నాగార్జునసాగర్ : హైదరాబాద్ సచివాలయ అధికారులు, ట్రైనీ ఐపీఎస్‌లు ఆదివారం నాగార్జునసాగర్‌ను వేరువేరుగా సందర్శించారు. సెక్రటేరియట్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ముందుగా సాగర్ డ్యాం చూసిన తర్వాత లాంచీలో నాగార్జునకొండకు వెళ్లి అక్కడ మ్యూజియంను సందర్శించారు. అనంతరం ఎత్తపోతల, బుద్దవనం తదితర ప్రాంతాలను సందర్శించారు. వీరి వెంట కరీంనగర్ జిల్లా డీటీఓ వెంకటేశ్వర్‌రావు, రాజమౌళి, సత్యం, సత్యనారాయణలు ఉన్నారు. అదే విధంగా పలువురు ట్రైనీ ఐపీఎస్‌లు లాంచీలో నాగార్జునకొండకు వెళ్లి మ్యూజియం, బుద్ధుడికి సంబంధించిన చిత్రాలను పరిశీలించారు. అనంతరం ఎత్తిపోతల చూడడానికి వెళ్లారు. సాగర్‌కు వచ్చిన వారిలో ట్రైనీ ఐపీఎస్‌లు లోకేశ్వర్, వినీత్, విశాల్, రాజ్‌కుమార్, మౌనిక, కృష్ణారావు ఉన్నారు. వీరివెంట మిర్యాలగూడ డీఎస్పీ రామ్మోహన్‌రావు, హాలియా సీఐ పార్థపారధి, ఎస్‌ఐ రజనీకర్, ఎస్‌బీ హెడ్‌కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి, కిషన్‌లు ఉన్నారు. వీరికి గైడ్ సత్యం నాగార్జునకొండ గురించి వివరించారు.