
సుమన్, సాగర్
సుమన్ ముఖ్య పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘సడి’. పాలిక్ దర్శకత్వంలో భాను ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ సాయి అమృతలక్ష్మి క్రియేషన్స్‌పై గోదారి భానుచందర్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకులు ధవళ సత్యం కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో దర్శకులు వి.సాగర్ క్లాప్ ఇచ్చారు. నటుడు, దర్శకుడు గూడ రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. సుమన్ మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ నేపథ్యంలో సాగే క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది.
ప్రతి ఇంటికీ ఒక హీరో ఉంటాడు. ఈ సినిమాలో నేను ఒక ఇంటికి హీరోగా చేస్తున్నా’’ అన్నారు. ‘‘ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎదుర్కొన్న ఊహించని పరిణామాలే ఈ చిత్రం. మే నెలాఖరులో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్‌లో కంప్లీట్ చేస్తాం’’ అన్నారు పాలిక్. ‘‘సుమన్‌గారితో నా తొలి సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు గోదారి భానుచందర్. దర్శకుడు వీరశంకర్, నటుడు గూడ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జశ్వంత్, సంగీతం: యాజమాన్య.
Comments
Please login to add a commentAdd a comment