
రామ్ గోపాల్ వర్మ.. సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ ఈ పేరు. ఆయన తీసే సినిమాలతో పాటు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కూడా అప్పుడప్పుడు వివాదస్పదం అవుతాయి. ఏ అంశంపైనైనా కాస్త వ్యంగ్యంగా స్పందించడం ఈ దర్శకుడికి అలవాటు. తాజాగా నిర్మాత దాసరి కిరణ్ బర్త్‌డే పై కూడా కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు ఆర్జీవీ.
ఆయనకు బర్త్‌డే విషెస్ చెబుతూ ఓ ఫోటోని ట్విటర్‌లో షేర్ చేశాడు. అందులో ఆర్జీవీ మెడలో పెద్ద పూల దండ ఉంది. ఆ ఫోటోని ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ‘మా ‘వ్యూహం’ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ గారి బర్త్‌డేకి నాకెందుకు దండేశారో నాకర్థం కాలేదు. వెరీ వెరీ హ్యాపీ బర్త్‌డే. టు దాసరి కిరణ్’ అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఆర్జీవీ త్వరలోనే రాజకీయాలపై ‘వ్యూహం’ అనే చిత్రం తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి దాసరి కిరణ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.
— Ram Gopal Varma (@RGVzoomin) November 29, 2022