చదవడం ఇష్టంలేక ఆత్మహత్య
Published Fri, Sep 16 2016 1:45 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
మదనపల్లి రూరల్: చదువుకోవడం ఇష్టంలేక ఓ విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని మదనపల్లి పట్టణంలోని జవహర్‌నవోదయ స్కూల్లో చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని సుబాష్ రోడ్డులో నివాసముండే సాగర్(16), జవహర్ నవోదయ స్కూల్లో 11వ తరగతి చదువుతున్నాడు. చదువుపై ఆసక్తి లేకపోవడంతో పలుమార్లు ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పాడు. ఈ విషయంలో తల్లి దండ్రులు కోపగించుకున్నట్టు సమాచారం. దాంతో సాగర్ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Advertisement
Advertisement