ఎట్టకేలకు సీబీఐ చేతికి..
డి.కె.రవి మృతి కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ఉభయ సభల్లో సీఎం సిద్ధు ప్రకటన
తామెన్నడూ సీబీఐ దర్యాప్తును కాదనలేదని వెల్లడి
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కె.రవి అనుమానాస్పద మృతి కేసును ఎట్టకేలకు రా ష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. రాష్ట్ర ప్ర జలు, రవి తల్లిదండ్రుల డిమాండ్‌కు స్పందిం చి డి.కె.రవి మృతి కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉభయ సభల్లో సోమవారం ప్రకటించారు. రవి మృతి అనంతరం కేసును తప్పుదారి పట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ప్రతిపక్షా ల విమర్శల్లో ఎంతమాత్రం నిజం లేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. అంతేకాక తామేనాడూ ఈ కేసును సీబీఐకి అప్పగించబోమని ప్రకటించలేదని, అయితే కేసుకు సంబంధించిన ప్రాథమిక నివేదిక అందిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని మాత్రమే చెప్పామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనల కు తెరదించినట్లైంది. ఇక ఈ ప్రకటనకు ముం దు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉభయ సభ ల్లో సుదీర్ఘంగా ప్రసంగించారు. ‘నీతి, నిజాయితీలతో వ్యవహరించే ఓ అధికారిని కోల్పోవడం మాకు ఎంతో బాధను కలిగించింది. అయితే ఏదైనా ఘటన జరిగిన వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించిన దాఖలాలు లేవు.
మన రాష్ట్ర పోలీసులపై మాకు నమ్మకం ఉంది, అంతేకాదు కేసు సీబీఐకి అప్పగించిన సందర్భంలో మన రాష్ట్ర పోలీసుల సహాయ, సహకారాలు, పర్యవేక్షణ అవసరమవుతాయి. అం దుకే కేసును సీబీఐకి అప్పగించడంలో కాస్తం త ఆలస్యం జరిగింది తప్పితే మరే ఉద్దేశం లేదు’ అని ముఖ్యమంత్రి సిద్ధరామ య్య పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ఈ ఘటనకు సంబంధిం చి విపక్షాలు గత వా రం రోజులుగా వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమం త్రి సిద్ధరామయ్య మండిపడ్డా రు. ‘మీరు అధికారం లో ఉన్న సమయంలో ఏ కేసును సీబీఐకి అప్పగించలేదు. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఎన్నో సంఘటనల్లో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు ఆదేశించాల్సిందిగా మేం అప్పట్లో డిమాండ్ చేశాం. అయితే సీబీఐ అంటే కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మ అంటూ అప్పటి బీజేపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు అంగీకరించలేదు. అలాం టిది ప్రస్తుతం ప్రతిపక్షాలు వ్యవరిస్తున్న తీరు చూస్తుంటే సిగ్గనిపిస్తోంది’ అని విమర్శిం చా రు. దీంతో ప్రతిపక్ష సభ్యులు సిద్ధరామ య్య వ్యాఖ్యలకు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో కా స్తంత వెనక్కు తగ్గిన సీఎం సిద్ధరామయ్య ప్రజల మనోభావాలు, రవి తల్లిదండ్రుల కోరికను గౌరవిస్తూ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తున్నామని ప్రకటించారు. ఇక సీఐడీ పోలీసుల విచారణకు సంబంధించిన మధ్యంతర నివేదికను చట్టసభల్లో ప్రవేశపెట్టడం ద్వారా అందరి అనుమానాలను నివృత్తి చేయాలని భావించామని, అయితే మధ్యంతర నివేదికను చట్టసభల్లో ప్రవేశపెట్టరాదంటూ హై కోర్టు స్టే విధించిన నేపథ్యంలో న్యాయస్థానం పై ఉన్న గౌరవంతో నివేదికను చట్టసభలకు అందజేయలేదని సిద్ధరామయ్య ప్రకటించారు.