neklesrod
-
నెక్లెస్‌రోడ్‌లో రియోత్సాహం..
ఖైరతాబాద్: రియో ఒలంపిక్స్ పారా అథ్లెటిక్స్‌లో భారత్ క్రీడాకారుల విజయాల్ని స్వాగతిస్తూ ఆదివారం నెక్లెస్‌రోడ్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ‘ఏపీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పీపుల్స్ ప్లాజా నుంచి ఏపీ సచివాలయం వరకు సాగిన ఈ ర్యాలీని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు. సంఘం చైర్మన్ కోటేశ్వరరావు, జాతీయ పారా క్రీడాకారులు శ్రీనివాసులు, అంజన్ రెడ్డి పాల్గొన్నారు. -
140 మంది చోదకులు!
నెక్లెస్‌రోడ్‌లో ఎడాపెడా ట్రాఫిక్ ఉల్లంఘనలు దృష్టి సారించిన మధ్య మండల పోలీసులు ఆదివారం భారీ {పత్యేక డ్రైవ్ నిర్వహణ రామ్‌గోపాల్‌పేట/ఖైరతాబాద్: నెక్లెస్‌రోడ్... ఎన్టీఆర్ మార్గ్... ట్యాంక్‌బండ్... హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న ఈ మూడు ప్రాంతాలూ పర్యాటకులు, వాకర్లు, సైక్లింగ్ చేసే వాళ్లతో కళకళలాడుతుంటాయి. ఇది ఓ కోణమైతే... ఈ ఏరియా ట్రాఫిక్ ఉల్లంఘనులకూ నెలవుగా మారడం మరో కోణం. ఒకే వాహనంపై ముగ్గురు నలుగురు ప్రయాణించడం, మితిమీరిన వేగంతో దూసుకుపోవడం, మైనర్లూ డ్రైవింగ్ చేసేయడం సర్వసాధారణం. ఇది ఒక్కోసారి వాహనచోదకులు, వాటిపై ఉన్న వారితో పాటు అభంశుభం తెలియని వాకర్ల ప్రాణాల మీదికి తెస్తోంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి కట్టడి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం స్పెషల్‌డ్రైవ్‌తో కొరడా ఝుళిపించారు. 130 మంది పోలీసులతో డ్రైవ్... సెంట్రల్ జోన్ డీసీపీ నేతృత్వంలో సాగిన ఈ డ్రైవ్‌లో ఒక ఏసీపీ, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, పది మంది ఎస్సైలు, నలుగురు ఏఎస్సైలు, ట్రాఫిక్ విభాగం అధికారులతో సహా దాదాపు 160 మంది పాల్గొన్నారు. త్రిబుల్ రైడింగ్, ఓవర్ స్పీడింగ్, మైనర్ డ్రైవింగ్ తదితర నిబంధనల్ని ఉల్లంఘించిన 102 వాహనాలను పట్టుకున్నారు. వీటిపై ప్రయాణించిన 140 మంది చోదకులనూ అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 51 మంది మైనర్లు, 20 రేసింగ్ వాహన చోదకులు, 31 మంది ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా వాహనాలు నడుపుతున్న వారు చిక్కారు. మైనర్లలో కొంత మంది 12, 13 ఏళ్ల బాలలు కూడ ఉండటంతో పోలీసులే అవాక్కయ్యారు. తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్... ఈ స్పెషల్‌డ్రైవ్‌లో చిక్కిన వాహనచోదకులకు జరిమానా విధించడంతో పాటు డీసీపీ కమలాసన్‌రెడ్డి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ చేపట్టారు. వాహనాలు నడుపుతూ చిక్కిన మైనర్లతో పాటు వారి తల్లిదండ్రుల్నీ పిలిపించి మందలించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనాల వివరాలతో పాటు నడిపిన వారి వివరాలనూ క్రోడికరిస్తూ డేటాబేస్ రూపొందిస్తున్నారు. ఇకపై క్రమం తప్పకుండా నిర్వహించే స్పెషల్‌డ్రైవ్స్‌లో చిక్కిన వారి వివరాలను ఈ డేటాబేస్‌తో సరిచూడాలని నిర్ణయించారు. ఒకటి కంటే ఎక్కువసార్లు పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అలా చిక్కిన మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. పాదచారులు, పర్యాటకులకు భద్రత కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. -
సండే సిటీ సందడి
-
సాగర్ చుట్టూ ‘నో ఎంట్రీ’
-
సాగర్ చుట్టూ ‘నో ఎంట్రీ’
=న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము 2 గంటల వరకు సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. =ఈ సమయంలో ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. =ఈ సమయంలో భారీ వాహనాలను సైతం సిటీలోకి రానీయరు. జంట కమిషనరేట్ల పరిధిలో ఉన్న అన్ని ఫ్లైఓవర్లను మూసేస్తారు. =సచివాలయం పక్కనున్న మింట్ కాంపౌండ్ లైన్‌ను పూర్తిగా మూసేస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. =వీవీ స్టాట్యూ నుంచి నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్, రాజభవన్ మీదుగా మళ్లిస్తారు. =బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వచ్చే ట్రాఫిక్‌ను ఇక్బాల్ మినార్, లక్డీకాపూల్, అయోధ్య సర్కిల్ వైపు పంపుతారు. =లిబర్టీ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి బీఆర్కే భవన్, తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, లక్డీకాపూల్, అయోధ్య సర్కిల్ మీదుగా మళ్లిస్తారు. =ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను మీరా టాకీస్ లైన్ మీదుగా పంపుతారు. =నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనాలను సంజీవయ్య పార్క్, నెక్లెస్‌రోడ్ పైకి పంపరు. వీటిని కర్బాలా మైదాన్, మినిస్టర్స్ రోడ్ మీదుగా పంపిస్తారు. =సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సెయిలింగ్ క్లబ్ నుంచి కవాడిగూడ చౌరస్తా, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు మళ్లిస్తారు. =డ్రంకన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, ట్రిపుల్‌రైడింగ్ తదితర ఉల్లఘనలపై స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించడానికి ప్రత్యేక బృందాల ఏర్పాటు. =రోడ్ల పక్కన, నో పార్కింగ్ జోన్లో వాహనాలు ఆపితే చర్యలు తప్పవు.