మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా వరుస సినిమా అప్డేట్లతో అభిమానులకు పెద్ద పండుగ విందు ఇచ్చాడు. ఇప్పటికే 'రామారావు ఆన్ డ్యూటీ' పోస్టర్ విడుదల కాగా తాజాగా ఖిలాడి సినిమాలోని నాలుగోపాట ఫుల్ కిక్ను విడుదల చేశారు మేకర్స్. ఈ గీతాన్ని సాగర్, మమత శర్మ ఆలపించగా శ్రీమణి సాహిత్యం అందించారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ మాస్ బీట్కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అలరిస్తున్నాయి.
పాట ప్రారంభంలో రవితేజ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఖిలాడి సినిమా విషయానికొస్తే ఈ సినిమాను 'రాక్షసుడు' ఫేమ్ రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మాతగా వ్యవహరించగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిలు రవితేజ సరసన అలరించనున్నారు. అలాగే అర్జున్, అనసూయ కీలక పాత్రలు పోషించగా, ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదలకు సిద్ధంగా ఉంది.
Khiladi Movie: రవితేజ 'ఫుల్ కిక్' సాంగ్ వచ్చేసిందిగా.. ఇది 'ఖిలాడి' కిక్
Published Wed, Jan 26 2022 6:52 PM | Last Updated on Wed, Jan 26 2022 7:00 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment