
సాగర్, వెన్నెల విహర్
సాగర్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘కొంటె కుర్రాడు’. ‘ఓ లోఫర్‌గాడి ప్రేమకథ’ అనేది ట్యాగ్‌లైన్. వెన్నెల విహర్ కథానాయిక. ఏనుగుతల దేవదాసు, సైధూల్ బాథరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ అభిమానిగా కనిపిస్తారు సాగర్. హీరో ‘రవితేజ అమర్ అక్బర్ ఆంటొని’ సినిమా విడుదల సందర్భంగా ‘కొంటె కుర్రాడు’ చిత్రంలోని ఓ సాంగ్‌ను వృద్ధాశ్రమంలో విడుదల చేశారు.
‘‘రవితేజగారికి సాగర్ వీరాభిమాని. విడుదల చేసిన సాంగ్‌ను మాస్ మహారాజ్ రవితేజకు డెడికేట్ చేస్తున్నాం. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తాం. ఈ సినిమాను సాగర్ చక్కగా తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు నిర్మాతలు. ‘సస్పెన్స్, లవ్‌తో ఎవరూ ఊహించని విధంగా క్లైమాక్స్ ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను సినిమా ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అన్నారు సాగర్. యస్.ఏ. అరమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment