శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 10 టీఎంసీలు నాగార్జునసాగర్‌కు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు నీటిని విడుదల చేయాలని బోర్డు తెలంగాణను కోరింది. అయితే శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తేనే సాగర్ కుడి కాలువకు నీళ్లిస్తామని తెలంగాణ మంగళవారం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో బుధవారం విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు తో జలవనరుల శాఖ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీశైలం నుంచి సాగర్‌కు 10 టీఎంసీలు విడుదల చేయాలని నిర్ణయించారు.