
మండల కేంద్రంగా భద్రాచలం
ఖమ్మం: పోలవరం ముంపు ప్రాంతంలోని కొన్ని మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడంతో ఖమ్మం జిల్లాలోని రెండు మండలాల స్వరూపం మారింది. పోలవరం ముంపు గ్రామాల విలీనం తర్వాత భద్రాచలం బూర్గంపాడు మండలాలలను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ అంశానికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. దీంతో భద్రాచలం పట్టణం ఇప్పుడు మండలంగా మారింది. భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలోని 13 ఎంపీటీసీల ప్రాంతాన్ని ఒక మండలంగా, బూర్గుంపాడు మండలంలోని 9 గ్రామాల పరిధిలోని 16 ఎంపీటీసీలతో మండలాల పునర్ వ్యవస్థీకరణ జరిగింది.