బెంగళూరు: ఎట్టకేలకు కర్ణాటక ప్రభుత్వం దిగొచ్చింది. ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతి కేసు విచారణను సీబీఐకి అప్పగించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సోమవారం ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కర్ణాటక అసెంబ్లీలో మాట్లాడుతూ 'ఏ ఒక్కరి మరణం రాజకీయ అంశం కాకుడదని అన్నారు. ప్రతి పక్షాలు ఈ విషయంలో తమను తప్పుబడుతున్నాయి. ఈ సందర్భంగా ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని మేం నిర్ణయం తీసుకున్నాము. బీజేపీలాగా మేం కాదు. సీబీఐపై నమ్మకం ఉంది. హైకోర్టు ఆదేశాల నేపధ్యంలో ఈ కేసుపై సీఐడీ ఇచ్చిన నివేదికను బయటపెట్టబోం' అని వివరణ ఇచ్చారు. రవి మరణాంతరం తీవ్ర ఆందోళనలు తలెత్తిన విషయం తెలిసిందే.