Madhya Pradesh: 1 Child Died In School Bus Accident Carrying 40 Children In Rahatgarh - Sakshi
Sakshi News home page

డ్రైవర్ నిర్లక్ష‍్యానికి విద్యార్థి బలి.. 40 మంది పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్ బోల్తా

Published Tue, Sep 27 2022 12:48 PM | Last Updated on Tue, Sep 27 2022 1:32 PM

Madhya Pradesh School Bus With 40 Children Met With Accident - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా రహత్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది.  40 మంది పిల్లలతో వెళ్తున్న ప్రైవేటు స్కూల్‌ బస్సు చంద్రాపూర్‌ గ్రామం సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మంది గాయపడ్డారు. తీవ్రగాయాలపాలైన ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

క్షతగాత్రులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.

అయితే డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష‍్యంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని అందులోని విద్యార్థులు తెలిపారు. తమ తోటి విద్యార్థి మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు.
చదవండి: పీఎఫ్‌ఐపై రెండో విడత దాడులు.. కర్ణాటకలో 45 మంది అరెస్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement