బ్రేకప్ లిస్ట్‌లో... ఓంపురి | Brake List in Bollywood actor ompuri | Sakshi
Sakshi News home page

బ్రేకప్ లిస్ట్‌లో... ఓంపురి

Published Tue, Feb 9 2016 11:30 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

బ్రేకప్ లిస్ట్‌లో... ఓంపురి - Sakshi

బ్రేకప్ లిస్ట్‌లో... ఓంపురి

2016... ఈ ఏడాది బాలీవుడ్ ప్రేమలు ఒక్కొక్కటిగా విఫలమైన గాథలుగా మారుతున్నాయి. బాలీవుడ్ నటుడు ఓంపురి ఆ జాబితాలో చేరారు. ఆయన తన భార్య నందితతో ఉన్న 26 ఏళ్ల బంధానికి స్వస్తి పలికారు. ఓంపురి - నందితల జంటకు ఇటీవలే కోర్టు అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. ఓంపురి-నందితలకు 18 ఏళ్ల కుమారుడు ఇషాన్ ఉన్నారు. ఈ దంపతులు విడిపోవడానికి గల కారణాలు బయటికి రాలేదు. ఇది ఇలా ఉంటే ఇటీవల విడిపోయిన జంటల్లో రణబీర్ కపూర్- కత్రినా కైఫ్, విరాట్ కొహ్లీ-అనుష్క శర్మ వంటి లవర్స్ మాత్రమే కాకుండా పెళ్లయిన ఫర్హాన్ అక్తర్- అధునా భబానీ లాంటి పెళ్లయిన జంట కూడా ఉంది. మొత్తానికి, బ్రేకప్‌లు ఎక్కువైపోయాయనుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement