కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: ఏపీ అధికారులు విద్యుత్ ఉత్పత్తిపై వ్యక్తం చేసిన అభ్యంతరాలను కేఆర్‌ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ పరిగణలోకి తీసుకున్నారు. ఏపీ అధికారుల వాదనలు కేఆర్‌ఎంబీ సమర్థించింది. సాగర్, కృష్ణా డెల్టాలకు అవసరాలకు అనుగుణంగానే.. విద్యుత్ ఉత్పత్తి ఉండాలని కేఆర్‌ఎంబీ చైర్మన్ తెలిపారు. దీంతో జలవిద్యుత్ ఉత్పత్తిలో చైర్మన్ నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన సమాధానంతో సంతృప్తి చెందని తెలంగాణ అధికారులు కేఆర్‌ఎంబీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన బుధవారం జలసౌధలో జరిగిన కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ సమావేశానికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరయ్యారు. ఏపీ నుంచి జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్యామలరావు, ఈఎన్సీ నారాయణ రెడ్డి, జలవనరుల అంతర్ రాష్ట్ర జల విభాగం సీఈ శ్రీనివాస్ రెడ్డి హాజరుకాగా, తెలంగాణ నుంచి జల వనరుల శాఖ సెక్రటరీ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధరరావు, అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ మోహన్ కుమార్ హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment