ విషయం అందరికీ తెలియాలి. అప్పుడే మన దేశంలో న్యాయ వ్యవస్థ ఎంత భయానకంగా ఉందో, చట్టాల దుర్వినియోగం ఎంత ఘోరంగా జరుగుతుందో తెలుస్తుంది’’ అంటూ అతుల్ తన చివరి నోట్లో రాశారు. అతుల్ నోట్ ఆధారంగా నిఖిత, ఆమె కుటుంబ సభ్యులపై బెంగళూరులో కేసు నమోదైంది. మరోపక్క అతుల్ సూసైడ్ నోట్లో ప్రస్తావించినట్లే.. తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని.. ఈ కేసు వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా కొందరు తెలియజేస్తున్నారు. ఎలాగైనా బాధితుడికి న్యాయం జరగాలని కోరుకుంటూ చిన్నపాటి ఉద్యమాన్నే నడిపిస్తున్నారు.