సాగర్‌ను మండల కేంద్రం చేయాలి | Announce sagar mondal headquarter | Sakshi
Sakshi News home page

సాగర్‌ను మండల కేంద్రం చేయాలి

Published Fri, Sep 16 2016 11:29 PM | Last Updated on Tue, Jun 4 2019 6:19 PM

సాగర్‌ను మండల కేంద్రం చేయాలి - Sakshi

సాగర్‌ను మండల కేంద్రం చేయాలి

 అఖిలపక్షం ఆధ్వర్యంలో వినతులు
అందజేస్తున్న జూలకంటి, నోముల, అఖిలపక్ష నాయకులు
నాగార్జునసాగర్‌ : సాగర్‌ను మండల కేంద్రం చేయాలని కోరుతూ అఖిలపక్ష నాయకులు శుక్రవారం సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి నోముల నర్సింహయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డికి, మండలాల పునర్విభజన ప్రత్యేకాధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. పెద్దవూర మండలంలోని చింతలపాలెం, నెల్లికల్లు, తునికినూతల గ్రామ పంచాయతీలను తిరుమలగిరిలో కలుపొద్దని విన్నవించారు. ఈ మూడు పంచాయతీలను కలిపి సాగర్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. సాగర్‌ 10 కిలో మీటర్ల దూరం ఉంటే తిరుమలగిరి 25కిలో మీటర్లు దూరం అవుతుందన్నారు.  దామరచర్ల మండలంలోని నడిగడ్డ మండలాన్ని సాగర్‌లో కలిపితే 36వేల జనాభా అవుతుందని మ్యాప్‌తో కూడిన వివరాలతో విజ్ఞాపన పత్రాలు అందజేశారు. సాగర్‌ను మండల కేంద్రం చేస్తే ప్రభుత్వానికి పైసా ఖర్చు ఉండదని, ఇప్పటికే సాగర్‌లో క్యాంపు కార్యాలయాల పేరుతో అన్ని శాఖలకు ప్రభుత్వ క్వార్టర్లు అలాట్‌ చేయబడి ఉన్నాయన్నారు.  కార్యక్రమంలో
పెద్దవూర మండలంలోని మూడు గ్రామపంచాయతీల సర్పంచులు, సాగర్‌కు చెందిన 50 మంది, పెద్దవూర ఎంపీపీ వస్త్రపురి మల్లిక, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు కర్ణబ్రహ్మానందరెడ్డి, అఖిలపక్ష నాయకులు కున్‌రెడ్డినాగిరెడ్డి, రమేశ్‌జీ, రంగానాయక్, సునందారెడ్డి, వాసు, చిన్నిరామస్వామి, రామ్మోహన్‌రావు, బషీర్, రవినాయక్, జానయ్య, కాటు కృష్ణ సర్పంచులు, చంద్రయ్య,ఏడుకొండలు, ధర్మానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
 మండలం నుంచి వీడదీయం
పెద్దవూర మండలం నుంచి నెల్లికల్లు, చింతలపాలెం, తునికినూతల  మండలాలను విడదీయమని అఖిలపక్ష నాయకులకు మంత్రి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. అలాగే నాగార్జునసాగర్‌ను గ్రామ పంచాయతీ చేస్తామని అందుకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని ప్రజాభిప్రాయం మేరకు ఏదైనా జరుగుతుందన్నారు. సీఎం అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవడంతో మంత్రిక సమస్యను వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement