budda
-
మనుషులు రాళ్లు, రప్పలు కాదు, అలా చేయకుండా ఉండటానికి
శీలభ్రష్టత అంటే వ్యభిచరించడం ఒక్కటే కాదు. అసత్యాలు పలకడం, దొంగిలించడం, నిండు ప్రాణాలు తియ్యడం, మత్తుపానీయాలు సేవించడం. ఇవన్నీ శీలభ్రష్టతలే! ఈ దోషాలు లేని వ్యక్తి గానీ, సమాజం గానీ నైతికంగా దిగజారదు. తప్పు చేయడం తప్పు కాదు. తెలియకుండా కొన్ని తప్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ అవి తప్పు అని తెలిశాక కూడా అవే తప్పులు చేయడమే పెద్ద తప్పు. తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవడాన్ని మరలా ఆ తప్పుని చేయకపోవడాన్ని బుద్ధుడు ధర్మతాదృష్టి అంటాడు. ఒక భిక్షువు వెనుకటి అలవాటుని మానుకోలేక సారాయి సేవించాడు. అతను భిక్ష కోసం వెళ్ళినప్పుడు గృహస్తులు చక్కగా భోజనం పెట్టారు. ధర్మ ప్రవచనం విన్నారు. ఆ తరువాత మోమాటం పెట్టి పానీయానికి బదులు పులిసిన ద్రవాన్ని ఇచ్చారు. అది సారాయి లాంటిదే అని తెలిసి కూడా నిగ్రహించుకోలేక కొద్దిగా సేవించాడు. కానీ.. ఆ తరువాత ఎంతో తప్పుచేసిన వాడిగా మధనపడ్డాడు. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తిరిగి ఆశ్రమానికి వచ్చాక తన మిత్ర భిక్షువులు ఒకరిద్దరికి చెప్పుకున్నాడు. అయినా ఆ భిక్షువు మనస్సు శాంతించలేదు. ఏదో ఒకమూల తప్పుచేశాను అనే భావన తొలుస్తూనే ఉంది. చివరికి బుద్ధుని చుట్టూ బౌద్ధసంఘం చేరి ఉంది. అప్పుడు బుద్ధుడు ఆ భిక్షువుని శాంతపరచి, అందరితో పాటు కూర్చోబెట్టి–‘‘భిక్షువులారా! తెలిసో తెలియకో తప్పులు, దోషాలు కలిగినప్పుడు వాటిని కప్పిపుచ్చుకునే వారు దుశ్శీలురు. కానీ కొందరు తమ దోషాన్ని విజ్ఞులకీ మిత్రులకీ చెప్పుకుంటారు. ఇకపై ఇలాంటి తప్పు జరగకుండా నడుచుకుంటారు. ఇలా సరిదిద్దుకునే పద్ధతిని ‘ధర్మతా దృష్టి’ అంటారు.వీరు పసిపిల్లలతో, ఆవుతో సమానం’’ అంటూ భిక్షు సంఘాన్ని కలయ చూశాడు. ఆ భిక్షువు వంక పరిశీలనగా చూశాడు. అతనిముఖంలో తొంగి చూసే సిగ్గు, బిడియం పోయాయి. మనోనిర్మలత అతని ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించింది. బుద్ధుడు మరలా– ‘‘భిక్షువులారా! ఒక పసిబిడ్డ వెల్లికిలా పడుకుని ఉంటాడు గదా! ఆ పసితనంలో కూడా ఆ బిడ్డ తన చేతితో గానీ, కాలితో గానీ.. అగ్నిని ముట్టుకుంటే ఏం చేస్తాడు? చాలా వేగంగా.. ఆ చేతినో, కాలినో వెనక్కి ముడుచుకుంటాడు. అలాగే ధర్మతాదృష్టి కలిగిన వారూ తమ దోషాన్నుండి అంతే వేగంగా వెనక్కి మళ్ళుతారు. గట్టున మేస్తూ ఉన్న ఆవు ఆకలితో ఉండి, తాను ఆబగా మేస్తూ కూడా తన దూడను గమనిస్తూనే ఉంటుంది. అలాగే ఈ ధర్మతాదృష్టి కలిగిన వారు తమ దోషాల్ని తామే సరిదిద్దుకుంటూ.. ఆవులా జాగ్రత్తగా ఉంటూ తమ జ్ఞానాన్ని, శీలాన్నీ వృద్ధి చేసుకోవాలి’’ అని చెప్పాడు. ఆ భిక్షువుకి మనస్సులోని అల్లకల్లోలాలు శాంతించాయి. తన మీద తనకు ధైర్యం వచ్చింది. ధర్మసాధనలో అందరికంటే ముందు శిఖరాగ్రానికి చేరాడు. ఇలాంటి దృష్టి సంపన్నుడు ధర్మబలుడై లోకోత్తరుడౌతాడు. మనుషులు మానూ మాకులూ, రాయీ రప్పలూ కాదు ఏం దోషం చేయకుండా పడి ఉండటానికి. తాను సమాజంలో, సమాజం తనలో ఉండి నడిచేవారు. సమాజ హితాన్ని కోరే వారు ధర్మతాదృష్టితో తమని తాము సంస్కరించుకుంటూ, సమాజాన్ని సంస్కరించాలి. ఇదే ఉత్తమ ధర్మం. అత్యుత్తమ ధర్మం. అలాంటి మార్గాన్ని అందించిన తథాగత బుద్ధుడు సదా స్మరణీయుడు! – డా. బొర్రా గోవర్ధన్ -
మలినాల నుంచి విముక్తి చెందాలి.. అప్పుడే ధర్మ సాధన
మనోశుద్ధి అంటే చిత్తశుద్ధి. చిత్తం ఈ మలినాల నుండి విముక్తి చెందడం. అలా విముక్తి చెందిన చిత్తంలో తిరిగి మరలా అమానవీయ విషయాలు మొలకెత్తవు. సమూలంగా నిర్మూలించబడతాయి. ఒకసారి బుద్ధుడు తన భిక్షువులతో కలసి ఒక విశాలమైన పొలంలోంచి నడిచిపోతున్నాడు. ఆ పొలం అంతకుముందే తగలబడి ఉంది. పంటను తీశాక రైతులు చెత్తనంతా తగలబెట్టారు. కానీ... ఆ తర్వాత వర్షం పడింది. ఆ తగలబడిన మసిలోంచి పచ్చని గడ్డి పిలకలు నవనవలాడుతూ పైకి లేస్తున్నాయి. బుద్ధుడు వాటి వంక చూస్తూ ముందుకు నడిచాడు. ఆ పొలం దాటి పెద్ద కాలువ కట్ట ఎక్కారు. ఆ కట్ట మీద మొదలు పైకి నరికిన పెద్ద తుమ్మచెట్టు మోడు కనిపించింది. ఆ తర్వాత రకరకాల చెట్ల మోడులు కనిపించాయి. వాటి మద్య నరికేసిన తాటిచెట్లు మోడులూ కనిపించాయి. బుద్ధుడూ, భిక్షువులూ ఆ మోళ్ళను గమనిస్తూనే ముందుకు నడిచి వెళ్ళారు. వారు కొంత దూరం పోయాక నదీ తీరంలో పెద్ద మర్రిచెట్టు కనిపించింది. అప్పటికే ఎండ ఎక్కుతూ ఉంది. కొంత సేపు సేద తీరడానికి ఆ చెట్టు కింద ఆగారు. భిక్షువులు కొన్ని సందేహాలు అడిగారు. వాటికి సమాధానమిచ్చాడు. ఆ తరువాత ఆయన ప్రబోధం ‘చిత్త మలినాలు’ మీదికి మళ్ళింది. ఆ విషయం చెప్తూ స్వచ్ఛ జలం గురించి చెప్పాడు. బుద్ధునికి నిత్య జీవితంలో తమకు అనుభవమయ్యే అంశాల్ని జోడించి, తేలికగా అర్థం అయ్యేలా చెప్పటం అలవాటు. దానితో అప్పటి వరకూ తాము నడచి వచ్చిన దారిలోని సంఘటనలు తీసుకున్నాడు. ‘‘భిక్షువులారా! చూశారుగా! మనం నడచి వచ్చిన పొలాన్ని తగులబెట్టారు. అయినా ఆ తరువాత దానిలోని గడ్డి, తుంగ పరకలూ మొలకెత్తాయి. అలాగే... గట్టు మీది ఎన్నో చెట్లు మొదలంటూ నరికినా, మరలా పిలకలు వేశాయి. చివురులు తొడిగాయి. ఐతే ఒకే ఒక జాతి వృక్షాలు మాత్రం నరికివేశాక అవి ఎలాంటి చివురులు తొడగలేవు. అవి ఏమిటో గమనించారా?’’ అని అడిగాడు. ఒక భిక్షువు వినమ్రంగా ‘భగవాన్! తాటిచెట్లు’ అన్నాడు. బుద్ధుడు చిరుమందహాసంతో –‘‘అవును భిక్షూ! నీ పరిశీలన సరైనదే! మన మనస్సులో రాగద్వేషాలూ, కోరికలూ, మోహాలు అనే అకుశలాలు అన్నీ అలాగే నరికివేయబడాలి. అవి మరలా మొలకెత్తకూడదు. చివురులు తొడక్కూడదు. తాటిచెట్టును కొట్టి వేశాక, ఎలా చివురులు వేయదో, పిలకలు తొడగదో మన మనో క్షేత్రంలో అకుశలాల్ని, కోర్కెల్ని (తృష్ణల్ని) అలాగే తొలగించుకోవాలి. మొదలంటూ నరికిన తాటిచెట్టులా తృష్ణల్ని తెగతెంచుకోవాలి. అదే తృష్ణాక్షయం. అలాంటి చిత్తమే నిర్మల చిత్తం. స్వచ్ఛమైన నీటిలాంటి చిత్తం. మన ధర్మ సాధనంతా అలాంటి నిర్మల చిత్తం కోసమే!’’ అన్నాడు. ఆ గంభీర ధర్మోపదేశం వారి హృదయాల్ని తాకింది. వారి మనో ఫలకంపై మొదలు నరికిన తాటిచెట్టు ప్రత్యక్షం అయింది. అప్రయత్నంగా అందరూ కనురెప్పలు మెల్లగా మూశారు. ఏకాగ్రతలోకి జారుకున్నారు. ధ్యాన నిమగ్నులయ్యారు. – డా. బొర్రా గోవర్ధన్ -
సిద్ధయానం
బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ఈ త్రిరత్నాలు అక్కడ చెవులకు వినిపించలేదు, కానీ మనసుకు గుర్తుకు వచ్చింది. మన చెవుల్లో మార్మోగుతున్న భావనకు లోనవుతాం. బుద్ధవనం ఆవరణలో విహరిస్తున్నంత సేపే కాదు, ఆ తర్వాత కూడా ఒక స్వచ్ఛమైన భావన వెంటాడుతూనే ఉంటుంది. ఆ భావనను వర్ణించడానికి మాటలుండవు. ఎవరికి వాళ్లు లోనవ్వాల్సిందే. బుద్ధవనంలోకి ప్రవేశించగానే ధర్మచక్రం స్వాగతం పలుకుతుంది. ఎటు చూసినా బుద్ధుడు... బౌద్ధ చిహ్నాలు ఆహ్లాదాన్నిస్తాయి. కలువ కొలనులోని బుద్ధుని పాదాలకు పుష్పార్చన చేసి ముందుకు వెళ్తే శ్రీలంక బౌద్ధులు బహుమతిగా ఇచ్చిన ధర్మగంట కనిపిస్తుంది. మరో వైపు లుంబినీ వనంలో కాలావృక్షం, ఆ వృక్షం కింద సిద్ధార్థుడు పుట్టడం, పుట్టగానే ఏడు అడుగులు నడవడం లోహపు విగ్రహాల్లో కనిపిస్తుంది. సిద్ధార్థుడి దృష్టిని ఆకర్షించిన కుష్టు వ్యాధి గ్రస్తుడు, శవం, సన్యాసి మొదలైన వారిని చూసి విచలితుడు కావడం కనిపిస్తుంది. నీటి యుద్ధాన్ని నివారించడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడం దృశ్యరూపంలో ఉంటుంది. గాంధార శిల్పరీతిలో ఉన్న మీసాల బుద్ధుడు రోహిణి నది నేపాల్‌లోని కపిలవస్తులో పుట్టి, భారతదేశంలోకి ప్రవహించి ఉత్తరప్రదేశ్, గోరఖ్‌పూర్ దగ్గర రాప్తి నదిలో కలుస్తుంది. వర్షాలు తక్కువగా కురిసిన ఏడాది పంటలకు సరిగా నీరందకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలై, అది వివాదంగా మారింది. ఇరు వర్గాల్లో ఒకరు సిద్ధార్థుడి తల్లి వైపు వాళ్లు, మరొకరు తండ్రి వైపు వాళ్లు. శాంతికాముకుడైన సిద్ధార్థుడు సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. ఇరువురి మధ్య అంగీకారం కుదరకపోవడంతో యుద్ధం అనివార్యమవుతుంది. సిద్ధార్థుడిని అంతరయానంలోకి తీసుకెళ్లిన అంశాలివన్నీ. అలాగే ఇల్లు వదిలి వెళ్లిపోవడానికి ముందు ఆత్మావలోకన స్థితిలో ఉన్న సిద్ధార్థుడు, ఎదురుగా అతడు ప్రయాణించే గుర్రం కంటక విగ్రహం కూడా ఉన్నాయి. సిద్ధార్థుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం కావడం, ఐదుగురు సన్యాసులకు ప్రవచనం ఇవ్వడం, పరిత్యాగం... ఇవన్నీ బుద్ధచరితవనంలో కనువిందు చేసిన దృశ్యాలు. కష్ణానది తీరాన బుద్ధవనం ఏరియల్ వ్యూ శ్రీలంక బుద్ధుడు ధ్యానవనంలో 27 అడుగుల బుద్ధ విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. తొలిచూపులో హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ బుద్ధుడు గుర్తు వస్తాడు. వెంటనే తేడా ఉన్నట్లు కూడా స్ఫురిస్తుంది. హుస్సేన్‌సాగర్ బుద్ధుడు అభయ హస్త ముద్రలో ఉంటే బుద్ధవనంలో కుడి చేతిని పైకి ఎత్తి అరచేతిని ఎడమవైపు తిప్పి ఉంటాడు. ఇది శ్రీలంక, అవునాక గ్రామంలో ఉన్న బుద్ధుని విగ్రహానికి ప్రతిరూపం. శ్రీలంక బౌద్ధ సన్యాసులు స్వయంగా బుద్ధవనానికి వచ్చి ఈ బుద్ధుని విగ్రహాన్ని తయారు చేశారు. బుద్ధవనంలో ఎంట్రన్స్ ప్లాజా, బుద్ధ చరితవనం, జాతక వనం (బోధిసత్వ పార్కు), స్థూపవనం, మహాస్థూపం, ధ్యానవనంలోని అవుకాన స్థూపం, లండన్ మ్యూజియంలో ఉన్న ఫలకాల ప్రతిబింబం 14 అడుగుల రాతి గోడ ‘రెయిలింగ్ ఎరీనా’ ప్రధానంగా చెప్పుకోవాల్సినవి. పంచశీల పతాకాలు గాలికి రెపరెపలాడుతుంటాయి. జాతక వనంలో ఉన్న తొలి కథాశిల్పం తెలంగాణలో విరిసిన బౌద్ధం బుద్ధుడు పుట్టింది క్రీ.పూ 563లో. క్రీ.పూ 480 వరకు జీవించాడు. బుద్ధుడు నివసించిన కాలంలోనే తెలంగాణలో బౌద్ధం వికసించింది. బావరి అనే సన్యాసి బుద్ధుడి గురించి విని, 16 మంది శిష్యులను మగధకు పంపించాడు. వైశాలిలోని వేణువనంలో బుద్ధుడి ప్రవచనాలు, బోధనలు జరిగేవి. 15 మంది అక్కడే ఉండిపోగా, పింగయ అనే శిష్యుడు మాత్రమే వెనక్కి వచ్చి బుద్ధుడి తత్వాన్ని తెలుగునేల మీద బోధించాడు. బుద్ధవనంలో ఉన్న ప్రతి నిర్మాణం బుద్ధుడికి సంబంధించిన ఏదో ఒక రిఫరెన్స్ ఆధారంగా రూపొందించినవే. జాతక కథలు, అజంతా, ఎల్లోరా గుహల్లో ఉన్న చిత్రాలు, శిల్పాలు, జనపదాల్లో వ్యవహారంలో ఉన్న కథలలోని ఘట్టాల ఆధారంగా రూపొందించిన కళాకృతులు ఇవన్నీ. 2006, జనవరిలో దలైలామా బుద్ధవనాన్ని సందర్శించినప్పుడు బుద్ధగయ నుంచి తెచ్చిన బోధి మొలకను నాటారు. అది ఇప్పుడు పెద్ద బోధివృక్షంగా మారింది. సిద్ధార్థుని గుర్రం కంటక మహా ప్రదక్షిణం మహాస్థూపం అమరావతి స్థూపం నమూనాతో రూపొందింది. మహాస్థూపం లోపలకి అడుగుపెట్టడానికంటే ముందు స్థూపాన్ని ప్రదక్షిణగా చుట్టి వస్తే సిద్ధార్థుని పుట్టుక, వివాహం, ఇల్లు వదిలి వెళ్లడం, బోధివృక్షం కింద ధ్యానం, జ్ఞానోదయం, పరివ్రాజకులకు బోధనలు, మహాపరిత్యాగం వరకు, అలాగే తొలినాటి బౌద్ధం నుంచి సమకాలీన వజ్రయాన బౌద్ధం వరకు, బౌద్ధధర్మం సమాజానికి చేసిన దిశానిర్దేశం, అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించడం, బౌద్ధం మహాయానం, హీనయానంగా విభజనకు లోను కావడం, బుద్ధుడు చెప్పిన అహింస, సత్య ధర్మాన్ని గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో పాటించడం, అంబేద్కర్ బౌద్ధాన్ని తీసుకోవడం, భారత రాజ్యాంగం బౌద్ధం నుంచి ధర్మచక్రాన్ని, నాలుగు సింహాల చిహ్నాన్ని స్వీకరించడం వరకు బౌద్ధానికి చెందిన ముఖ్యమైన ఘట్టాలు కుడ్యశిల్పాలుగా ఉన్నాయి. చరితవనంలో కొలువుదీరిన ధ్యానబుద్ధుడు మీసాల బుద్ధుడు మహాస్థూపం కింది అంతస్థులో గోపురం లోపలికి వెళ్తున్నప్పుడు ఎదురుగా ఆచార్య నాగార్జుడి విగ్రహం, కుడివైపు ఆర్కియాలజీ మ్యూజియం ఉన్నాయి. ఆ మ్యూజియంలో బుద్ధుడి చిత్రలేఖనాలు, రాతి శిల్పాలు, లోహపు శిల్పాలు, తల విరిగిన బోధిసత్వుడి విగ్రహం ఉన్నాయి. శిల్పాలు గాంధార, మధుర, అమరావతి శిల్పరీతుల్లో ఉన్నాయి. గాంధార శిల్పరీతిలో భుజాలు బలిష్టంగా, వస్త్రధారణ వైవిధ్యంగా ఉంటుంది. ఇక్కడి గాంధార బుద్ధుడికి మీసాలు ఉన్నాయి. బుద్ధుడిని సౌమ్య మూర్తిగా చూస్తాం. ఈ బుద్ధుడు సౌమ్యంగా కనిపిస్తూనే రాజఠీవి ప్రదర్శిస్తుంటాడు. దలైలామా నాటిన వృక్షం మహాస్థూపంలో ఉన్న వైరోచన బుద్ధుడు మరో లోకం మహాస్థూపంలోకి అడుగుపెట్టేటప్పుడు కళ్లు మూసుకుని మౌనంగా లోపలికి వెళ్లి మెల్లగా కళ్లు తెరిస్తే... ఓ అద్భుతం కళ్ల ముందు ఆవిష్కారమవుతుంది. మరోలోకంలో విహరిస్తున్నట్లు ఉంటుంది. నిర్మాణ నైపుణ్యాన్ని నిశితంగా పరిశీలిస్తే ఆకాశాన్ని అరచేతిలో ఇమిడ్చే ప్రయత్నం ఏదో జరిగినట్లు అనిపిస్తుంది. నీలిరంగులో మేఘావృతమైన ఆకాశాన్ని తలపించే పై కప్పు, మేఘావృతం కిందుగా పద్మం రెక్కల అమరిక అద్భుతమైన కౌశలం. ఒక్కో వరుసకు అరవై రెక్కలు, అలా 16 వరుసలున్నాయి. గోపురానికి మధ్యలో బంగారు రంగులో బుద్ధుడు మెరిసిపోతుంటాడు. నాలుగు దిక్కులకు నాలుగు విగ్రహాలు, ఈ నాలుగు దిక్కుల్లో ఉన్నది ఒకే రూపం. వైరోచన ధర్మచక్ర ప్రవర్తన బుద్ధుడు. నాలుగు మూలల్లో అమిత అభ, అక్షోభ్య, రత్నసంభవ, అభయముద్ర రూపాల్లో ఉంటాడు. అవునాక బుద్ధుడు జాతకవనం బౌద్ధ జాతక కథలు మొత్తం 547. ప్రధానమైన 40 కథలను ఇక్కడ చూడవచ్చు. ఒక్కో కథ ఒక్కొక్క ఫలకం మీద చెక్కి ఉంటుంది. దీపాంకర కథతో మొదలై వెస్సంతర కథతో ముగిసింది. ఈ కథల్లో చిన్నప్పుడు చదువుకున్న కోతి– మొసలి కథ, శిబి చక్రవర్తి కథ, రిష్యశృంగుని కథ ఉన్నాయి. ఈ కథలకు అక్షరరూపం పక్కనే బోర్డులో ఉంటుంది. ఇక స్థూపవనం ప్రపంచంలోని బౌద్ధస్థూపాలన్నీ ఒక్కచోట కొలువుదీరినట్లుండే ప్రదేశం. ప్రతి ప్రముఖ బౌద్ధ స్థూపానికి నమూనా స్థూపాన్ని నిర్మించారు. ధర్మచక్రం నమూనా శిల్పం దశాబ్దాల శ్రమ బుద్ధవనం ప్రాజెక్టు పనులు 2003లో మొదలయ్యాయి. నల్గొండ జిల్లాలో 274 ఎకరాల్లో నిర్మాణం మొదలైంది. ప్రస్తుతం తెలంగాణ పర్యాటక శాఖ అభివృద్ధి చేస్తున్న బుద్ధిస్ట్ హెరిటేజ్ థీమ్ పార్కులో కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. అష్టాంగమార్గాలకు ప్రతీక నిర్మాణాలలో చరితవనం, జాతక వనం, ధ్యానవనం, స్థూపవనం, మహాస్థూపం పూర్తయ్యాయి. తుది మెరుగులు దిద్దుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. బుద్ధవనం పర్యటన మనసును సిద్ధ స్థితిలోకి తీసుకువెళ్తుందనడంలో సందేహం లేదు. - వాకా మంజులారెడ్డి -
మళ్లీ మోసం చేసేందుకు బాబు రెడీ
సాక్షి, విజయవాడ: ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీఎం చంద్రబాబు అమలు కాని హామీలు ఇస్తున్నారని వైఎస్సార్సీపీ నేత బుద్దా నగేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 640 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రెండున్నర సంవత్సరాల పాటు టీడీపీతో అంటకాగిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నాని విమర్శించారు. ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ టీడీపీ ఇసుక దోపిడీలను ఎందుకు ప్రశ్నించ లేదని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆంధ్రా వర్సెస్ తెలంగాణ అంటూ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతున్నారు. పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారంటే మీరు టీడీపీని భుజాన వేసుకున్నటేనని అందరికి అర్థ మవుతుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పట్టిన నవరత్నాలను తెలుగుదేశం పార్టీ కాపీ కొట్టిందన్నారు. చివరి మూడు నెలలు పథకాల పేరుతో టీడీపీ గారడి చేయాలని చూస్తోందని అన్నారు. -
ప్రధాన మంత్రి రైతు పక్షపాతి
ఆత్మకూరురూరల్/వెలుగోడు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతు పక్షపాతి అని శ్రీశైలం నియోజకవర్గ బీజేపీ నాయకుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కేంద్రం 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచడం పట్ల వెలుగోడు, ఆత్మకూరు పట్టణాల్లో ఆ పార్టీ ఆధ్వర్యంలో రైతులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ని రైతన్నల ఆదాయం మెరుగుపడేలా కేంద్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందన్నారు. ప్రధానంగా వరి ధాన్యానికి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.200 పెంచుతున్నట్టు ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రజా పాలనను మరిచి పూర్తిగా అవినీతి మయమైన టీడీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని విమర్శించా రు. రైతు వ్యతిరేక టీడీపీని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. నీరు – చెట్టు కార్యక్రమం శ్రీశైలం ఎమ్మెల్యేకు కల్పతరువుగా మారింద న్నారు. మంజూరైన నిధుల్లో 90 శాతం స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చుట్టూ ఎప్పుడు కాంట్రాక్టర్లు, వ్యాపారులే ఉంటారని, ప్రజా సేవ చేయాలనే ఆలోచన ఆయనకు లేదన్నారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న బీజేపీపై టీడీపీ నాయకులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా పేరుతో మొసలి కన్నీరుకారుస్తున్నారని విమర్శించారు. వాస్తవాలు చెబుతున్న తమ పార్టీ నాయకులు దాడులు చేయించడం దారుణ మన్నారు. వరికి మద్దతు ధర ప్రకటించడం పట్ల వెలుగోడు పొట్టి శ్రీరాములు సెంటర్లో, ఆత్మకూరు గౌడ్ సెంటర్ బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లె కృష్ణారెడ్డి, నాయకులు సుబ్బారెడ్డి, విశ్వరూపాచారి, విశ్వనాథం, మౌళీ, బిజ్జం వెంకట సుబ్బారెడ్డి, చండ్ర వెంకటేశ్వరరెడ్డి, వెంకటకృష్ణ్ణ, ప్రతాప్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. -
అనుకరణ అనర్థదాయకం
ఒక అడవిలో ఒక సింహం ఉంది. అది ఒక గుహలో నివసిస్తూ, అనేక జంతువుల్ని వేటాడి తిని జీవిస్తోంది. ఒక రోజున ఆ సింహం ఒక అడవిదున్నను వేటాడి, కడుపు నిండా తిని, నెమ్మదిగా తన గుహకి వస్తూఉండగా, ఒక నక్క ఎదురైంది. సింహాన్ని చూసిన నక్కకు భయం వేసింది. పారిపోడానికి కాళ్లు రాలేదు. వెంటనే ఆలోచించి, సాష్టాంగ పడింది. అలా నేలమీద బొక్కబోర్లాపడ్డ నక్కని చూసి, ‘‘నక్కా! ఏమిది?’’ అని అడిగింది సింహం. ‘‘స్వామీ! నేను ఇకనుండి మీ దాసుణ్ణి. మీ సేవకుణ్ణి. మీతోనే ఉంటాను’’ అంది. ‘‘సరే’’ అని నక్కను తీసుకుపోయింది సింహం. ఆ నాటినుండి తాను వేటాడిన మాంసంలో నక్కకీ వాటా ఇచ్చింది. కొన్నాళ్లకి నక్క బాగా బలిసి దుక్కలా తయారైంది. తన బలానికి తానే అబ్బుర పడింది. ఆ వెంటే అహంకారం పొడసూపింది. ‘‘ఎప్పుడూ ఈ సింహమేనా వేటాడేది? నేనూ వేటాడతాను. నేనే మాంసం తెచ్చి ఈ సింహానికి పెడతాను. సింహం పాటి శక్తి నాకు లేదా?’’ అనుకుని ఒకరోజు ఈ విషయం సింహంతో చెప్పింది. సింహం వద్దని నక్కని వారించింది. ‘‘స్వామీ! నేనూ నీలా వేటాడగలను చూడు’’అంటూ పర్వతం మీదికి వెళ్లి కలియజూసింది. దానికి కొండకింద వెళ్తున్న ఏనుగు కనిపించింది. మోరెత్తి ఊళ వేసి ఎగిరి ఏనుగు కుంభస్థలం మీదికి దూకింది. ఏనుగు తొండంతో నక్కని చుట్టి, కాలికింద వేసి తొక్కి చంపింది. ఈర్ష్య, అసూయ, అర్థరహితమైన ఆలోచనలు ఎంతటి అనర్థాలో తెలియ చెప్పిన బుద్ధోపదేశం ఇది. – డా. బొర్రా గోవర్ధన్ -
బుద్ధులు ఇద్దరా? ఇద్దరూ ఒక్కరా?
అదో దాయాది వైరం. ఒకే తండ్రి సంతతైనా దేవదానవుల మధ్య ఆధిపత్య పోరు. సాగరమధనం చేసి అమృతం సాధించినా దక్కింది సురులకే. ఇక తీవ్ర తపస్సు చెయ్యడం, మరణం లేని జీవితం కావాలనడం, ప్రత్యక్షమైన దేవతలు సృష్టి విరుద్ధమైన కోరిక అనటం, నానా ఉపాయాలతో మరణం తప్పించుకునే కోరిక సాధించడం, దేవతలు త్రిమూర్తులను శరణు వేడటం, ఆ కోరికలోని లొసుగుల ద్వారా అసుర సంహారం జరగడం, వింత కోరిక కోరి చివరకు పగలూ రాత్రీ కాని సంధ్యా సమయంలో, ఇంటాబయట కాకుండా, నరుడూ మృగమూ కాకుండా నరమృగం చేత చచ్చిన హిరణ్య కశిపుడి కథ, వానరులంటే చిన్నచూపుతో వారిని విస్మరించిన రావణుడి కథ మరొకటి.. మరొకటి.. ఇలా ఎన్నెన్నో! తారకాసురుడి వంతు శివపుత్రుని చేత చావు కావాలన్నాడు తారకాసురుడు. కారణం సతీదేవి వియోగంతో శివుడు ఆత్మనిష్టలో ఉన్నాడు. ఇక ఆయన పెళ్లి, కుమారుడు కలగడం అసంభవం అనుకున్నారు.శివుడి ధ్యాస మరల్చడానికి దేవతలు విష్ణు మానసపుత్రుడు మన్మధుడిని తపోభంగం చెయ్యమన్నారు. తన సతి రతీదేవితో కలిసి వచ్చి చెరుకువింటితో పంచశరాలను సంధించాడు. శివుడి క్రోధానలంలోదగ్ధమయ్యాడు. ఈలోగా పర్వత రాజ పుత్రికగా పుట్టిన పార్వతి శివుడికి సపర్యలు చేసి, తీవ్ర తపస్సు చేసి భోళాశంకరుడిని పెళ్లాడింది. ఆ తర్వాత కుమార సంభవం, తారకాసుర సంహారం జరిగిపోయాయి. కథ ఇక్కడితో ఆగిపోలేదు తారకుడి కొడుకులు ముగ్గురు తీవ్ర తపస్సు చేసి, వరం చేత బంగారం, వెండి, ఇనుము (త్రి) పురాలను పొంది విహరించసాగారు. వేర్వేరు కక్ష్యలు, లోకాల్లో తిరిగే ఈ మూడు పురాలు వెయ్యేళ్లకొకసారి లిప్త కాలం పాటు ఒకే సరళరేఖ మీదకు వచ్చిన సమయంలో ఒకే బాణం దెబ్బకు మాత్రమే నాశనమవ్వాలని కోరుకున్నారు. వరగర్వంతో ముల్లోకాలను గడగడలాడిస్తున్న వీరిని సంహరించమని దేవతలు శివుడిని వేడుకున్నారు. మేరు పర్వతం చాపంగా మారగా, ఆదిశేషు అల్లెతాడు, విష్ణువు బాణం కాగా శివుడు ఆ త్రిపురాసుర సంహారం చేసి త్రిపురాంతకుడు, పురహరుడు అయ్యాడు. ఆ ధనుస్సు దేవతల ద్వారా దేవరాతునికి చేరింది. వారి వంశంలో ఒకడైన జనకుడి కూతురు జానకిని ఈ విల్లు విరిచే రాముడు పెళ్లాడాడు. అయితే, అంతకుముందు శరణు వేడిన దేవతలతో.. ‘‘త్రిపురాసురులు ధర్మ విరుద్ధమైన పనులు చెయ్యమంటారు. ఇది దాయాది వైరం మాత్రమే. అందుకే సహాయం చెయ్యనని’’ నిరాకరిస్తాడు శివుడు. వారిని ధర్మభ్రష్టులను చేసే పని చెయ్యడానికి మహావిష్ణువు మరో అవతారం ఎత్తవలసి వచ్చింది. అదే బుద్ధుడి అవతారం.బుద్ధుడి అవతారంలో వచ్చిన విష్ణువు త్రిపురాసురుల నగరాల్లో దైవం, పునర్జన్మలు, పాపపుణ్యాలను లేవని బోధించి నాస్తికతను వ్యాపింపచేశాడని, యజ్ఞక్రతువులు, అక్కడ జంతుబలులు ఆపించి ధర్మభ్రష్టులను చేసినందువల్ల వీరిని శివుడు సంహరించగలిగాడని ఒక కథ. ధర్మబద్ధుడు, అధర్మబుద్ధుడు హైందవం బౌద్ధాన్నీ వదలకుండా మింగేసి, బుద్ధుడిని అవతారంగా మార్చుకుందని విమర్శ. కాదు చరిత్రలో మనం చదువుకునే శాక్యముని బుద్ధుడు, పురాణ బుద్ధుడు వేర్వేరంటారు కొందరు.ఈ బుద్ధుడిని అవతారాల్లో ప్రస్తావించిన 12వ శతాబ్దం నాటి జయదేవ కవి ‘గీతగోవిందం’లోని ‘ప్రళయ పయోధి జలే’ అనే అష్టపదిని చూపుతారు కొందరు. కానీ అందులో కరుణా దృష్టితో యజ్ఞయాగాల్లో జంతుబలిని ఆపిన గౌతమ బుద్ధుడి వర్ణన ఉంటుంది!ఈ అష్టపదిలో కాకుండా బుద్ధావతారాన్ని వర్ణించిన కీర్తనలు మరేమైనా ఉన్నాయా? లేకేం.. పదకవితా పితామహుడు అన్నమయ్య కీర్తనల్లో కొన్ని దశావతార కీర్తనలు ఉన్నాయి. వాటిలో కొన్ని పరిశీలిస్తే బుద్ధుడి వర్ణన ఈ విధంగా ఉంది. కెలసి బిత్తల తిరిగేటి భూతం (పుడమి నిందరిబట్టె భూతము) ::: పొంచి సిగ్గెగ్గెరుగని బోయనాయుడు (పొడవైన శేషగిరి బోయనాయుడు) ::: ఆకసానబారే ఊరి అతివల మానముల కాకుసేయువాడు(తెప్పగా మర్రాకుమీద తేలాడు వాడు) ::: పురసతుల మానముల పొల్లసేసిన చేయి (ఇందరికి నభయంబులిచ్చు చేయి) ::: బిత్తల అంటే దిసమొల/దిగంబరత్వం అని అర్ధం. ఈ పదాన్ని కొద్ది మార్పులతో రాయలసీమ, తెలంగాణ, కర్ణాటకల్లో వాడుతారు. సిగ్గెగ్గులెరగని అన్నా కూడా దిసమొలతో తిరిగేవాళ్లను అంటారు.అతివల మానములు కాకుచేయువాడు, పురసతుల మానముల పొల్ల చేసిన అన్నప్పుడు.. విష్ణువు మాయారూపంలో వచ్చి పాతివ్రత్యాన్ని భంగం చేసిన తులసి, జలంధరుల కథలాగా పురసతులను బుద్ధావతారంలో మోసగించాడని అర్థమవుతుంది. ఈ కీర్తనలూ ఆ విషయాన్నే చెబుతున్నాయి.సింకసూపుల వాడు సిన్నెక్క (సిరుత నవ్వులవాడు సిన్నెక్క) ::: కోరి బుద్ధుడైన సిగ్గు (శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలుమంగ) ::: పరకాంతల భంగపరచకుంటే మేలు (సంసారమే మేలు సకల జనులకు) ::: మోస మింతుల జేయు మునిముచ్చు దొంగ (వీడివో యిదే వింతదొంగ) ::: పొంచి అసురకాంతలలో వెదకిన బుద్ధావతారంబైనాడు (ఇతనికంటే మరి దైవము గానము) ::: కొంగు జారినంతలోన కూలెను త్రిపురములు (హరీ నీ ప్రతాపమునకడ్డమేది లోకమున). శృంగేరిలో దిగంబర బుద్ధుడు దిగంబరత్వం జైనంలో ఉంది కానీ, బౌద్ధంలో కనిపించదు. ఈ బిత్తల బుద్ధుడు తెలుగు సంకీర్తనల్లో కనిపించాడు కానీ మిగిలిన చోట్ల ఉన్నాడా? ఉన్నాడు. సాహిత్యం సంగతేమో కానీ శిల్ప రూపంలో ఈ బిత్తల బుద్ధుడు కనిపిస్తాడు. అదే శృంగేరి లోని పురాతన విద్యాశంకర ఆలయం. హంపి విజయనగర స్థాపకులు హరిహర బుక్కరాయలు, వారి గురువు విద్యారణ్య స్వామి ఆదేశానుసారం 14 వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర. అదివరకే ఉన్న హోయసలాలయాన్ని పునర్నిర్మించారని కొందరు చరిత్రకారులు నిర్ధారించారు. ఈ విద్యాశంకర ఆలయం వెనుకవైపు విష్ణు అవతారాలను చెక్కారు. మత్స్య నుండి రాబోయే కల్కి వరకు మొత్తంగా 11 అవతారాలను చెక్కారు. దశావతారాలను ఎక్కువ ప్రాచుర్యంలోకి తెచ్చారు కానీ భాగవతానుసారం 24 విష్ణు అవతారాలు ఉన్నాయి. ఈ అవతార శిల్పాల్లో మరో ప్రత్యేకత పరశురాముడి ఆహార్యం క్షత్రియుణ్ణి పోలి ఉంటుంది. అన్నమయ్య వర్ణించిన సిగ్గెగ్గులెరగని బిత్తల అవతారం కూడా వీటిల్లో ఉంది. ఇంతకూ జంతుబలులు, యజ్ఞయాగాదులు నిరసించిన గౌతమ బుద్ధుడు, త్రిపురాల్లో నాస్తికత బోధించిన అవతార బుద్ధుడు ఒకరా? వేర్వేరా? మరింత పరిశోధనలు జరిగేవరకూ ఆలోచిస్తూ ఉందాం.ఈ బుద్ధావతారం కథ సంగతేమో కానీ అన్నమయ్య కంటే వందల ఏళ్ల పురాతనమైన ఈ ఆలయ మంటపంలో 12 స్తంభాలుంటాయి. వాటిమీద 12 రాశుల చిహ్నాలుంటాయి. వాటిని చూడగానే ఇన్ని రాసులయునికి అంటూ రాశులమీద ఉన్న కీర్తన గుర్తొస్తుంది. – గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి -
సమాజాన్ని సంస్కరించేది కవులు, రచయితలే
ఏపీ డిప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్ ఘనంగా యానాం కవితోత్సవం-2016 ఉభయ రాష్ట్రాల నుంచి రచయితలు, కవులు రాక యానాం టౌన్ : కవులు, రచయితలు చేసే రచనల ద్వారానే నిజమైన మార్పు వస్తుందని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. సమాజాన్ని సంస్కరించేది కవులు, రచయితలేనని, మంచి రచనలు సమాజ ఉన్నతికి దోహదపడతాయని చెప్పారు. స్థానిక కవి సంధ్య, స్ఫూర్తి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం యానాం కవితోత్సవం–2016 నిర్వహించారు. కవి సం«ధ్య అధ్యక్షుడు, ప్రముఖ కవి డాక్టర్ శిఖామణి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన గౌరవ అతి«థిగా ప్రసంగించారు. కవులు, రచయితలు తెలుగువారిలో భాషాభిమానం పెంపొందించడానికి మరింత కృషి చేయాలన్నారు. అప్పుడే కవులు, రచయితలు చేసే రచనలకు విలువ ఉంటుందన్నారు. కన్నడులకు, తమిళలకు ఉన్న భాషాభిమానం తెలుగువారిలో లోపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మన తెలుగు జాతి గొప్పది, మన భాష గొప్పది అన్న భావన అందరిలోనూ కలగాలని ఆకాంక్షించారు. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ సాహిత్యం సమాజానికి అవసరమని, కవిత్వం మనిషిని స్పందింపజేస్తుందని చెప్పారు. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ కవి కె.శివారెడ్డి ‘మానవ నాగరికత– కవిత్వం’ అంశంపై మాట్లాడారు. మానవ వికాసానికి సాహిత్యం దోహదం చేస్తుందన్నారు. ఏపీ గిరిజన సహకార సంస్థ ఎండీ, ప్రముఖ కవి ఆకెళ్ల రవిప్రకాష్ మాట్లాడుతూ గతంలో తాను యానాం పరిపాలనాధికారిగా పనిచేశానని, అప్పట్లో కవిత్వం మీద ఉన్న ఆసక్తితో తొలిసారి ఉగాదికి కవిసమ్మేళనం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డాక్టర్ శిఖామణి మాట్లాడుతూ ఎర్రన రచించిన పద్యాన్ని తనదైన శైలిలో వినిపించారు.శిఖామణి సాహితీ తొలి పురస్కారం కె.శివారెడ్డికి ప్రదానం చేయాలని కమిటీ నిర్ణయించినట్టు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి కాలే సాయినాథ్, మధునాపంతుల సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇన్సెర్టు కవితోత్సవం–2016 ప్రారంభం యానాం గోదావరి తీరం శనివారం సాహితీ సుగంధాలతో పులకించింది. వివిధ ప్రాంతాల నుంచి కవులు, రచయితలు తరలివచ్చి తమ సాహిత్యం, కవిత్వంతో సాహితీ ప్రియులను, అభిమానులను అలరించారు. కవిసంధ్య సాహితీ, సాంస్కృతిక సంస్థ, స్ఫూర్తి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక గాజుల గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన బొజ్జా తారకం, ఆవత్స సోమసుందర్ ప్రాంగణంలో యానాం కవితోత్సవం–2016ను నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకను ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు దివంగత మంగళంపల్లి బాల మురళీకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు సుప్రసిద్ధ కవులు కె.శివారెడ్డి, కొలకలూరి ఇనాక్, ప్రముఖ చిత్రకారులు శ్రీలా వీర్రాజు, అక్బర్, ఏపీ గిరిజన సహకార సంస్థ ఎండీ, కవి ఆకెళ్ల రవిప్రకాష్ , ఇండియా టూరిజం ఏడీ తుల్లిమల్లి విల్సన్‌సుధాకర్, కవిసంధ్య అధ్యక్షుడు డాక్టర్ శిఖామణి, కవి దాట్ల దేవదానంరాజు, డాక్టర్ వరుగు భాస్కరరెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం సభా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల నుంచి కవులు, రచయితలు, సాహితీప్రియులు, అభిమానులు పాల్గొన్నారు. పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు సహకారం, ఏపీ భాషా సాంస్కృతిక శాఖ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి కళలు, సాంస్కృతికశాఖ సౌజన్యంతో డాక్టర్ శిఖామణి సారథ్యలో ఈ కవితోత్సవాన్ని నిర్వహించారు. -
బుద్ధవనంలో విదేశీయుల సందడి
నాగార్జునసాగర్: శ్రీపర్వతారామంలోని బుద్ధవనాన్ని శనివారం 14 దేశాలకు చెందిన ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా 40 అడుగుల బుద్ధుడి విగ్రహాన్ని, మ్యూజియంను సందర్శించారు. అనంతరం ఫణిగిరితో పాటు, ఖమ్మం జిల్లాలోనే నేలకొండపల్లిని సందర్శించేందుకు వెళ్లారు. సాగర్‌కు వచ్చిన వారిలో ఆస్ట్రేలియాకు చెందిన కుహదాస్ వివేకానంద, జర్మనీకి చెందిన గెర్డ్ మథియాస్ డెకెర్ట్, గ్రీస్‌రం చెందిన తెకహరిదౌఅతనాస్య, ఇటలీకి చెందిన అనియోలోడెల్‌గట్టో, గబ్రీలా, బాల్దిని, ఆంటోనియా అర్టోలెవతో పాటు మలేసియా, నెదర్లాండ్, తైవాన్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. వీరివెంట పర్యాటక సంస్థ జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్రావు, గైడ్ సత్యనారాయణ, శ్యాంలు ఉన్నారు. -
అమర్ బుడ్డా నాథ్
-
బుద్ధగయలో వరుస బాంబు పేలుళ్లు