‘కృష్ణమ్మ కలిపింది ఇద్దర్నీ’ అందరికీ నచ్చుతుంది
విశాఖపట్నం : ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దర్నీ’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీనికోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. నాకు మంచిపేరు తెచ్చిపెడుతుంది’ అన్నారు కథానాయిక నందితా రాజ్‌గురు. గాజువాకలో కళానికేతన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమె స్థానిక విలేకరులతో ముచ్చటించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
కొత్త సినిమాలున్నాయి..
కృష్ణమ్మ కలిపింది ఇద్దర్నీ సినిమా పూర్తవుతుండగానే మరో రెండు సినిమాలకు సంతకం చేశాను. ఆ వివరాలు నేను చెప్పడం బాగుండదు. త్వరలోనే మీకు తెలుస్తాయి.
పెర్‌ఫార్మెన్స్‌కు అవకాశం ఉన్న సినిమాలు ఇష్టం..
గ్లామర్ పాత్రలే కాదు.. పెర్‌ఫార్మెన్స్‌కు అవకాశం ఉన్న సినిమాలను ఇష్టపడతాను. వైవిధ్య భరితంగా ఉన్న పాత్రలన్నీ చేస్తాను.
హర్రర్ పాత్రలు కూడా..
ఉద్దేశపూర్వకంగా హర్రర్ సినిమాల్లో చేయాలని కాదు, కథలో భాగంగా ఆ పాత్రలో నటిస్తాను. అది కూడా పెర్‌ఫార్మెన్స్‌కు అవకాశం ఉంటుంది.
ప్రతీ సారి సెలవులకు ఇక్కడే...
విశాఖపట్నం అంటే నాకు చాలా ఇష్టం. ఇది మా అమ్మమ్మగారి ఊరు. అమ్మ కూడా ఇక్కడే పెరిగింది. అందుకే నేను ప్రతీ సారి సెలవులకు ఇక్కడికే వచ్చేదాన్ని. ఇప్పుడు కూడా షూటింగ్‌లో బాగా అలసిపోయాననిపిస్తే సేదదీరటానికి ఇక్కడికే వస్తాను.
విశాఖ ప్రజలు మంచోళ్లు..
విశాఖపట్నంలోని ప్రజలు చాలా మంచోళ్లు. ఇక్కడ ప్రశాంతత నాకు నచ్చుతుంది. నేను సెలవులకు ఇక్కడికే వస్తాను కాబట్టి ఇది నాకు కొత్తగా అనిపించదు.