
మూలాల్ని మరచిపోకూడదు!
యువత ఎంత ట్రెండీగా ఉన్నా, ఫార్వార్డ్‌గా ఆలోచించినా మన మూలాల్ని మాత్రం మరచిపోకూడదు. ఈ నేపథ్యంలోనే ‘రామ్‌లీల’ సినిమా ఉంటుందంటున్నారు దాసరి కిరణ్‌కుమార్.
యువత ఎంత ట్రెండీగా ఉన్నా, ఫార్వార్డ్‌గా ఆలోచించినా మన మూలాల్ని మాత్రం మరచిపోకూడదు. ఈ నేపథ్యంలోనే ‘రామ్‌లీల’ సినిమా ఉంటుందంటున్నారు దాసరి కిరణ్‌కుమార్. ‘జీనియస్’ తర్వాత రామదూత క్రియేషన్స్ పతాకంపై ఆయన నిర్మిస్తోన్న సినిమా ఇది. హవీష్, అభిజిత్, నందిత ముఖ్యతారలు. రచయిత శ్రీపురం కిరణ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు.
3 పాటలు, 5 రోజుల టాకీ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ -‘‘అమెరికాలో ఓ తెలుగబ్బాయి నిజ జీవితంలో జరిగిన కథ ఇది. స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. మలేసియాలోని అందమైన ప్రదేశాల్లో 21 రోజులు చిత్రీకరణ జరిపాం’’ అని తెలిపారు. ఎస్. గోపాలరెడ్డి ఛాయాగ్రహణం, విస్సు సంభాషణలు ఈ సినిమాకు హైలైట్స్ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ముత్యాల రమేశ్, సమర్పణ: లంకాల బుచ్చిరెడ్డి, సారథ్యం: కోనేరు సత్యనారాయణ.