ఇదొక శుభ పరిణామం -ఎస్.వి.కృష్ణారెడ్డి | This is a good evolution - S. V. Krishna Reddy | Sakshi
Sakshi News home page

ఇదొక శుభ పరిణామం -ఎస్.వి.కృష్ణారెడ్డి

Published Sat, Aug 22 2015 12:18 AM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM

ఇదొక శుభ పరిణామం -ఎస్.వి.కృష్ణారెడ్డి

ఇదొక శుభ పరిణామం -ఎస్.వి.కృష్ణారెడ్డి

సుధీర్ బాబు, నందిత జంటగా అందమైన ప్రేమకథగా తెరకెక్కించిన చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ఆర్. చంద్రు దర్శత్వంలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష, లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది.
 
 ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రం ఆగస్టు 7న 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ ఆనంద సమయంలో ఏదైనా  చేయాలనుకున్నా. అందుకే  చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన ‘సినిమా చూపిస్త మావ’ యూనిట్‌ను సత్కరిస్తున్నాను’’ అని చెప్పారు.
 
 ఒక హిట్ చిత్రాన్ని మరో హిట్  చిత్ర సభ్యులు సత్కరించడం శుభ పరిణామమని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్.వి. కృష్ణారెడ్డి  పేర్కొన్నారు. ఈ వేడుకలో ‘సినిమా చూపిస్త మావ’  చిత్ర నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శకుడు త్రినాథరావుతో పాటు దర్శకుడు ‘మధుర’ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement