The mysterious case of the death
-
విపక్షాలపై సీబీఐ అస్త్రం
సీఎల్పీ సమావేశంలో ఏకగ్రీవ ఆమోదం బెంగళూరు : ఐఏఎస్ అధికారి డీ.కే రవి అనుమానాస్పద మృతి కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న విపక్ష భారతీయ జనతా పార్టీ, జేడీఎస్‌ల పై కూడా సీబీఐ అస్త్రాన్ని ప్రయోగించాలని బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం (సీఎల్పీ)లో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆయా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో సంచలనం సృష్టించిన కేసులు, కుంభకోణాలను సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలనే సిద్ధరా మయ్య సూచనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు అందరు ప్రజాప్రతినిధులు ఓటేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చట్టసభల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించేందుకు వీలుగా బుధవారం సీఎల్పీ సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... రాజకీయ ప్రయోజనాలు ఆశించే అటు బీజేపీతో పాటు ఇటు జేడీఎస్‌లు డీ.కే.రవి మృతికి సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించాలని నానా రాద్ధాంతం చేశాయని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇదే విషయాన్ని బడ్జెట్ సమావేశాల్లో పదేపదే ప్రస్తావిస్తూ ఉభయ సభల కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. వీరికి తగిన జవాబు చెప్పడానికి వీలుగా ఆయా పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో లేదా ఆ.యా పార్టీల నాయకులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కేసులను సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా రఘుపతి భట్ (బీజేపీ) భార్య పద్మప్రియ అసహజ మరణం, ప్రస్తుత జేడీఎస్ శాఖ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ పని కోసం రూ.150 కోట్లను లంచంగా తీసుకున్న విషయంతోపాటు 2011లో రాష్ట్రంలోని వివిధ చర్చిల పై జరిగిన దాడులు తదితర ఆరేడు కేసులను సీబీఐకి అప్పగించాలని సిద్ధరామయ్య పేర్కొన్నప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ తమ సమ్మతిని తెలియజేశారు. ఇందుకు సీఎం సిద్ధరామయ్య...కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు చెబుతూ ఈ కేసుల సంబంధించి న్యాయనిపుణులతో చర్చించి ప్రభుత్వ పరంగా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మంత్రుల తీరుపై గరం... డీ.కే రవి మరణానికి సంబంధించి విపక్షాల ఆరోపణలకు చట్టసభల్లోకాని, బయట కాని మంత్రులు సరైన సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారని సీఎల్పీ సమవేశంలో పాల్గొన్న నాయకులు ఆక్రోశం వ్యక్తం చేశారు. పూటకో వివరణ ఇవ్వడంతో పాటు ఒక మంత్రి ఇచ్చిన సమధానానికి మరో మంత్రి ఇచ్చిన సమాధానానికి సారుప్యత లేక పోవడం వల్ల విపక్షాల దృష్టిలోనే కాక ప్రజల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చులకనయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీఐడీ దర్యాప్తు పూర్తికాకుండానే చట్టసభల్లో డీ.కే రవిది ఆత్మహత్యగా పేర్కొన్న హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ వల్లే ప్రజల దృష్టిలో కాంగ్రెస్ ప్రభుత్వం పరువు పోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సీఎల్పీ సమావేశం అనంతరం రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ మంత్రి హెచ్.ఆంజనేయ మీడియాతో మాట్లాడుతూ... ‘డీ.కే రవి కేసుకు సంబంధించి ఎమ్మెల్యేలు కాని ఎమ్మెల్సీలు కాని మంత్రులను విమర్శించలేదు. చట్టసభలకు కచ్చితంగా హాజరు కావాలని సిద్ధరామయ్య సూచించారు. గత బీజేపీ, జేడీఎస్ ప్రభుత్వాలు ఉన్న సమయంలో జరిగిన కొన్ని కేసులకు సంబంధించి న్యాయవిచారణ జరిపించే విషయం కూడా సీఎల్పీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.’ అని పేర్కొన్నారు. -
ఎట్టకేలకు సీబీఐ చేతికి..
డి.కె.రవి మృతి కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ఉభయ సభల్లో సీఎం సిద్ధు ప్రకటన తామెన్నడూ సీబీఐ దర్యాప్తును కాదనలేదని వెల్లడి బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కె.రవి అనుమానాస్పద మృతి కేసును ఎట్టకేలకు రా ష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. రాష్ట్ర ప్ర జలు, రవి తల్లిదండ్రుల డిమాండ్‌కు స్పందిం చి డి.కె.రవి మృతి కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉభయ సభల్లో సోమవారం ప్రకటించారు. రవి మృతి అనంతరం కేసును తప్పుదారి పట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ప్రతిపక్షా ల విమర్శల్లో ఎంతమాత్రం నిజం లేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. అంతేకాక తామేనాడూ ఈ కేసును సీబీఐకి అప్పగించబోమని ప్రకటించలేదని, అయితే కేసుకు సంబంధించిన ప్రాథమిక నివేదిక అందిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని మాత్రమే చెప్పామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనల కు తెరదించినట్లైంది. ఇక ఈ ప్రకటనకు ముం దు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉభయ సభ ల్లో సుదీర్ఘంగా ప్రసంగించారు. ‘నీతి, నిజాయితీలతో వ్యవహరించే ఓ అధికారిని కోల్పోవడం మాకు ఎంతో బాధను కలిగించింది. అయితే ఏదైనా ఘటన జరిగిన వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించిన దాఖలాలు లేవు. మన రాష్ట్ర పోలీసులపై మాకు నమ్మకం ఉంది, అంతేకాదు కేసు సీబీఐకి అప్పగించిన సందర్భంలో మన రాష్ట్ర పోలీసుల సహాయ, సహకారాలు, పర్యవేక్షణ అవసరమవుతాయి. అం దుకే కేసును సీబీఐకి అప్పగించడంలో కాస్తం త ఆలస్యం జరిగింది తప్పితే మరే ఉద్దేశం లేదు’ అని ముఖ్యమంత్రి సిద్ధరామ య్య పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ఈ ఘటనకు సంబంధిం చి విపక్షాలు గత వా రం రోజులుగా వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమం త్రి సిద్ధరామయ్య మండిపడ్డా రు. ‘మీరు అధికారం లో ఉన్న సమయంలో ఏ కేసును సీబీఐకి అప్పగించలేదు. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఎన్నో సంఘటనల్లో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు ఆదేశించాల్సిందిగా మేం అప్పట్లో డిమాండ్ చేశాం. అయితే సీబీఐ అంటే కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మ అంటూ అప్పటి బీజేపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు అంగీకరించలేదు. అలాం టిది ప్రస్తుతం ప్రతిపక్షాలు వ్యవరిస్తున్న తీరు చూస్తుంటే సిగ్గనిపిస్తోంది’ అని విమర్శిం చా రు. దీంతో ప్రతిపక్ష సభ్యులు సిద్ధరామ య్య వ్యాఖ్యలకు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో కా స్తంత వెనక్కు తగ్గిన సీఎం సిద్ధరామయ్య ప్రజల మనోభావాలు, రవి తల్లిదండ్రుల కోరికను గౌరవిస్తూ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తున్నామని ప్రకటించారు. ఇక సీఐడీ పోలీసుల విచారణకు సంబంధించిన మధ్యంతర నివేదికను చట్టసభల్లో ప్రవేశపెట్టడం ద్వారా అందరి అనుమానాలను నివృత్తి చేయాలని భావించామని, అయితే మధ్యంతర నివేదికను చట్టసభల్లో ప్రవేశపెట్టరాదంటూ హై కోర్టు స్టే విధించిన నేపథ్యంలో న్యాయస్థానం పై ఉన్న గౌరవంతో నివేదికను చట్టసభలకు అందజేయలేదని సిద్ధరామయ్య ప్రకటించారు. -
నందితా ‘డెత్ నోట్’ రాసింది
రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్ స్పష్టీకరణ బెంగళూరు: శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి విద్యార్థిని నందితా అనుమానాస్పద మృతి కేసులో పోలీసులకు లభించిన ఉత్తరం నందితా రాసిన ‘డెత్‌నోట్’ అని ఫోరెనిక్స్ నిపుణులు నిర్ధారించారని రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్ వెల్లడించారు. బుధవారమిక్కడి ఎంఎస్ రామయ్య ఆస్పత్రి ప్రాంగణంలో ‘చిన్నారులపై లైంగిక దౌర్జన్యాలు’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కేజే జార్జ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇలాంటి ఘటనల్లో తక్షణమే స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. ఇక నుండి డిసెంబర్ నెలను ‘మహిళలు, చిన్నారులపై దౌర్జన్యాల నిరోధక మాసం’గా పరిగణించనున్నట్లు తెలిపారు.