సాగర్‌ను మండలకేంద్రం చేయాలని రాస్తారోకో | rastha roko for sagar mandal head quarter | Sakshi
Sakshi News home page

సాగర్‌ను మండలకేంద్రం చేయాలని రాస్తారోకో

Published Wed, Sep 14 2016 8:10 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

సాగర్‌ను మండలకేంద్రం చేయాలని రాస్తారోకో

సాగర్‌ను మండలకేంద్రం చేయాలని రాస్తారోకో

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌ను మండలం చేయాలని బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో సాగర్‌ బంద్‌ నిర్వహించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపక్కనే వంటావార్పు చేపట్టారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ సాగర్‌ మండలం చేయడం వల్ల దీనిని ఆనుకోని ఉన్న గ్రామాలు, తండాల ప్రజలకు మండలకేంద్రానికి వచ్చేందుకు  25 కిలోమీటర్లదూరం తగ్గుతుందని అన్నారు. మండలం చేసేవరకు ఉద్యమం ఆపేది లేదని నాయకులు తెలిపారు. ఆంధ్రా–తెలంగాణ రాష్ట్రాల మైత్రివారధికి ఇవతలి వైపున రెండు గంటలపాటు రోడ్డుపై రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. రోడ్డుపక్కనే వంటావార్పు పెట్టి ఆర్డీఓ వచ్చే వరకు కదలమని భీష్మించారు. ఎస్‌ఐ రజనీకర్‌ ఆధ్వర్యంలో పోలీసులు అఖిలపక్షం నాయకులను అరెస్ట్‌చేశారు. పోలీస్‌ వాహనంలో తీసుకవెళుతుండగా వాహనానికి అడ్డంగా నినాదాలు చేస్తూ కదలనీయలేదు. ప్రభుత్వానికి పోలీసుల పక్షాన నివేదికను పంపుతామని నచ్చచెప్పి నాయకులను పోలీస్టేషన్‌కు తరలించి వదిలిపెట్టారు.   
విద్యుత్‌ టవరెక్కిన నాయకులు
సాగర్‌ను మండలం చేయాలంటూ ఓ పక్క రహదారిపై రాస్తారోకో చేస్తుండగా  మరోపక్క అఖిలపక్ష నాయకులు రామస్వామి, నందూనాయక్‌లు ఆర్డీఓ రావాలంటూ  విద్యుత్‌ టవర్‌ ఎక్కారు. పోలీసులు, యువకులు, నాయకులు వచ్చి బతిమిలాడి టవర్‌దింపారు. 
స్వచ్ఛందంగా సాగర్‌ బంద్‌
స్థానిక ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ నిర్వహించారు. ఉదయం నుంచే షాపులు, హోటళ్లు, పాఠశాలలు, స్థానిక నాట్కో ఫ్యాక్టరీని మూసివేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో యువకులు కాలనీలలో బైకు ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో కున్‌రెడ్డి నాగిరెడ్డి, రమేశ్‌జీ, పొదిలశ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, మిట్టపల్లిశ్రీనివాస్, సునందారెడ్డి, బషీర్, రంగానాయక్, కృష్ణ, సాంబశివ, కిశోర్, జగదీష్, జంగయ్య, గౌస్, వేణు, రామస్వామి, నాగవర్థన్, సర్పంచులు మేకపోతుల చంద్రయ్య, బూడిదపావిత్రిఏడుకొండలు, లాలునాయక్, హచ్చునాయక్, లక్ష్మీతారాసింగ్, శౌరినాయక్, మునినాయక్, వాల్య, తాతారావు, మల్లన్న, సారమ్మ, రమేశ్‌గౌడ్, నజీర్, మందశాంత, సైదమ్మ, కైకా, శేఖరాచారి, అచ్చమ్మ, జిలానీ, జహంగీర్, నాట్కోప్రసాద్, శ్రీనివాస్, యాదగిరి, యూసూఫ్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement