సాగర్ చుట్టూ ‘నో ఎంట్రీ’ | Sagar around the 'No Entry' | Sakshi
Sakshi News home page

సాగర్ చుట్టూ ‘నో ఎంట్రీ’

Published Tue, Dec 31 2013 3:51 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

Sagar around the 'No Entry'

=న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము 2 గంటల వరకు సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
 
 =ఈ సమయంలో ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్‌లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు.
 
 =ఈ సమయంలో భారీ వాహనాలను సైతం సిటీలోకి రానీయరు. జంట కమిషనరేట్ల పరిధిలో ఉన్న అన్ని ఫ్లైఓవర్లను మూసేస్తారు.
 
 =సచివాలయం పక్కనున్న మింట్ కాంపౌండ్ లైన్‌ను పూర్తిగా మూసేస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు.
 
 =వీవీ స్టాట్యూ నుంచి నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్, రాజభవన్ మీదుగా మళ్లిస్తారు.
 
 =బీఆర్‌కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వచ్చే ట్రాఫిక్‌ను ఇక్బాల్ మినార్, లక్డీకాపూల్,
 అయోధ్య సర్కిల్ వైపు పంపుతారు.
 
 =లిబర్టీ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి బీఆర్‌కే భవన్, తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, లక్డీకాపూల్, అయోధ్య సర్కిల్ మీదుగా మళ్లిస్తారు.
 
 =ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను మీరా టాకీస్ లైన్ మీదుగా పంపుతారు.
 
 =నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనాలను సంజీవయ్య పార్క్, నెక్లెస్‌రోడ్ పైకి పంపరు. వీటిని కర్బాలా మైదాన్, మినిస్టర్స్ రోడ్ మీదుగా పంపిస్తారు.
 
 =సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సెయిలింగ్ క్లబ్ నుంచి కవాడిగూడ చౌరస్తా, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు మళ్లిస్తారు.
 
 =డ్రంకన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, ట్రిపుల్‌రైడింగ్ తదితర ఉల్లఘనలపై స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించడానికి ప్రత్యేక బృందాల ఏర్పాటు.
 
 =రోడ్ల పక్కన, నో పార్కింగ్ జోన్‌లో వాహనాలు ఆపితే చర్యలు తప్పవు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement