
సాగర్, ప్రగ్యా జంటగా బషీర్ ఆలూరి దర్శకత్వంలో యూనివర్శల్ ఫిలిమ్స్ పతాకంపై జీవీఎస్ నిర్మాణంలో రూపొందు తున్న చిత్రం ‘సమరం’. నాలుగో షెడ్యూల్ కంప్లీట్ అయింది. బషీర్ మాట్లాడుతూ– ‘‘యాక్షన్, రొమాంటిక్ అండ్ లవ్‌స్టోరీ మూవీ ఇది. అన్ని కమర్షియల్ హంగులు జోడించాం’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నా’’ అన్నారు సాగర్. ‘‘ఒక మంచి సినిమాకి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. కరెక్ట్ టైమ్‌లో రిలీజ్ చేస్తే మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు నటుడు వినోద్‌కుమార్. రామ్ జగన్, ప్రభావతి, రాగిణి, అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: రాజ్ కిరణ్, కెమెరా: నాగబాబు.
Comments
Please login to add a commentAdd a comment