mandal head quarter
-
సాగర్‌ను మండలకేంద్రం చేయాలని రాస్తారోకో
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌ను మండలం చేయాలని బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో సాగర్ బంద్ నిర్వహించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపక్కనే వంటావార్పు చేపట్టారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ సాగర్ మండలం చేయడం వల్ల దీనిని ఆనుకోని ఉన్న గ్రామాలు, తండాల ప్రజలకు మండలకేంద్రానికి వచ్చేందుకు 25 కిలోమీటర్లదూరం తగ్గుతుందని అన్నారు. మండలం చేసేవరకు ఉద్యమం ఆపేది లేదని నాయకులు తెలిపారు. ఆంధ్రా–తెలంగాణ రాష్ట్రాల మైత్రివారధికి ఇవతలి వైపున రెండు గంటలపాటు రోడ్డుపై రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. రోడ్డుపక్కనే వంటావార్పు పెట్టి ఆర్డీఓ వచ్చే వరకు కదలమని భీష్మించారు. ఎస్ఐ రజనీకర్ ఆధ్వర్యంలో పోలీసులు అఖిలపక్షం నాయకులను అరెస్ట్‌చేశారు. పోలీస్ వాహనంలో తీసుకవెళుతుండగా వాహనానికి అడ్డంగా నినాదాలు చేస్తూ కదలనీయలేదు. ప్రభుత్వానికి పోలీసుల పక్షాన నివేదికను పంపుతామని నచ్చచెప్పి నాయకులను పోలీస్టేషన్‌కు తరలించి వదిలిపెట్టారు. విద్యుత్ టవరెక్కిన నాయకులు సాగర్‌ను మండలం చేయాలంటూ ఓ పక్క రహదారిపై రాస్తారోకో చేస్తుండగా మరోపక్క అఖిలపక్ష నాయకులు రామస్వామి, నందూనాయక్లు ఆర్డీఓ రావాలంటూ విద్యుత్ టవర్ ఎక్కారు. పోలీసులు, యువకులు, నాయకులు వచ్చి బతిమిలాడి టవర్దింపారు. స్వచ్ఛందంగా సాగర్ బంద్ స్థానిక ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. ఉదయం నుంచే షాపులు, హోటళ్లు, పాఠశాలలు, స్థానిక నాట్కో ఫ్యాక్టరీని మూసివేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో యువకులు కాలనీలలో బైకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కున్రెడ్డి నాగిరెడ్డి, రమేశ్‌జీ, పొదిలశ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, మిట్టపల్లిశ్రీనివాస్, సునందారెడ్డి, బషీర్, రంగానాయక్, కృష్ణ, సాంబశివ, కిశోర్, జగదీష్, జంగయ్య, గౌస్, వేణు, రామస్వామి, నాగవర్థన్, సర్పంచులు మేకపోతుల చంద్రయ్య, బూడిదపావిత్రిఏడుకొండలు, లాలునాయక్, హచ్చునాయక్, లక్ష్మీతారాసింగ్, శౌరినాయక్, మునినాయక్, వాల్య, తాతారావు, మల్లన్న, సారమ్మ, రమేశ్‌గౌడ్, నజీర్, మందశాంత, సైదమ్మ, కైకా, శేఖరాచారి, అచ్చమ్మ, జిలానీ, జహంగీర్, నాట్కోప్రసాద్, శ్రీనివాస్, యాదగిరి, యూసూఫ్ తదితరులు పాల్గొన్నారు. -

కంచనపల్లిని మండలం చేయాలి
ఎనమిది గ్రామ పంచాయతీల తీర్మానం రఘునాథపల్లి : మండలంలోని కంచనపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని శుక్రవారం కలెక్టర్ వాకాటి కరుణ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, భూ పరిపాలన శాఖ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రేమండ్ పీటర్లకుS గ్రామస్తులు వినతి పత్రం అందించారు. హన్మకొండలో కలెక్టర్‌ను, హైదరాబాద్‌లో కడియం శ్రీహరి, రేమండ్ పీటర్లను కలిశారు. అన్ని సౌకర్యాలు గల కంచనపల్లిని మండల కేంద్రం చేయాలని కోరారు. భానాజీపేట, కన్నాయపల్లి, గబ్బెట, కోడూర్, రామన్నగూడెం, కుర్చపల్లి, కోమటిగూడెం, కంచనపల్లి గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయని పేర్కొన్నారు. అలాగే కోమల్ల, గోవర్దనగిరి గ్రామాలు కూడా దీనిపై సుముఖంగా ఉన్నాయని తెలిపారు. 10 గ్రామాలలో 38,742 జనాభా ఉన్నారని వివరించారు. కలెక్టర్, డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, రేమండ్ పీటర్ తమ వినతుల పట్ల సానుకూలంగా ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. వినతిపత్రాలు ఇచ్చిన వారిలో ఆయా గ్రామాలకు చెందిన లోనె ఇందిర, గుండె యమున, లోనె రవీందర్, గొంగళ్ల సోమయ్య, కారంపొడి వెంకటనర్సయ్య, దైద ప్రభాకర్, గుండె జోసఫ్, ప్యారపు రాములు, కొలిపాక మల్లేశం, గాదె కుమార్, కందుకూరి యాదగిరి ఉన్నారు. -
మండల కేంద్రంగా భద్రాచలం
ఖమ్మం: పోలవరం ముంపు ప్రాంతంలోని కొన్ని మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడంతో ఖమ్మం జిల్లాలోని రెండు మండలాల స్వరూపం మారింది. పోలవరం ముంపు గ్రామాల విలీనం తర్వాత భద్రాచలం బూర్గంపాడు మండలాలలను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ అంశానికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. దీంతో భద్రాచలం పట్టణం ఇప్పుడు మండలంగా మారింది. భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలోని 13 ఎంపీటీసీల ప్రాంతాన్ని ఒక మండలంగా, బూర్గుంపాడు మండలంలోని 9 గ్రామాల పరిధిలోని 16 ఎంపీటీసీలతో మండలాల పునర్ వ్యవస్థీకరణ జరిగింది.