పెళ్లి చేసుకోమని అమ్మ పోరు పెడుతోంది: అభిజిత్‌ | Abhijeet Talk About Miss Perfect Web Series | Sakshi
Sakshi News home page

ఇంట్లో పెళ్లి పోరు ఉంది.. అదే నా మైనస్‌: హీరో అభిజిత్‌

Published Wed, Jan 31 2024 4:33 PM | Last Updated on Wed, Jan 31 2024 4:51 PM

Abhijeet Talk About Miss Perfect Web Series - Sakshi

కొన్ని విషయాల పట్ల నేను చాలా సెలెక్టివ్‌గా ఉంటాను. నాకు నచ్చనిది ఏ పని చేయను. పెళ్లి విషయంలో కూడా ఇలానే  ఉన్నాను. మా అమ్మ పెళ్లి చేసుకోమని పోరు పెడుతుంటుంది. నాకేమో ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు. నాకు నచ్చిన క్వాలిటీస్‌ ఉన్న అమ్మాయి దొరికే వరకు కాంప్రమైజ్‌ కాలేను. ఇంత సెలెక్టివ్ గా ఉండటం కూడా నాకు కొద్దిగా మైనస్‌ అవుతుంది’అని అన్నారు యంగ్‌ హీరో, ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ అభిజిత్‌.  చాలా కాలం తర్వాత ఆయన నటించిన తాజా వెబ్‌ సిరీస్‌ ‘మిస్ పర్ఫెక్ట్’. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో "మిస్ పర్ఫెక్ట్" స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా తాజాగా అభిజిత్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ లో నేను రోహిత్ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. చాలా లేజీ పర్సన్ గా కనిపిస్తా. జీవితంలో ఎలాంటి లక్ష్యమంటూ ఉండదు. ఏదో డబ్బు కోసం ఉద్యోగం చేస్తుంటాడు గానీ అదీ సీరియస్ గా తీసుకోడు. రోహిత్ కు ఇష్టమైన విషయం ఒక్కటే వంట చేయడం. అది మాత్రం శ్రద్ధగా చేస్తుంటాడు.

 నా రియల్ లైఫ్ లో రోహిత్ లాంటి క్యారెక్టర్స్ ను చాలామందిని చూశాను. నా ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్లు ఉన్నారు. ఉద్యోగంలో ఇష్టంతో ఉండలేక...బయటకు వచ్చి బిజినెస్ తో రిస్క్ చేయలేక ఆ సంఘర్షణలో ఉండిపోతారు. ఎవరైనా ఉద్యోగం కాదని వేరే పనిచేయాలనుకుంటే అది 30-35 ఇయర్స్ లోనే చేయాలి. 40 దాటిన తర్వాత మీరు రిస్క్ చేయాలన్నా చేయలేరు. అప్పుడు ఇంకా బాధ్యతలు పెరిగిపోతాయి.

► ఈ మధ్య పెళ్లి గోల, మోడరన్ లవ్ అనే సిరీస్ లు చేశాను. ఆ తర్వాత నటించిన వెబ్ సిరీస్ ఇదే. "మిస్ పర్ఫెక్ట్" అనేది రొమాంటిక్ కామెడీ సిరీస్. ఏదైనా కథ విన్నప్పుడు నేను చేయగలనా, నాకు సెట్ అవుతుందా అనేది ఆలోచిస్తా. మనకు నచ్చనివి చేసి రిలీజ్ చేయడం ఈజీ. కానీ ఆడియెన్స్ కు నచ్చదు. వాళ్లు ఏదో చేసేస్తే చూసే ట్రెండ్ ఇప్పుడు లేదు. మనకు సెట్ అయ్యే మూవీ , క్యారెక్టర్ చేస్తేనే ఆదరిస్తున్నారు.

 బయటి వాళ్లకు నేను బాగా సెలెక్టివ్ అనుకున్నా సరే వచ్చిన అవకాశాలన్నీ ఒప్పుకోవడం లేదు. ఫిలింమేకర్స్ గా, యాక్టర్స్ గా మేము ముందు ఆ కథను పూర్తిగా నమ్మాలి. కన్విక్షన్ తో రూపొందించాలి. బ్యాడ్ కంటెంట్ ను ఆడియెన్స్ ఇష్టపడే పరిస్థితి ఇప్పుడు ఏమాత్రం లేదు.

► ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ మంచి రోమ్ కామ్ ..అయితే ఇందులో ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక అపార్ట్ మెంట్ లో కొన్ని క్యారెక్టర్స్ మధ్య జరుగుతుంది. క్యారెక్టర్స్ మధ్య నవ్వించే డైలాగ్స్ ఉంటాయి. ప్లెజంట్ గా ఎంటర్ టైనింగ్ గా ఎపిసోడ్స్ వెళ్తుంటాయి. షూటింగ్ మాత్రం సమ్మర్ లో చేశాం. ఆ హీట్ కు ఇబ్బందిపడ్డాం.

► లావణ్య త్రిపాఠీ నటన అంటే నాకు ఇష్టం. తను మంచి కోస్టార్. ఆమెతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉండేది. మా మధ్య చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి. ఈ సీన్స్ చేసే క్రమంలో మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. నేను, తను దాదాపు ఒకే టైమ్ లో కెరీర్ స్టార్ట్ చేశాం. అయితే లావణ్య నాకంటే ఎక్కువ సినిమాల్లో నటించింది. నేను ఈ సిరీస్ చేయడం మా ఇంట్లో వాళ్లకు కూడా హ్యాపీనెస్ ఇచ్చింది. లావణ్య యాక్టింగ్ ను మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇష్టపడతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement