Published
Sat, Aug 20 2016 10:04 PM
| Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలి
నేరేడుచర్ల : నాగార్జున్‌సాగర్ ఎడమ కాల్వకు సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, బీజేపీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీల నాయకులు మాట్లాడుతూ రెండేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల సాగు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బోర్లు, బావుల కింద నాట్లు వేసినా భూగర్భ జలాలు అడుగంటడంతో అవి ఎండిపోతున్నాయన్నారు. ప్రభుత్వం తక్షణమే ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇనుపాల పిచ్చిరెడ్డి, బెల్లంకొండ గోవింద్ గౌడ్, సీపీఎం నాయకులు సుంకరి క్రాంతికుమార్, యడ్ల సైదులు, సీపీఐ నాయకులు ధనుంజయనాయుడు, శ్రీను, సత్యం, టీడీపీ నాయకులు కందిబండ పద్మనాభం, ఆదిరెడ్డి, వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు అకారపు వెంకటేశ్వర్లు, భూక్యా గోపాల్, రామకృష్ణ పాల్గొన్నారు.