nereducharla
-
భువనగిరి, నేరేడుచర్లలో నెగ్గిన అవిశ్వాసం
భువనగిరిటౌన్/నేరేడుచర్ల: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం రెండు మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు నెగ్గాయి. భువనగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీల చైర్మన్ పదవులను బీఆర్ఎస్ కోల్పోయింది. భువనగిరి మున్సిపాలిటీలో 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు బీజేపీ, కాంగ్రెస్ సభ్యులతో కలిసి సొంత పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 36 మంది సభ్యులుండగా మంగళవారం నిర్వహించిన అవిశ్వాస ప్రత్యేక సమావేశానికి 31 మంది హాజరయ్యారు. 16 మంది బీఆర్ఎస్, 9 మంది కాంగ్రెస్, ఆరుగురు బీజేపీ కౌన్సిలర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరంతా చైర్మన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసానికి మద్దతుగా చేతులెత్తారు. దీంతో అవిశ్వాసం నెగ్గింది. నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాసం కూడా నెగ్గింది. ఈ మున్సిపాలిటీలో 15 మంది కౌన్సిలర్లు ఉండగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వైస్ చైర్పర్సన్ తన పదవికి రాజీనామా చేశారు. మొదట బీఆర్ఎస్కు ఏడుగురు కౌన్సిలర్లు ఉండగా.. వైస్ చైర్పర్సన్ రాజీనామా చేయడంతోపాటు ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు చైర్మన్‌తో కలిసి ముగ్గురు, సీపీఎంకు ఒకరు, కాంగ్రెస్‌కు పది మంది సభ్యులున్నారు. మంగళవారం జరిగిన అవిశ్వాస సమావేశానికి చైర్మన్ మినహా అందరూ హాజరయ్యారు. చైర్మన్‌పై అవిశ్వాసానికి మద్దతుగా 13 మంది కౌన్సిలర్లు చేతులెత్తారు. దీంతో అవిశ్వాసం నెగ్గింది. -
నేరేడుచర్ల మున్సిపాలిటి టీఆర్ఎస్ కైవసం
-
‘కారు’ జోరు; నేరేడుచర్లలో ఉత్కంఠ
సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో ఒక్కస్థానం మినహా అన్నింటిని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చండూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఎక్స్ ఎక్స్ అఫిషియో ఓటు వివాదంతో నేరేడుచర్లలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సమానంగా ఓట్లు రావడంతో నేరేడుచర్ల ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఉదయం కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం తర్వాత నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా, పది మున్సిపాలిటీల్లోనే స్పష్టమైన ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్.. ఎక్స్ అఫిషియో సభ్యులు, స్వతంత్రులు, సీపీఎం మద్దతుతో మిగిలి 16 స్థానాలను కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వివరాలు.. 1. నల్గొండ మున్సిపల్ చైర్మన్‌గా మందడి సైదిరెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ ఎన్నిర మంగళవారానికి వాయిదా పడింది. 2. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్‌గా తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్‌గా కుర్ర కోటేశ్వరరావు ఎన్నిక 3. దేవరకొండ మున్సిపల్ చైర్మన్‌గా ఆలంపల్లి నర్సింహ్మ, వైస్ చైర్మన్‌గా ఎం.డీ రహాత్ అలీ ఎన్నిక 4. నందికొండ-సాగర్ మున్సిపల్ చైర్మన్‌గా కర్ణ అనూష వైస్ చైర్మన్‌గా మంద రఘువీర్ ఎన్నిక 5. హాలియా మున్సిపల్ చైర్మన్‌గా వెంపటి పార్వతమ్మ, వైస్ చైర్మన్‌గా సుధాకర్ ఎన్నిక 6. చిట్యాల మున్సిపల్ చైర్మన్‌గా కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి, వైస్ చైర్మన్‌గా కూరేళ్ల లింగస్వామి ఎన్నిక 7. చండూరు మున్సిపల్ చైర్మన్‌గా తోకల చంద్రకళ (కాంగ్రెస్), వైస్ చైర్మన్‌గా దోటి సుజాత ఎన్నిక 8. యాదాద్రి-భువనగిరి జిల్లా: భువనగిరి మున్సిపల్ చైర్మన్‌గా ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య ఎన్నిక 9. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్‌గా ఎరుకల సుధ ఎన్నిక 10. ఆలేరు మున్సిపల్ చైర్మన్‌గా వసపరి శంకరయ్య ఎన్నిక 11. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్‌గా వెన్ రెడ్డి రాజు, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం(సీపీఎం) ఎన్నిక 12. మోత్కూరు మున్సిపల్ చైర్మన్‌గా టిపిరెడ్డి సావిత్రి, వైస్ చైర్మన్‌గా బొల్లేపల్లి వెంకటయ్య ఎన్నిక 13. భూదాన్ పోచంపల్లి మున్సిపల్ చైర్మన్‌గా చిట్టిపోలు విజయలక్ష్మి, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి ఎన్నిక 14. సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపల్ చైర్మన్‌గా పెరుమాళ్ళ అన్నపూర్ణ, వైస్ చైర్మన్‌గా పుట్ట కిషోర్ ఎన్నిక 15. కోదాడ మున్సిపల్ చైర్మన్గ వనపర్తి శిరీష,వైస్ చైర్మన్‌గా వెంపటి పద్మ ఎన్నిక 16. హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్‌గా అర్చన రవి, వైస్ చైర్మన్‌గా జక్కుల నాగేశ్వరరావు ఎన్నిక 17. తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్‌గా పోతరాజు రజిని ఎన్నిక 18. నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారం జరుగుతుంది. -
తీవ్ర గందరగోళం.. చైర్మన్ ఎన్నిక వాయిదా..!
