Published
Sat, Oct 8 2016 11:09 PM
| Last Updated on Thu, Oct 4 2018 7:01 PM
బుద్ధవనంలో విదేశీయుల సందడి
నాగార్జునసాగర్: శ్రీపర్వతారామంలోని బుద్ధవనాన్ని శనివారం 14 దేశాలకు చెందిన ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా 40 అడుగుల బుద్ధుడి విగ్రహాన్ని, మ్యూజియంను సందర్శించారు. అనంతరం ఫణిగిరితో పాటు, ఖమ్మం జిల్లాలోనే నేలకొండపల్లిని సందర్శించేందుకు వెళ్లారు. సాగర్‌కు వచ్చిన వారిలో ఆస్ట్రేలియాకు చెందిన కుహదాస్ వివేకానంద, జర్మనీకి చెందిన గెర్డ్ మథియాస్ డెకెర్ట్, గ్రీస్‌రం చెందిన తెకహరిదౌఅతనాస్య, ఇటలీకి చెందిన అనియోలోడెల్‌గట్టో, గబ్రీలా, బాల్దిని, ఆంటోనియా అర్టోలెవతో పాటు మలేసియా, నెదర్లాండ్, తైవాన్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. వీరివెంట పర్యాటక సంస్థ జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్‌రావు, గైడ్ సత్యనారాయణ, శ్యాంలు ఉన్నారు.