Pragya
-
టాలీవుడ్ హీరోయిన్ వీడియో!
హీరోయిన్ ప్రగ్య నగ్ర(#pragyanagra) పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమెకు చెందినదిగా పేర్కొంటున్న ప్రైవేట్ వీడియో ఒకటి ఆన్లైన్లో లీకైంది. అందులో ఆమె ప్రియుడితో ఏకాంతంగా ఉంది. ప్రగ్య పేరు చెడగొట్టేందుకు ఎవరో దుండగులు డీప్ ఫేక్ సాయంతో ఈ వీడియో సృష్టించారని అభిమానులు అంటున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.కాగా ప్రగ్య నగ్ర.. వరలరు ముఖ్యం అనే తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. నదికలిళ్ సుందరి యమున అనే మలయాళ మూవీలోనూ నటించింది. లగ్గం సినిమాతో ఇటీవలే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.చదవండి: గౌతమ్‌ను ఈడ్చుకెళ్లిన నిఖిల్.. కావాలని కొడతావంటూ కామెంట్స్ -
రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేయడం మా నాన్నతో యాక్ట్ చేసినట్టే ఉంది...
-
రెండు కుటుంబాలు కాదు రెండు మనస్సులు కలిస్తేనే లగ్గం..
-
‘శెభాష్ ప్రజ్ఞ’.. సీజేఐ సన్మానం
న్యూఢిల్లీ: కలలు కనడం సులువే. వాటిని నెరవేర్చుకోవడమే కష్టం. నిరంతర శ్రమ, పట్టుదల, అంకితభావంతో కలలు సాకారం చేసుకొనేవారు కొందరే ఉంటారు. అలాంటి కొందరిలో ఒకరే ప్రజ్ఞ. సుప్రీంకోర్టులో పని చేస్తున్న వంట మనిషి కుమార్తె ప్రజ్ఞ(25) అమెరికాలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ అభ్యసించే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. న్యాయశాస్త్రంలో ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్న ప్రజ్ఞను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తోపాటు ఇతర న్యాయమూర్తులు బుధవారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆమె ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, దేశానికి సేవలందించాలని వారు ఆకాంక్షించారు. భారత రాజ్యాంగంపై రచించిన మూడు పుస్తకాలపై వారంతా సంతకాలు చేసి, ఆమెకు బహూకరించారు. స్వయంకృషి, పట్టుదలతో ప్రజ్ఞ ఈ స్థాయికి చేరుకున్నారని, భవిష్యత్తులో ఆమెకు తమ వంతు తోడ్పాటు అందిస్తామని జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. పిల్లలు వారి కలలు నెరవేర్చుకొనేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు తల్లిదండ్రులపైనా ఉందని సూచించారు. సన్మాన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించిన ప్రజ్ఞ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. వారిని కూడా న్యాయమూర్తులు సన్మానించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయా, యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్‌లో మాస్టర్స్ చదవడానికి ప్రజ్ఞకు అవకాశం దక్కింది. స్కాలర్షిప్ లభించింది. ఆమె తండ్రి అజయ్ సమాల్ సుప్రీంకోర్టు వంట మనిషి. న్యాయశాస్త్రంలో ఉన్నత చదవులు చదవడానికి జస్టిస్ డీవై చంద్రచూడ్ తనకు స్ఫూర్తిగా నిలిచారని ప్రజ్ఞ చెప్పారు. ప్రజ్ఞ ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్‌లో రీసెర్చర్‌గా పనిచేస్తున్నారు. -
విజయదేవరకొండతో నటించాలని ఉంది
సీతమ్మధార (విశాఖ ఉత్తర): ‘విశాఖ అంటే చాలా ఇష్టం..ఇక్కడ అందాలకు ఫిదా అయ్యా’ అని వర్ధమాన నటి ప్రగ్యా నయన్ పేర్కొన్నారు. దిల్వాలే సినిమా షూటింగ్ నిమిత్తం ఆమె విశాఖ వచ్చారు. ఈ సందర్భంగా నయన్‌తో ‘సాక్షి’తో చిట్‌చాట్. సినిమా రంగానికి ఎలా వచ్చారు? మోడలింగ్‌లో రాణించడంతో నాపై నమ్మకం కలిగింది. క్రమంగా సినిమా అవకాశాలు వచ్చాయి. వాటిని సది్వనియోగం చేసుకుంటున్నా. ఇంతవరకు ఎన్ని చిత్రాల్లో నటించారు? మూడు చిత్రాల్లో నటించా. సురాపానం నా తొలిచిత్రం..మంచి పేరు వచ్చింది. చక్రవ్యూహం మార్చిలో విడుదల కానుంది. మూడో చిత్రం దిల్వాలే. మరో సినిమా కూడా ఈనెల 26న ప్రారంభం కానుంది. మీకిష్టమైన హీరో బన్నీ అంటే ఇష్టం. టాలీవుడ్లో అందరు హీరోలతో పనిచేయాలని ఉంది. ముఖ్యంగా విజయదేవరకొండ, పవన్ కల్యాణ్ వంటి స్టార్లతో నటించాలని ఉంది. మీ గురించి చెప్పండి బెంగళూరులో చదువుకున్నా..అక్కడే విప్రోలో ఉద్యోగం చేస్తూనే మోడలింగ్ చేశా..అలా సినిమా అవకాశాలు రావడంతో ఉద్యోగం మానేసి పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టా. వైజాగ్ ఎలా ఉంది వావ్ అద్భుతంగా ఉంది. ఇక్కడ బీచ్, పర్యాటక ప్రాంతాలు నా మనస్సు దోచుకున్నాయి. ఐ లవ్ వైజాగ్. -
మాలెగావ్ కేసు : సాధ్వి ప్రాగ్య, పురోహిత్‌లపై అభియోగాలు
సాక్షి, ముంబై : 2008 మాలెగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రాగ్య, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్‌లపై ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్ధానం మంగళవారం అభియోగాలు నమోదు చేసింది. వీరిద్దరితో సహా ఏడుగురిపై కుట్ర, హత్యాయత్నం సహా పలు అభియోగాలు మోపింది. అయితే తామెలాంటి నేరానికి పాల్పడలేదని నిందితులు వాదించగా కేసు విచారణను నవంబర్ రెండుకు న్యాయస్ధానం వాయిదా వేసింది. 2008, సెప్టెంబర్ 29న మాలెగావ్‌లోని మసీదు సమీపంలో జరిగిన పేలుళ్లలో ఆరుగురు మరణించగా, వంద మందికిపైగా గాయాలయ్యాయి. ఈ కేసులో పురోహిత్, ప్రగ్యా సింగ్‌లతో పాటు రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్, సమీర్ కులకర్ణి, అజయ్ రహిర్కార్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేదిలపై ఎన్ఐఏ ఇతర నిందితులుగా పేర్కొంది. కాగా ఈ కేసు నుంచి తమను తప్పించాలని కోరుతూ సాధ్వి ప్రగ్యా, పురోహిత్ సహా ఇతర నిందితుల వినతిని గత ఏడాది డిసెంబర్ 27న ఎన్ఐఏ న్యాయస్ధానం తోసిపుచ్చింది. -
యాక్షన్.. రొమాన్స్
సాగర్, ప్రగ్యా జంటగా బషీర్ ఆలూరి దర్శకత్వంలో యూనివర్శల్ ఫిలిమ్స్ పతాకంపై జీవీఎస్ నిర్మాణంలో రూపొందు తున్న చిత్రం ‘సమరం’. నాలుగో షెడ్యూల్ కంప్లీట్ అయింది. బషీర్ మాట్లాడుతూ– ‘‘యాక్షన్, రొమాంటిక్ అండ్ లవ్‌స్టోరీ మూవీ ఇది. అన్ని కమర్షియల్ హంగులు జోడించాం’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నా’’ అన్నారు సాగర్. ‘‘ఒక మంచి సినిమాకి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. కరెక్ట్ టైమ్‌లో రిలీజ్ చేస్తే మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు నటుడు వినోద్‌కుమార్. రామ్ జగన్, ప్రభావతి, రాగిణి, అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: రాజ్ కిరణ్, కెమెరా: నాగబాబు. -
చివరి నిమిషంలో నో అందట!
'శౌర్య' అంతగా ఆకట్టుకోకపోవడంతో తన తదుపరి చిత్రాలను శరవేగంగా పూర్తిచేస్తున్నాడు మంచు మనోజ్. ప్రస్తుతం మూడు సినిమాలు మనోజ్ చేతిలో ఉండగా వాటిలో ఒకటి సత్య డైరెక్షన్లో తెరకెక్కుతుంది. గుంటూరు బ్యాక్ డ్రాప్లో సాగే ప్రేమకథగా రానున్న ఈ సినిమాలో మనోజ్ లవర్ బోయ్‌గా అలరించనున్నాడు. 'కంచె' ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా కన్ఫామ్ అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వరుణ్ అట్లూరి నిర్మించనుండగా శ్రీ వసంత్ సంగీతాన్ని సమాకూర్చనున్నాడు. అయితే మరొకొద్ది రోజుల్లో షూటింగ్ మొదలవుతుందనగా ప్రగ్యా.. నేను ఈ సినిమా చేయలేనంటూ చెప్పి నిర్మాతలకు టెన్షన్ తెచ్చిపెట్టిందని టాక్. ఆఖరి నిముషంలో ఆమె నో అంటూ హ్యాండివ్వడంతో మరో హీరోయిన్ను వెతికే పనిలో పడిందట సినిమా యూనిట్. 'కంచె' సినిమాతో అందరి దృష్టిలో పడ్డా అమ్మడికి అవకాశాలు మాత్రం పెద్దగా వచ్చింది లేదు. ఇప్పుడు చేతిలో ఉన్న ఈ సినిమాను కూడా ఇలా వదులుకోవడంతో ముందు ముందు తిప్పలు తప్పవంటున్నారు సినీ పండితులు. -
చాహత్ మళ్లీ రూటు మార్చింది!
టీవీక్షణం కొంతమంది ఏదో ఒకటి చేయాలనుకుంటారు. కొంతమంది మాత్రం ఇంకేం కొత్తగా చేద్దామా అని ఎప్పుడూ తపన పడుతూనే ఉంటారు. చాహత్ఖన్నా ఈ రెండో రకం. ఏదో ఒకటి చేసి ఊరుకోవడం ఆమెకలవాటు లేదు. మాటిమాటికీ రూటు మారుస్తుంది. రకరకాల రూపాలు ప్రదర్శిస్తూ ఉంటుంది. రచయిత్రిగా, టీవీ-సినీ నటిగా, మోడల్‌గా రకరకాల పాత్రల్ని ఇప్పటి వరకూ పోషించిన ఆమె ఈసారి గరిటె పట్టింది. ‘ఖానా ఖజానా’ చానెల్లో ‘లిక్విడ్ లాంజ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది చాహత్. ‘బడే అచ్చే లగ్తే హై’ సీరియల్ తర్వాత ఆమెకు మళ్లీ అంత పేరు తెచ్చిపెట్టిందీ ప్రోగ్రామ్. చాహత్కి వంట చేయడం చాలా ఇష్టం. ముఖ్యంగా డ్రింక్స్ తయారు చేయడంలో నిపుణురాలు. తన టాలెంట్‌ను చూపించడానికి ‘ఖానా ఖజానా’ను ఎంచుకుంది. రకరకాల మిల్క్ షేక్స్, కాక్ టెయిల్స్, స్మూతీస్, హెల్త్ డ్రింక్స్, రకరకాల టీలు, కాఫీలు చేయడం నేర్పిస్తుంది చాహత్. నటిగా ఆకట్టుకున్న ఆమె, యాంకర్‌గానూ మెప్పిస్తోంది! నాటి గంగేనా ఈ ప్రగ్య?! ఎక్కువగా మాట్లాడని ఓ అమ్మాయి. నచ్చని విషయాన్ని నచ్చలేదని కూడా చెప్పలేనంత నెమ్మదస్తురాలు. ఎదుటివాళ్లు తనని బాధ పెడుతున్నా ఏమీ అనలేనంత సౌమ్యురాలు. ఆమె ఏడిస్తే ప్రేక్షకులకు కన్నీళ్లు వచ్చేవి. ఆమెకి కష్టమొస్తే అది తీరేవరకూ సీరియల్ చూసేవాళ్లకి నిద్ర పట్టేది కాదు. ఇదీ... ‘బాలికావధు’ సీరియల్లో గంగ పాత్ర తీరు! ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి. మగపిల్లలతో సమానంగా పనులు చక్కబెట్టేస్తుంది. ఎక్కడికైనా దూసుకెళ్లిపోతుంది. ఎలాంటి పనయినా ధైర్యంగా చేసేస్తుంది. గలగలా మాట్లాడుతుంది. చకచకా సాగిపోతుంది. ఆమెను చూసిన వాళ్లకి ఉత్సాహం వచ్చేస్తుంది. ఆమె వ్యక్తిత్వం చూసి అందరికీ స్ఫూర్తి కలుగుతుంది. ఇది ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్లోని ప్రగ్య పాత్ర తీరు! ఏమాత్రం పొంతన లేని ఈ రెండు పాత్రలనూ పోషించింది ఒకే అమ్మాయి... శృతి ఝా. మొన్నమొన్నటి వరకూ గంగ పాత్రలో ఆమాయకత్వాన్ని ఒలకబోసిన ఆమె... ఇటీవలే జీ టీవీలో ప్రారంభమైన ‘కుంకుమ్ భాగ్య’లో చురుకైన అమ్మాయి ప్రగ్యగా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. నాటి గంగేనా నేటి ఈ ప్రగ్య అంటూ ప్రేక్షకులు ముగ్ధులైపోతున్నారు. ఏ పాత్ర అయినా చేయగలదీమె అంటూ కితాబులిస్తున్నారు! మాయాద్వీపంలో పిల్లల సందడి! రియాలిటీ షో అనగానే ఆటపాటలు, అల్లరి చేష్టలు, పాటలు, డ్యాన్సులు గుర్తొచ్చి హుషారొచ్చేస్తుంది. అందులోనూ చిన్న పిల్లలు పాల్గొనే షోలంటే వాళ్ల ముద్దు మాటలు, తుంటరి వేషాలు చూసేందుకు ఉత్సాహం కలుగుతుంది. అందుకే అనుకుంటా... ఓంకార్ ఎప్పుడూ పిల్లలతో షో చేయడానికి ఇష్టపడుతుంటాడు. ఇంతకుముందు డ్యాన్స్ షోతో సందడి చేసేవాడు. ఆ తరువాత ‘మాయాద్వీపం’ (జీ తెలుగు) సృష్టించాడు. అప్పుడప్పుడూ పెద్దలు కూడా పాల్గొంటున్నా, పిల్లలే ప్రధానంగా సాగే షో ఇది. మాయాద్వీపంలా కనిపించే సెట్టింగులో పిల్లలతో విచిత్రమైన ఆటలు ఆడిస్తుంటాడు ఓంకార్. మధ్యలో వింత వింత మనుషులు వస్తుంటారు. వాళ్లతో పిల్లలు ఫైట్ చేస్తుంటారు. డ్యాన్సులు చేస్తారు. తెలివి తేటలకు పరీక్ష పెట్టే రౌండ్స్ కూడా ఉంటాయి. మొత్తంగా షో మాంచి వినోదాత్మకంగా ఉంటుంది. అదృష్టంకొద్దీ ఓంకార్ షోలలో ఉండే ఎమోషనల్ సన్నివేశాలు, కన్నీళ్లు పొంగి పారడాలు ఇందులో లేవు కాబట్టి ఆద్యంతం సరదాగానే సాగిపోతుంది!