సాక్షి, సూర్యాపేట : నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పంతం నెగ్గించుకుంది. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావుకు నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేయడానికి ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఆదేశాలు ఇచ్చారు. నేరేడుచర్ల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాలను ఆయన రద్దు చేశారు. మొత్తం 15 వార్డులున్న నేరేడుచర్లలో టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 7, సీపీఎం 1 స్థానంలో విజయం సాధించాయి. కాంగ్రెస్, సీపీఎం కూటమిగా ఉన్నాయి. అయితే, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 19 మంది చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో పాల్గొంటారని రిటర్నింగ్ అధికారి జాబితాలో పేర్కొన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కేవీపీ రామచందర్‌రావు ఓటు పెట్టుకున్నా జాబితాలో లేకుండా పోయింది. (చదవండి : ఉత్కంఠ వీడింది.. మేయర్ పీఠం వారిదే..!) టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు సభ్యులు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బోడకంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎక్స్ అఫిషియోగా నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. అయితే, తెలంగాణకు కేటాయించిన కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్రావును ఎక్స్ అఫీషియో సభ్యుడిగా దరఖాస్తూ పెట్టుకున్నా ఓటు హక్కు కల్పించలేదని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్త చేసింది. ఈమేరకు ఎన్నికల కమిషనర్‌ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంప్రదించగా.. ఆయనపై విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఇక 3 ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి టీఆర్ఎస్కు 10 మంది బలం ఉండగా.. 2 ఎక్స్ అఫీషియో ఓట్లు, సీపీఎం మద్దతుతో కలిపి కాంగ్రెస్ సంఖ్యా బలం 10కి చేరింది. ఇరు పార్టీల సంఖ్యా బలం సమానంగా మారడంతో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవనుంది. రేపటికి వాయిదా..! సాక్షి సూర్యాపేట : నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియలో హైడ్రామా నడిచింది. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావును లోనికి అనుమంతించడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్‌ను విరగ్గొట్టారు. చేతిలో ఉన్న పేపర్లను చించేశారు. దీంతో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కేవీపీకి ఓటు హక్కు కల్పించడం పట్ల అభ్యంతరం తెలిపిన టీఆర్ఎస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని కోరింది. తీవ్ర గందరగోళం నేపథ్యంలో చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. -
పేదలకు దుప్పట్లు పంపిణీ
నేరేడుచర్ల : పేదలకు జ్యోతి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని మిర్యాలగూడ డీఎస్పీ ఎన్. రాంగోపాల్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక సీతారామనర్సయ్య టౌన్హాల్లో జ్యోతి ఫౌండేషన్ ఆ«ధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి మొక్కలను నాటారు. కార్యక్రమంలో జ్యోతి ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కె. సుజాత, హుజుర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి పసుపులేటి నర్సింహారావు, పెంచికల్‌దిన్నె సర్పంచ్ సుంకర క్రాంతికుమార్, పోరెడ్డి వెంకటరమణరెడ్డి పాల్గొన్నారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి
పెంచికల్‌దిన్నె (నేరేడుచర్ల) : ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వజ్రోత్సవ కార్యక్రమానికి హాజరై అదనపు తరగతి గదులు, డిజిటల్ క్లాస్ రూం ప్రారంభించి మాట్లాడారు. పాఠశాలలు ఆధునిక దేవాలయాలని..ఉపాధ్యాయులు దేవుళ్లు అని వారిని గుర్తించినప్పుడే గ్రామం ఉన్నతంగా ఉంటుందన్నారు. తాము జన్మించిన గ్రామానికి విద్యను అభ్యసించిన పాఠశాల అభివృద్ధికి చేయూతనివ్వాలన్న లక్ష్యం గొప్పదన్నారు. దేశ విదేశాలలో స్థిరపడిన గ్రామస్తులు పాఠశాల అభివృద్ధికి నిధులు ఇవ్వడం ప్రశంసనీయమన్నారు. ప్రతి గ్రామం పెంచికల్‌దిన్నె గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుంటే దేశం ముందంజలో ఉంటుందన్నారు. గ్రామాభివృద్ధికి పెంచికల్‌దిన్నె అసోసియేషన్ సోషల్ సర్వీసెస్ ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. సంస్థ లక్ష్యం నేరవేరె దిశగా కృషి చేయాలని కోరుతూ పాస్ లోగోను ఆవిష్కరించారు. అనంతరం గతంలో పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులను సత్కరించారు. సర్పంచ్ సుంకరి క్రాంతికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సోసైటీ, రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గున్రెడ్డి కోటిరెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ ఆరిబండి ప్రసాదరావు, రిటైర్డ్ జిల్లా ఉప విద్యాధికారి వల్లంశెట్ల కృష్ణారావు, జర్నలిస్ట్‌ల యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు కె.సత్యనారాయణ, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ నాగపద్మజ, ఈఓఆర్డీ జ్యోతిలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు విజయకుమారి, రమణారెడ్డి, పాస్ అధ్యక్షుడు వలంశెట్ల లచ్చయ్య, సభ్యులు జ్యోతి, వల్లంశెట్ల నర్సింహారావు, డాక్టర్ యశోద, డాక్టర్ రవి, ఎంపీటీసీ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
నేరేడుచర్ల నేరేడుచర్ల మండలం మేడారం వద్ద నాగార్జున్‌సాగర్ ఎడమకాల్వలో బుధవారం గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. వివరాలు.. మేడారం వద్ద నాగార్జునసాగర్ ఎడమకాల్వలో గుర్తుతెలియని శవం కొట్టుకు వస్తుండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ జి.గోపి సిబ్బందితో కాల్వ వద్దకు వెళ్లి నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని బయటకు తీసి మిర్యాలగూడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, శరీరంపై ఉన్న చొక్కాపై మెగా టైలర్స్, ఎస్పీటీ మార్కెట్ నల్లగొండ అని స్టిక్కర్ ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపి తెలిపారు. -
మట్టారెడ్డికి గట్టు పరామర్శ
బొత్తలపాలెం (నేరేడుచర్ల) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుందూరు మట్టారెడ్డిని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. ఇటీవల మట్టారెడ్డి తండ్రి కుందూరు నర్సిరెడ్డి మృతి చెందగా శ్రీకాంత్‌రెడ్డి బొత్తలపాలెంలో ఆయన నివాసంలో పరామర్శించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఇనుపాల పిచ్చిరెడ్డి తల్లి ఇటీవల మరణించగా ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల పల్లి భాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్‌రెడ్డి, కోడి మల్లయ్య యాదవ్, హుజూర్నగర్ మండల అధ్యక్షుడు జడ రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు గుర్రం వెంకటరెడ్డి, జిల్లా కోశాధికారి పిల్లి మరియదాస్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కట్టల ముత్తయ్య, సుందర్‌బాబు, లింగారెడ్డి, గోవింద్ గౌడ్, మట్టయ్య, ఉపేంద్రచారి, గజ్జల కోటేశ్వరరావు, పాపయ్య, రాంరెడ్డి, సైదా నాయక్, తదితరులు పాలొన్నారు. -
ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలి
నేరేడుచర్ల : నాగార్జున్‌సాగర్ ఎడమ కాల్వకు సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, బీజేపీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీల నాయకులు మాట్లాడుతూ రెండేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల సాగు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బోర్లు, బావుల కింద నాట్లు వేసినా భూగర్భ జలాలు అడుగంటడంతో అవి ఎండిపోతున్నాయన్నారు. ప్రభుత్వం తక్షణమే ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇనుపాల పిచ్చిరెడ్డి, బెల్లంకొండ గోవింద్ గౌడ్, సీపీఎం నాయకులు సుంకరి క్రాంతికుమార్, యడ్ల సైదులు, సీపీఐ నాయకులు ధనుంజయనాయుడు, శ్రీను, సత్యం, టీడీపీ నాయకులు కందిబండ పద్మనాభం, ఆదిరెడ్డి, వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు అకారపు వెంకటేశ్వర్లు, భూక్యా గోపాల్, రామకృష్ణ పాల్గొన్నారు. -
పాఠశాలలో లైబ్రరీ గది ప్రారంభం
(నేరేడుచర్ల) : మండలంలోని దిర్శించర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లైబ్రరీ గదిని సర్పంచ్ నన్నెపంగ వెంకటలక్ష్మీ సోమవారం ప్రారంభించారు. పాఠశాలలో గతంలో ఉన్న లైబ్రరీ గది శిథిలావస్థకు చేరుకోగా హెచ్ఎం మధు వినతి మేరకు సర్పంచ్ వెంకటలక్ష్మీ సొంత ఖర్చులతో గదికి మరమ్మతులు చేయించారు. పాఠశాలకు లైబ్రరీ గదిని ఏర్పాటుచేయడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం మధు, మాజీ సర్పంచ్ జె. సైదులు, విద్యాకమిటీ చైర్మన్ వెంకన్న, సైదులు, కోటేశ్వరరావు, శ్రీను, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ముస్తాబైన మహంకాళిగూడెం పుష్కరఘాట్
నేరేడుచర్ల : ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల కోసం మండలంలోని మహంకాళిగూడెం పుష్కరఘాట్ ముస్తాబైంది. గతంలో ఉన్న ఘాట్ పక్కన నూతనంగా మరో ఘాట్ పనులు పూర్తికావడంతో నదికి అడ్డంగా రెయిలింగ్ ఏర్పాటుచేసి, ఘాట్లకు రంగులు వేయడంతో పుష్కర శోభను సంతరించుకుంది. మహంకాళిగూడెం పుష్కర ఘాట్ సమీపంలో బారీకేడ్లు ఏర్పాటుచేయడంతో పాటు పోలీసు, రెవెన్యూ, వైద్య, అగ్నిమాపక కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. పుష్కరాల సందర్భంగా నదిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా 30 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు తాగునీరు అందించేందుకు ప్రతి 50 మీటర్లకు ఒకటి చొప్పున నల్లాలను ఏర్పాటు చేశారు. భక్తుల వాహనాలను పార్కింగ్ చేసేందుకు మహంకాళిగూడెం సమీపంలో పార్కింగ్ స్థలాన్ని చదును చేసి రోడ్లు వేశారు. బైపాస్ రోడ్డు ద్వారా ట్రాఫిక్‌ను మళ్లించేందుకు పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇరువైపులా బైపాస్ రోడ్డును కొంతమేర బీటీ మెటల్‌తో వేశారు. నేరేడుచర్ల నుంచి మహంకాళీగూడెం వరకు 25 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు వేసి రోడ్డుపై మార్కింగ్ చేయడం పూర్తి చేశారు. ఘాట్‌కు సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయం, మహంకాళి ఆలయంలో భక్తుల దర్శనార్ధం ఏర్పాట్లు పూర్తి చేశారు. నిరంతర విద్యుత్ కోసం ఆ శాఖ ఆధ్వర్యంలో సైతం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఘాట్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పరిస్థితులను గమనించేందుకు 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు పుష్కర స్నానం చేసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. -
వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించిన హరితహారం ప్రత్యేక అధికారి
నేరేడుచర్ల : నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని నల్లగొండ, ఖమ్మం జిల్లాల హరితహారం ప్రత్యేక అధికారి, సంయుక్త సంచాలకులు ఆర్. లక్ష్మణుడు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో నాటిన మొక్కలను పరిశీలించి మొక్కల సంరక్షణ కోసం పలు సూచనలు చేశారు. మరో 500 మొక్కలను కార్యాలయం అవరణలో నాటాలని మార్కెట్ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట నేరేడుచర్ల మార్కెట్ కార్యదర్శి అమరలింగేశ్వరరావు, సిబ్బంది వెంకన్న తదితరులు ఉన్నారు. -
వేగంగా పుష్కరఘాట్ నిర్మాణ పనులు
నేరేడుచర్ల : మండలంలోని మహంకాళిగూడెం వద్ద పుష్కర ఘాట్ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. ఘాట్ ఇన్చార్జి, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్ పర్యవేక్షణలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ ఘాట్ నిర్మాణానికి రూ. 2.65 కోట్లు మంజూరు కాగా, గతంలో ఉన్న ఘాట్‌కు అదనంగా 60 మీటర్ల మేరకు విస్తరించి మెట్లు నిర్మించారు. ప్రస్తుతం రక్షణ కోసం ఇనుప జాలీలను నిర్మిస్తున్నారు. పుష్కర ఘాట్‌లో యాత్రికుల సౌకర్యార్ధం 10 స్నానపు గదులు, 10 మరుగు దొడ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మహంకాళీగూడెంనకు బీటీ రెన్యువల్ పనులు మండలంలోని నర్సయ్యగూడెం నుంచి గుడగుండ్ల పాలెం వరకు పూర్తి చేశారు. పుష్కరఘాట్ నుంచి 1.7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహంకాళీగూడెం దేవాలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లే రహదారికి రూ. 45 లక్షలు మంజూరు చేయగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నేరేడుచర్లలోని బైపాస్ రోడ్డుకు హుజుర్నగర్ రోడ్డు నుంచి జాన్‌పహాడ్ రోడ్డు వరకు బీటీ నిర్మాణ పనులు చేపడుతుండగా, మిర్యాలగూడ రోడ్డు నుంచి జాన్‌పహాడ్ రోడ్డు వరకు రూ. 20 లక్షలతో మెటల్ రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఘాట్ సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. మంచినీటి సౌకర్యం కోసం రూ. 15.32 లక్షలతో నీటి శుద్ధి యంత్రాన్ని అమర్చేందుకు తాత్కాలిక గదిని నిర్మించారు. భక్తుల సౌకర్యార్థం పలు చోట్ల మంచినీటి నల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కొరకు మహంకాళీగూడెం గ్రామ శివారులోని పార్కింగ్ స్థలాలను చదును చేస్తున్నారు. నీరు వస్తేనే పుష్కరస్నానం పుష్కర ఘాట్ వద్ద ప్రస్తుతం ఉన్న నీటి మట్టానికి సుమారు 15 అడుగుల ఎత్తులో ఘాట్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. దీంతో నదిలో నీటి మట్టం పెరిగితేనే ఘాట్‌లో స్నానం ఆచరించేందుకు వీలు ఉంటుంది. ఆగస్టు 12 పుష్కరాల ప్రారంభం రోజు వరకు ఘాట్‌లోకి నీరు వస్తుందని అటు అధికారం యంత్రాంగం, ఇటు ప్రజలు భావిస్తున్నారు. గతంలో పుష్కరాలకు హాజరైన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. -
లీకేజీ బాధ్యులపై చర్య తీసుకోవాలి : ఆదిరెడ్డి
నేరేడుచర్ల : ఎంసెట్–2 పేపర్ లీకేజీ బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నేరేడుచర్లలో నిర్వహించిన సీపీఐ 6వ మండల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ అసమర్థత వలన పేపర్ లీకేజీ అయిందని సంబంధిత మంత్రులు, ఎంసెట్ కన్వీనర్‌ను వెంటనే రాజీనామా చేయాలన్నారు. పేపర్ లీకేజీపై సీబీఐచే విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రంలో ప్రజా స్వామ్య పద్ధతిలో కాకుండా అఖిలపక్ష సలహాలు తీసుకోకుండా నియంతృత్వ ధోరణితో పాలన నిర్వహిస్తుందన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణంలో భూములు కోల్పొతున్న వారికి 2013 చట్టం ప్రకారం పునరావాసం కల్పించి అన్ని వసతులు కల్పించాలన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసగిస్తుందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ నియోజకవర్గ ఇన్చార్జి గన్నా చంద్రశేఖర్‌రావు, నేరేడుచర్ల, హుజుర్నగర్, దామరచర్ల మండల కార్యదర్శులు డి. ధనుంజయనాయుడు, పాలకూరి బాబు, రాతిక్రింది సైదులు, దొడ్డా నారాయణరావు, కుందూరు సత్యనారాయణరెడ్డి, బాదె నర్సయ్య, అంబటి భిక్షం, లక్ష్మీ, సత్యానంద, కత్తి శ్రీనివాస్‌రెడ్డి, చిలకరాజు శ్రీను, సింహాద్రి, జాన్ తదితరులు పాల్గొన్నారు.