సమాజానికి అండగా ఉండాలి | Be supportive of society | Sakshi
Sakshi News home page

సమాజానికి అండగా ఉండాలి

Published Mon, Jun 10 2024 4:53 AM | Last Updated on Mon, Jun 10 2024 4:53 AM

Be supportive of society

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృపాసాగర్‌ 

వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): సామాజిక సేవలందించే సంస్థలు సమాజానికి మరింత అండగా ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ సూచించారు. అన్న సంతర్పణ సమితి ట్రస్ట్‌ తృతీయ వార్షికోత్సవం ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ­లోని పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ఆవరణలో ఆదివారం ఘనంగా జరిగింది. 

ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్‌ కృపాసాగర్‌ మాట్లాడుతూ.. అన్నసంతర్పణ సమితి అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ  సేవలను విçస్తృతం చేయాలని సూచించారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ సమరం, వాసవి క్లబ్‌ గవర్నర్‌ కొత్త గణేష్‌బాబు అన్నసంతర్పణ సమితి ట్రస్ట్‌ సేవలను కొనియాడారు. 

ట్రస్ట్‌ అధ్యక్షుడు గుండు దిలీప్, కార్యదర్శి పీఎస్‌ఆర్‌ మూర్తి మాట్లా­డుతూ.. మూడేళ్లుగా నిర్విరామంగా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. త్వరలో ఒక సత్రంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామ­న్నారు. అనంతరం సేవలందించిన వలంటీర్లకు ప్రశంసా పత్రాలు అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement