-
వైఎస్సార్‌సీపీ ధర్నా నేపధ్యంలో దిగి వచ్చిన ప్రభుత్వం
-
హడావిడిగా బుధవారం నీటి విడుదల
-
స్పష్టత లేకపోవడంతో ఎన్నో అనుమానాలు
సాక్షి, అమరావతి బ్యూరో: రబీలో సాగర్ కుడికాలువల కింద మాగాణి పంటలకు నీరు ఇవ్వాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రభుత్వాన్ని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. సాగర్ నీటి విడుదలపై స్పష్టత లేక పోవడంతో బుధవారం చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, గురజాల, పెదకూరపాడు నియోజక వర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ప్రభుత్వతీరును ఎండగట్టారు. నీటి విడుదల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నా చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం దిగి వచ్చి హడావిడిగా బుధవారం ఉదయం 7.30 గంటలకు సాగర్ నీటిని విడుదల చేసింది. అయితే నీరు ఎప్పటి వరకు విడుదల చేస్తారు, ఎన్ని టీఎంసీలు విడుదల చేస్తారో షెడ్యూల్ మాత్రం ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాను విఫలం చేయడానికి నీటిని విడుదల చేసి ప్రభుత్వం మరోసారి రైతులను మోసం చేసిందన్న అనుమానాలు రేకేత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన ధర్నాలో వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ రబీలో మాగాణి పంటలకు నీరు ఇవ్వాల్సిందేననని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరికలు జారీ చేశారు.
రబీ సీజన్ ముగిసే వరకు నీరు ఇవ్వాల్సిందే: మర్రి రాజశేఖర్
రబీ సీజన్ ముగిసే వరకు సాగర్ కుడికాలువకు నీరు ఇవ్వాల్సిందేననని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ డిమాండ్ చేశారు. చిలకలూరిపేట ఎన్‌ఆర్‌టీ రోడ్డులోని ఎన్‌ఎస్పీ కెనాల్స్ డివిజన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. నాగార్జున సాగర్ జలాశయంలో రబీకి సరిపడినంత నీరు ఉన్నా కుడికాలువకు విడుదల చేయకపోవటం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పిలుపునివ్వడంతో హడావిడిగా ఆరుతడి పంటలకు నీరు ఇస్తామని చెప్పటం దుర్మార్గంగా ఉందన్నారు.
సాగర్ వరకు పాదయాత్ర చేస్తాం: గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి
రబీలో మాగాణి భూములకు తగినంత సాగునీరు ఇవ్వాలని నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరసరావుపేటలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులతో కలిసి ధర్నా చేశారు. నీటి విడుదల విషయంలో స్పష్టత లేకుంటే నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని రైతులు, నాయకులతో కలిసి అద్దంకినార్కెట్‌పల్లి రహదారిపై భారీ రాస్తారోకో చేసి, నాగార్జున సాగర్ డ్యాం వరకు పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు.
రైతులతో దోబూచులాడుతున్నారు: అంబటి రాంబాబు
స్పీకర్ నవంబరు 1 వతేదీన నీటిని విడుదల చేస్తామని పేర్కొంటే, మంత్రులు ఏకంగా నీటిని విడుదల చేసి రైతులతో దోబూచులాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. అంబటి నేతత్వంలో సత్తెనపల్లి ఎన్‌ఎస్పీ ఈఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతుల ఇబ్బందులను దష్టిలో ఉంచుకొని వారి సమస్యలపై ప్రధాన ప్రతిపక్షం పోరాడుతోందని ఈ సందర్భంగా అంబటి అన్నారు. ప్రభుత్వం మెడలు వంచి నీరు తీసుకొస్తామని, దీనికోసం రాజకీయాల కతీతంగా టీడీపీ రైతులు కూడా కలిసి రావాలన్నారు. ఈ ధర్నాలో సీపీఎం రాష్ట్ర కమిటీæ సభ్యుడు గద్దె చలమయ్య ప్రసంగించారు.
రైతు వ్యతిరేక ప్రభుత్వం: జంగా కష్ణమూర్తి
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కష్ణమూర్తి తీవ్రంగా విమర్శించారు. జంగా కష్ణమూర్తి నేతత్వంలో గురజాల డివిజన్ కేంద్రంలో ధర్నా నిర్వహించారు. రెండేళ్ళుగా రైతులు అతివష్టి, అనావష్టితో అల్లాడుతున్నారని, సాగర్ కుడికాలువకు 10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మార్చి 31వ తేదీ వరకు నీటిని విడుదల చేయాలని లేకపోతే పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అన్నమో రామచంద్రా అని అలమటించాల్సి వస్తోంది: నాగిరెడ్డి
చంద్రబాబు అధికారంలోకి వచ్చాకా అన్నమో రామచంద్రా అని ప్రజలు అలమటించాల్సి వస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజక వర్గ ఇన్‌ఛార్జి బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో శివయ్య స్తూపం సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. నాగిరెడ్డి మాట్లాడుతూ నికర జలాలు ఉన్నా సాగర్‌కు ఖరీఫ్‌లో రెండేళ్ళుగా నీరు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. బొల్లా బ్రహ్మ నాయుడు మాట్లాడుతూ దాళ్వా పంటకు సాగర్ జలాలు విడుదల చేయకపోతే దూడకు గడ్డి, బిడ్డకు తిండి ఉండని పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందన్నారు.
చంద్రబాబుకు వ్యవసాయంపై విశ్వాసం లేదు: కావటి మనోహరనాయుడు
చంద్రబాబుకు వ్యవసాయంపై విశ్వాసం లేదని వైఎస్సార్‌సీపీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహరనాయుడు అన్నారు. క్రోసూరు మండల కేంద్రంలోని నాగార్జున సాగర్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎప్పటి దాకా సాగర్ నీళ్లు విడుదల చేస్తున్నదీ స్పష్టం చేయకపోతే∙వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ నీటి కోసం ఆందోళన చేపడుతున్నట్లు తెలిసిన వెంటనే ప్రభుత్వం నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించం చూస్తే ఆందోళన చేస్తే తప్ప ప్రభత్వం దిగిరాదని అర్ధం చేసుకోవచ్చునని నన్నారు.
పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయాలి: పిన్నెల్లి వెంకటరామిరెడ్డి
నామ మాత్రంగా కాకుండా వరి సాగుకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాచర్లలో స్థానిక పార్టీ కార్యాలయం నుంచి పీడబ్ల్యూడీ కాలనీలో కెనాల్స్ విభాగం కార్యాలయం వరకు రైతులు , కార్యకర్తలతో కలిసి ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ఏడాది కుడికాలువ ప్రయోజనాలను కాపాడకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామన్నారు.