ten tmc water
-
పది టీఎంసీలకు పడిపోయిన ‘ఎల్లంపల్లి’
సాక్షి, మంచిర్యాల(హాజీపూర్): తగ్గుముఖం పట్టిన వర్షాలు... ఎగువ ప్రాంతాల నుంచి నిలిచిన నీటి ప్రవాహం... హైదరాబాద్‌కు నీటి తరలింపు.. తదితర కారణాల వల్ల ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ ప్రాజెక్టులోని నీటి మట్టం రోజురోజుకు తగ్గుతూ వస్తుంది. 10 రోజుల క్రితం ప్రాజెక్టు నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 10.679 టీఎంసీలుగా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 19.700 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. వర్షాలు పడి భారీ నీటి నిల్వలతో ఉన్న ప్రాజెక్టు ఇలా ఖాళీ అవ్వడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి వరకు ప్రాజెక్టులో నీటిమట్టం వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. ప్రాజెక్టు 148 మీటర్ల క్రస్ట్ లెవెల్‌కు గాను 144 మీటర్లు ఉండగా 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 10.679 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉంది. ప్రాజెక్టుకు ఎలాంటి ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో లేదు. ఇక హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్(సుజల స్రవంతి పథకం) ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌కు 300ల క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీటిని, మిషన్ భగీరథ కింద పెద్దపల్లి–రామగుండం నీటి పథకానికి 63 క్యూసెక్కులు, మంచిర్యాల నియోజకవర్గానికి 15 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
పది టీఎంసీలకు చేరిన ‘సాగర్’
నిజాంసాగర్(జుక్కల్): ఉభయ జిల్లాల వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం సోమవారం సాయంత్రానికి పది టీఎంసీలకు చేరింది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో నిజాంసాగర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి 18,933 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుతం 1398.66 (9.9 టీఎంసీలు) అడుగుల నీరు వచ్చి చేరింది. కొనసాగుతున్న నీటి విడుదల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జి ల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి 11,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో వస్తుండ టంతో ఒక వరద గేటు ఎత్తి 8,106 క్యూసెక్కుల నీటిని, టర్బయిన్ గేట్ ద్వారా 1,460 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నీటి విడుదల కొనసాగు తుండడంతో మంజీరా నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. నల్లవాగుకు తగ్గని వరద సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, కల్హేర్, కంగ్టి మండలాల్లో కురుస్తున్న వర్షాలకు మండలంలోని నల్లవాగు మత్తడిలోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి నల్లవాగు మత్తడిలోకి వరదనీరు పోటెత్తడంతో అలుగుపై నుంచి నీరు పొంగిపొర్లుతోంది. సోమవారం సాయంత్రం మత్తడి అలుగుపై నుంచి సుమారు 1,000 క్యూసెక్కుల వరద నీరు కిందకు వెళ్తోంది. మత్తడి ద్వారా పొర్లుతున్న వరదనీటితో మంజీరా ఉప నదికి జలకళ సంతరించుకుంది. -
సాగర్‌కు 10 టీఎంసీలు
శ్రీశైలం నుంచి విడుదల చేసేందుకు ఏపీ సర్కారు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 10 టీఎంసీలు నాగార్జునసాగర్‌కు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు 4 టీఎంసీలు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరిన విషయం విదితమే. ఈ మేరకు నీటిని విడుదల చేయాలని బోర్డు తెలంగాణను కోరింది. అయితే శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తేనే సాగర్ కుడి కాలువకు నీళ్లిస్తామని తెలంగాణ మంగళవారం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో బుధవారం విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు తో జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీశైలం నుంచి సాగర్‌కు 10 టీఎంసీలు విడుదల చేయాలని నిర్ణయించారు.