Published
Sun, Jul 17 2016 8:23 PM
| Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
పైలాన్‌కాలనీ(నాగార్జునసాగర్) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్సీ సఫావత్ రాములునాయక్ అన్నారు. ఆదివారం పైలాన్ కాలనీలోని జెన్‌కో అతిథి గృహంలో గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేశవ్‌అజ్మీరా ఆధ్వర్యంలో జరిగిన నాగార్జునసాగర్ నియోజకవర్గ బంజారభేరీ సదస్సులో పాల్గొని మాట్లాడారు. 500మంది జనాభా ఉన్న ప్రతితండాను గ్రామపంచాయతీ చేయడం, తండాల్లోని ఆలయాల్లో పూజలు చేసే బావోజీలకు దూపదీపనైవేద్యం కింద ఆరువేలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖతతో ఉందన్నారు. జానాభా ప్రాతిపదికన 12శాతం రిజర్వేషన్ అమలు చేయడం, అటవీభూములకు హక్కులు కల్పించడం అంశాలపై మేథోమదనం జరుగుతుందని తెలిపారు. సమావేశానికి ముందే బంజారాభేరీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఆయనతో పాటు గిరిజన ఐక్యవేదిక అధ్యక్షులు నాగార్జుననాయక్, రతన్‌సింగ్‌నాయక్, చంధ్రమౌళినాయక్, శ్రీనివాసాయక్, శంకర్‌నాయక్, ధన్‌సింగ్‌నాయక్, దేశ్యానాయక్, చందూనాయక్, చిన్నానాయక్ తదితరులు పాల్గొని మాట్లాడారు.