వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించిన హరితహారం ప్రత్యేక అధికారి
వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించిన హరితహారం ప్రత్యేక అధికారి
Published Mon, Aug 8 2016 10:21 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
నేరేడుచర్ల : నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని నల్లగొండ, ఖమ్మం జిల్లాల హరితహారం ప్రత్యేక అధికారి, సంయుక్త సంచాలకులు ఆర్. లక్ష్మణుడు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో నాటిన మొక్కలను పరిశీలించి మొక్కల సంరక్షణ కోసం పలు సూచనలు చేశారు. మరో 500 మొక్కలను కార్యాలయం అవరణలో నాటాలని మార్కెట్ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట నేరేడుచర్ల మార్కెట్ కార్యదర్శి అమరలింగేశ్వరరావు, సిబ్బంది వెంకన్న తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement