నచ్చకపోతే దారి ఖర్చులు వాపస్! | Vapas costs do not like the way! | Sakshi
Sakshi News home page

నచ్చకపోతే దారి ఖర్చులు వాపస్!

Published Thu, Jun 18 2015 11:12 PM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM

నచ్చకపోతే దారి ఖర్చులు వాపస్!

నచ్చకపోతే దారి ఖర్చులు వాపస్!

విడుదలకు ముందు బయటివాళ్లకి సినిమా చూపించ డం అంటే సాహసమే. అది ఎంత గొప్ప సినిమా అయినా సరే. కానీ, లగడ పాటి శ్రీధర్ ఆ సాహసం చేశారు. సుధీర్‌బాబు, నందిత జంటగా చంద్రు దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ నేడు తెరకొస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఈ చిత్రాన్ని చిత్రసీమకు సంబంధం లేని కొంతమందికి చూపించారు.
 
 సినిమా నచ్చకపోతే దారి ఖర్చులు వెనక్కి ఇచ్చి మరీ పంపిస్తానని పేర్కొన్నారు కూడా. బయ్యర్లందరూ వద్దంటున్నా, ఓ ప్రత్యేక షో ఏర్పాటు చేసి మరీ, చూపించారాయన. లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ - ‘‘నా మొదటి సినిమా ‘ఎవడి గోల వాడిదే’ అప్పట్నుంచీ, విడుదలకు ముందు బయటివారికి చూపిస్తానని చెప్పుకుంటూ వచ్చాను.
 
 ఈసారి కూడా అలానే అన్నాను. దాదాపు వంద మంది వరకూ ఈ సినిమా చూడ్డానికి వచ్చారు. ‘సినిమా చాలా బాగుంది’ అని అందరూ ప్రశంసించారు’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement