Entertainment Field
-
చైల్డ్ ఆర్టిస్టులను ఇక అలా చూపించొద్దు: కొత్త మార్గదర్శకాలు రెడీ!
న్యూఢిల్లీ: సీరియళ్లు, రియాలిటీ షోలంటూ బుల్లితెర మీదే కాదు.. సిల్వర్‌స్క్రీన్‌పై ఈ మధ్య డిజిటల్ స్క్రీన్ మీద కూడా పిల్లలను అభ్యంతరకరంగా, ఇబ్బందికరంగా చూపిస్తున్నారు. ఈ వ్యవహారంపై వీక్షకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా. ఈ తరుణంలో.. వినోద రంగానికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) డ్రాఫ్ట్ గైడ్లెన్స్ జారీ చేసింది. సినిమాలు, టీవీ, రియాలిటీ షో, షార్ట్ ఫిల్మ్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, వార్తలు, సోషల్ మీడియా వెబ్సైట్ కంటెంట్ విషయంలోనూ కొత్త గైడ్‌లైన్స్ వర్తిస్తాయని ఎన్సీపీసీఆర్ స్పష్టం చేసింది. సైబర్ చట్టాలు, పిల్లల హక్కులకు సంబంధించిన ఇతర చట్టాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ రూల్స్‌ను సిద్ధం చేసింది కమిషన్. తాజా డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం.. మూడు నెలల కంటే తక్కువ వయసున్న పసికందులను తెరపై చూపించకూడదు. అయితే.. చనుబాలు..రోగ నిరోధక శక్తి లాంటి అవగాహన కార్యక్రమాల కోసం మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈ నిబంధనను పాటించకుంటే.. మూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. సినిమా, సీరియళ్లు, ఓటీటీ .. ఇలా అన్ని కేటగిరీలకు ఈ రూల్స్ వర్తిస్తాయి. అంతేకాదు.. చిల్ట్రన్ ఇన్ న్యూస్ మీడియా అనే కేటగిరీని ప్రత్యేకంగా చేర్చింది ఎన్సీపీసీఆర్. దీని ప్రకారం.. పిల్లలు న్యూస్ ఛానెల్స్ లేదంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్‌లో ఇంటర్వ్యూలకు హాజరైనప్పుడు.. వాళ్లకు ఇబ్బందికలిగించేలా వ్యవహారించకూడదు. ముఖ్యంగా బాధితుల విషయంలోనూ విజువల్స్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకుంటే.. సంబంధిత చానెల్స్‌పై శిక్షలు కఠినంగా ఉంటాయి. ఈ గైడ్ లైన్స్ ప్రకారం.. నిర్భంధంతో పని చేయించుకోవడం తదితర అంశాలతో పాటు లేబర్ చట్టం ప్రకారం ఇక్కడ వర్తిస్తుంది. అలాగే.. సోషల్ మీడియా కూడా పిల్లలపై హింస విషయంలో బాధ్యతయుతంగా వ్యవహరించాలని కోరింది. ధూమపానం, మద్యపానంతో పాటు అత్యాచార బాధితులుగా, లైంగిక వేధింపుల బాధితులుగా, ఇబ్బందికర పరిస్థితులలో చూపించకూడదు. భారీ భారీ డైలాగులతో.. సమాజంపై చెడు ప్రభావం చూపించేలా పాత్రలను డిజైన్ చేయడం మేకర్లు మానుకోవాలని మార్గదర్శకాల్లో సూచించింది ఎన్సీపీసీఆర్. చివరిసారిగా.. 2011లో మార్గదర్శకాలను జారీ చేసింది ఎన్సీపీసీఆర్. ఈ నేపథ్యంలోనే చాలా ఏళ్ల తర్వాత.. కొత్త చట్టాలు, పాత నిబంధనల సవరణల ఆధారంగా భారీ మార్పులతో డ్రాఫ్ట్ గైడ్‌లెన్స్‌ను.. అదీ ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే సిద్ధం చేసింది ఎన్సీపీసీఆర్. వినోద రంగం నుంచి ఓ ప్రత్యేక కమిటీ ఈ మార్గదర్శకాల ప్రతిపాదనలను పరిశీలించి.. అభ్యంతరాలను, మార్పులు చేర్పులను తెలపనుంది. -
Sachin Tendulkar: ఈ కంపెనీలో భారీగా ఇన్వెస్ట్ చేసిన సచిన్..!
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరో సారి డిజిటల్ ఎంటర్టైన్మెంట్ అండ్ టెక్నాలజీ కంపెనీ జెట్సింథసిస్లో భారీగా ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు రెండు మిలియన్ల డాలర్లను (సుమారు రూ. 14.8 కోట్లు) కంపెనీలో సచిన్ టెండూల్కర్ ఇన్వెస్ట్ చేశారని జెట్‌సింథసిస్ ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో కూడా సచిన్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. వీరు ఇరువురు కలిసి డిజిటల్ క్రికెట్ డెస్టినేషన్, 100ఎమ్బీ, క్రికెట్ గేమ్స్, సచిన్ సాగా క్రికెట్ ఛాంపియన్స్, సచిన్ సాగా వీఆర్ వంటి యాప్‌లను లాంచ్ చేశారు. కాగా ఈ ఇన్వెస్ట్‌మెంట్‌తో జెట్‌సింథసిస్ షేర్ హోల్డర్లు అదార్ పూనావాలా, క్రిస్ గోపాలక్రిష్ణన్ తో సచిన్ టెండూల్కర్ జత కట్టనున్నారు. అంతేకాకుండా ప్రస్తుత పెట్టుబడితో సచిన్ టెండూల్కర్, జెట్‌సింథసిస్ కంపెనీల మధ్య సంబంధం మరింత బలోపేతం కానుంది. కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్‌పై సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ..జెట్ సింథసిస్‌తో తన అనుబంధం ఐదు సంవత్సరాల నాటిదని తెలిపారు. జెట్‌సింథసిస్ చేసిన పలు యాప్‌లతో తాను అభిమానులకు మరింత దగ్గరయ్యానని పేర్కొన్నారు. తొలిసారిగా సచిన్ క్రికెట్ సాగా యాప్‌ను ఈ కంపెనీతో ప్రారంభించగా, అది ప్రస్తుతం సుమారు 20 మిలియన్ల డౌన్‌లోడ్స్‌కు చేరుకుందని తెలిపారు. అత్యంత ప్రజాదరణ కల్గిన గేమ్‌లలో ఇది కూడా ఒక్కటిగా నిలిచిందని వెల్లడించారు. జెట్‌సింథసిస్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ రాజన్ నవని మాట్లాడుతూ.. సచిన్ తన అభిమానులతో నేరుగా మాట్లాడేందుకు 100ఎమ్బీ ప్లాట్‌ఫాం ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొన్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కంపెనీలో చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌తో జెట్‌సింథసిస్ కుటుంబంలో కీలక సభ్యుడుగా చేరడం మాకు చాలా సంతోషనిస్తుందని తెలిపారు. జెట్ సింథసిస్ ప్రధాన కార్యాలయం పూణేలో ఉంది. ఈ కంపెనీకి భారత్‌తో పాటు జపాన్, యూకే, ఈయూ, యూఎస్ దేశాల్లో కార్యాలయాలు కలవు. -
పాటల్లో అందాలారబోశా
కనువిందు చేసే అందాలను ఆస్వాదించని వారుండరు. అందానికంత ప్రాదాన్యతనిస్తారు. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అయినా సినిమా రంగంలో అందాలకిచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. తాజాగా వర్ధమాన నటి నందిత కూడా గ్లామర్‌కు మారింది. నలనుమ్ నందిత, ఎదిర్‌నీచ్చల్, అట్టకత్తి తదితర చిత్రాలలో సంప్రదాయ పాత్రలు పోషించి, పక్కింటి అమ్మాయి ఇమేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా ఐందామ్ తలైమురై సిద్ధ వైద్య శిఖామణి చిత్రంలో అందాలారబోతకు దిగిందట. భరత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్యం ప్రొడక్షన్ పతాకంపై ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ కూతురు పుష్పా కందస్వామి నిర్మించారు. ఎల్ జి రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నటుడు భరత్ 25వ చిత్రం కావడం విశేషం. ఇది ఈ నెల 22న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర నాయకి నందిత తన భావాలను తెలుపుతూ హాస్యాన్ని పండించటం అంత సులభం కాద ంది. సడన్‌గా ఈమె కామెడీ గురించి మాట్లాడుతుందేమిటని ఆశ్చర్యపోతున్నారా? ఐందామ్ తలైమురై సిద్ధ వైద్య శిఖామణి చిత్రంలో వినోదమే ప్రధానమట. ముఖ్యంగా పెళ్లి సన్నివేశంలో భరత్, నందితలతో సహా 22 మంది నటించారట. ఈ సన్నివేశంలో నటించిన వీళ్లే కడుపుబ్బ నవ్వేశారట. నటుడు భరత్ చుట్టూ తిరిగే ఈ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపు చెక్కలయ్యేలా నవ్వించడం ఖాయం అంటోంది నందిత. అన్నట్లు ఈ బ్యూటీ నటనకు అవకాశం వున్న పాత్రలో నటించారట. గ్రామీణ యువతి పాత్ర అయినా పాటల్లో కావలసినంత అందాల్ని ఆరబోశానంటోందీభామ. ఈ అమ్మడి అందాలు ఐందామ్ తలైమురై సిద్ధవైద్య శిఖామణి చిత్రానికి ఏ మాత్రం హెల్ప్ అవుతాయో చూద్దాం!