పాటల్లో అందాలారబోశా
కనువిందు చేసే అందాలను ఆస్వాదించని వారుండరు. అందానికంత ప్రాదాన్యతనిస్తారు. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ అయినా సినిమా రంగంలో అందాలకిచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. తాజాగా వర్ధమాన నటి నందిత కూడా గ్లామర్‌కు మారింది. నలనుమ్ నందిత, ఎదిర్‌నీచ్చల్, అట్టకత్తి తదితర చిత్రాలలో సంప్రదాయ పాత్రలు పోషించి, పక్కింటి అమ్మాయి ఇమేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా ఐందామ్ తలైమురై సిద్ధ వైద్య శిఖామణి చిత్రంలో అందాలారబోతకు దిగిందట.
భరత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్యం ప్రొడక్షన్ పతాకంపై ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ కూతురు పుష్పా కందస్వామి నిర్మించారు. ఎల్ జి రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నటుడు భరత్ 25వ చిత్రం కావడం విశేషం. ఇది ఈ నెల 22న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర నాయకి నందిత తన భావాలను తెలుపుతూ హాస్యాన్ని పండించటం అంత సులభం కాద ంది. సడన్‌గా ఈమె కామెడీ గురించి మాట్లాడుతుందేమిటని ఆశ్చర్యపోతున్నారా? ఐందామ్ తలైమురై సిద్ధ వైద్య శిఖామణి చిత్రంలో వినోదమే ప్రధానమట.
ముఖ్యంగా పెళ్లి సన్నివేశంలో భరత్, నందితలతో సహా 22 మంది నటించారట. ఈ సన్నివేశంలో నటించిన వీళ్లే కడుపుబ్బ నవ్వేశారట. నటుడు భరత్ చుట్టూ తిరిగే ఈ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపు చెక్కలయ్యేలా నవ్వించడం ఖాయం అంటోంది నందిత. అన్నట్లు ఈ బ్యూటీ నటనకు అవకాశం వున్న పాత్రలో నటించారట. గ్రామీణ యువతి పాత్ర అయినా పాటల్లో కావలసినంత అందాల్ని ఆరబోశానంటోందీభామ. ఈ అమ్మడి అందాలు ఐందామ్ తలైమురై సిద్ధవైద్య శిఖామణి చిత్రానికి ఏ మాత్రం హెల్ప్ అవుతాయో చూద్దాం!