
సాక్షి, అమరావతి: టీటీడీ బోర్డు సభ్యునిగా దాసరి కిరణ్ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న ఎం.హరి జవహర్ లాల్ జీవో జారీ చేశారు. టీటీడీ బోర్డుకు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంది.
దాసరి కిరణ్ కుమార్ తెలుగు సినిమా రంగానికి చెందిన వారు. నిర్మాతగా కొన్ని సినిమాలు నిర్మించారు. 24 మంది సభ్యుల బోర్డు సభ్యుల్లో ఒకరిగా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ బాలశౌరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment