చివరి నిమిషంలో నో అందట! | Pragya Says No To Manoj? | Sakshi
Sakshi News home page

చివరి నిమిషంలో నో అందట!

Published Mon, Aug 1 2016 7:48 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

చివరి నిమిషంలో నో అందట!

చివరి నిమిషంలో నో అందట!

'శౌర్య' అంతగా ఆకట్టుకోకపోవడంతో తన తదుపరి చిత్రాలను శరవేగంగా పూర్తిచేస్తున్నాడు మంచు మనోజ్. ప్రస్తుతం మూడు సినిమాలు మనోజ్ చేతిలో ఉండగా వాటిలో ఒకటి సత్య డైరెక్షన్లో తెరకెక్కుతుంది. గుంటూరు బ్యాక్ డ్రాప్లో సాగే ప్రేమకథగా రానున్న ఈ సినిమాలో మనోజ్ లవర్ బోయ్గా అలరించనున్నాడు. 'కంచె' ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా కన్ఫామ్ అయ్యింది.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వరుణ్ అట్లూరి నిర్మించనుండగా శ్రీ వసంత్ సంగీతాన్ని సమాకూర్చనున్నాడు.

అయితే మరొకొద్ది రోజుల్లో షూటింగ్ మొదలవుతుందనగా ప్రగ్యా.. నేను ఈ సినిమా చేయలేనంటూ చెప్పి నిర్మాతలకు టెన్షన్ తెచ్చిపెట్టిందని టాక్. ఆఖరి నిముషంలో ఆమె నో అంటూ హ్యాండివ్వడంతో మరో హీరోయిన్ను వెతికే పనిలో పడిందట సినిమా యూనిట్. 'కంచె' సినిమాతో అందరి దృష్టిలో పడ్డా అమ్మడికి అవకాశాలు మాత్రం పెద్దగా వచ్చింది లేదు. ఇప్పుడు చేతిలో ఉన్న ఈ సినిమాను కూడా ఇలా వదులుకోవడంతో ముందు ముందు తిప్పలు తప్పవంటున్నారు సినీ పండితులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement